విద్యుత్తు మంత్రిత్వ శాఖ
'నర్మదా ల్యాండ్‌స్కేప్ పునరుద్ధరణ ప్రాజెక్టు' కోసం భోపాల్‌లోని ఐఐఎఫ్ఎంతో ఎన్‌టీపీసీ అవగాహన ఒప్పందం
- నర్మదా బేసిన్‌లో స్థిరమైన ప్రకృతి దృశ్యపు పద్ధతుల నిర్వహణకు ప్రోత్సాహక యంత్రాంగపు ఏర్పాటు ఈ ప్రాజెక్టు లక్ష్యం
Posted On:
07 DEC 2020 3:59PM by PIB Hyderabad
భారత దేశపు అతిపెద్ద సమీకృత విద్యుత్ కంపెనీలలో ఒక్కటి.. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలోని విద్యుత్ కంపెనీలలో ఒకటైన ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌టీపీసీ లిమిటెడ్ 'నర్మదా ల్యాండ్‌స్కేప్ పునరుద్ధరణ ప్రాజెక్టు'ను అమలు చేయడానికి డిసెంబర్ 4న భోపాల్ 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్' (ఐఐఎఫ్ఎమ్)తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమానికి ఎన్‌టీపీసీ లిమిటెడ్ సంస్థ , యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యుఎస్ఏఐడీ) నుండి సమాన నిష్పత్తిలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ సహాయం లభిస్తుంది. ఓంకరేశ్వర్, మహేశ్వర్ ఆనకట్టల మధ్య నర్మదా నది యొక్క ఎంచుకున్న ఉప నదుల పరీవాహక ప్రాంతాలలోనూ.. మధ్యప్రదేశ్లోని ఖార్గోన్ జిల్లాలో దాదాపు 4 సంవత్సరాలు ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేయనున్నారు.
పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎఫ్ & సీసీ) పరిధిలో భోపాల్‌లోని ఐఐఎఫ్ఎమ్ ఒక స్వయంప్రతిపత్తి సంస్థగా పని చేస్తోంది.
అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒక స్థిరమైన, సమగ్ర ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించేలా అంతర్-ప్రభుత్వ సంస్థ 'గ్లోబల్ గ్రీన్ గ్రోత్ ఇన్‌స్టిట్యూట్ తో (జీజీజీఐ) సంయుక్తంగా ఈ ప్రాజెక్టును అమలు చేయనుంది. అమెరికా దేశ ప్రభుత్వ అంతర్జాతీయ అభివృద్ధి విభాగమైన యుఎస్‌ఐఐడీ నిధులతో జీజీఐ ఈ ప్రాజెక్టులో పాల్గొంటుంది. ఎన్ఎల్ఆర్‌పీ సహకారం మరియు పాల్గొనే విధానం దిగువ నీటి వనరులపై అప్‌స్ట్రీమ్‌ను స్థిరంగా నిర్వహించబడేలా అటవీ మరియు వ్యవసాయ పద్ధతుల యొక్క పరస్పర ఆధారితను ప్రదర్శిస్తుంది. ఈ స్థిర ప్రకృతి దృశ్యం పద్ధతుల నిర్వహణకు నర్మదా బేసిన్‌లోని రిపారియన్ అటవీ మరియు వ్యవసాయ వర్గాలకు మద్దతునిచ్చే ప్రోత్సాహక యంత్రాంగం ఏర్పాటు చేయడం ప్రాజెక్టు లక్ష్యం. ఇది నర్మదా నదిలోని ఉపనదుల్లో నీటి నాణ్యత, పరిమాణాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్‌టీపీసీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఎస్‌ఎస్ఈఏ) & సీఎస్‌ఓ ఎస్.ఎం.చౌదరి మాట్లాడుతూ “ఎన్‌టీపీసీ లిమిటెడ్ తన వ్యాపారాన్ని మరియు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) ద్వారా దేశం యొక్క స్థిర అభివృద్ధి, సమాజ ఆర్థిక మరియు సామాజిక అభ్యున్నతికి ఆరోగ్యకరపు వాతావరణాన్ని పెంపొందించడానికి కట్టుబడి ఉంది” అని అన్నారు. “ఎన్‌ఎల్‌ఆర్‌పీ ద్వారా, పర్యావరణ వ్యవస్థ సేవలను, ప్రధానంగా నీటిని పెంచడానికి ప్రకృతి ఆధారిత పరిష్కారాలను ప్రదర్శించడానికి ఎన్‌టీపీసీ లిమిటెడ్ సంస్థ తన మద్దతును అందిస్తోంది. ఎన్ఎల్ఆర్‌పీ యొక్క థీమ్ భూమి, నీరు, గాలికి సంబంధించిన స్వచ్ఛమైన మరియు స్థిరమైన వాతావరణానికి దోహదం చేసేలా ఎన్‌టీపీసీ సంస్థ స్థిరత్వ విధానంతో అనుసంధానించబడి ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖార్గోన్ జిల్లాలోని నర్మదా నది పరీవాహక ప్రాంతంలోని రైతులు, అటవీ వర్గాలతో పాటు మహిళలకు ప్రయోజనం చేకూర్చే ఈ ప్రాజెక్టులో ఐఐఎఫ్ఎమ్, జీజీజీఐ మరియు యుఎస్‌ఐఐడీతో భాగస్వామ్యం కావడం ఎంతో గర్వంగా.. ఉత్సాహంగా ఉంది.” అని అన్నారు. భోపాల్‌లోని ఐఐఎఫ్ఎం సంస్థ డైరెక్టర్ డాక్టర్ పంకజ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, “ఎన్‌టిపీసీ - ఐఐఎఫ్ఎమ్ - జీజీజీఐ - యుఎస్‌ఐఐడీ సహకారంతో ఈ బృందం ప్రాజెక్ట్ కొత్త విస్టాస్‌ను తెరుస్తుంది. ఇది నీటి నాణ్యతను కాపాడుకోవడం, స్మార్ట్ సిటీలలో చక్కటి మార్గాల్ని ప్రవేశపెట్టడం పట్టణ నీటి సరఫరా శుద్దీకరణకు మేటిగా వాటర్ షెడ్‌లను నిర్వహించడానికి ఇది ఉపయోగపడుతుంది.” అని అన్నారు. "సహజ అడవుల పర్యావరణ వ్యవస్థ సేవల నిర్వహణ కోసం దిగువ గ్రామీణ వర్గాలకు ప్రోత్సాహకాలు మరియు సహజంగా నీటి శుద్దీకరణ కోసం మానవ నిర్మిత బఫర్‌లను సృష్టించడం, ఇండోర్ నగర నీటి వినియోగదారులతో పాటు గ్రామాల నివాసితులకు మూలంగా ఉన్న నీటి జోన్లకు ఇది ఉభయ ఉపయుక్తపు పరిస్థితికి దారి తీస్తుంది.” ప్రోత్సాహక విధానం, నీటి నాణ్యత మరియు పరిమాణంలో దాని మెరుగుదల ఇండోర్ నగరానికి ఎంతో మేలు చేస్తాయని భావిస్తున్నారు, ఇది
మునిసిపల్ నీటి సరఫరాలో 60% పైగా నర్మదా నది నుండి తీసుకునేలా దోహదం చేస్తుందని తెలిపారు.
***
(Release ID: 1678967)
Visitor Counter : 175