జల శక్తి మంత్రిత్వ శాఖ
జార్ఖండ్ లో జలజీవన్ మిషన్ బృదంపర్యటన పథకం అమలులో సాంకేతిక సహాయం అందించడమే లక్ష్యం
Posted On:
03 DEC 2020 4:53PM by PIB Hyderabad
గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ కుళాయి కనెక్షన్.తో మంచినీటిని సరఫరా లక్ష్యంతో చేపట్టిన జలజీవన్ మిషన్ (జె.జె.ఎం.) పథకం,.. జార్ఖండ్.లో అమలు జరుగుతున్న తీరుపై మధ్య సంవత్సర సమీక్షలో భాగంగా జాతీయ జలజీవన్ మిషన్ ప్రతినిధుల బృందం 2020 డిసెంబరు 2నుంచి 5వరకూ ఆ రాష్ట్రంలో పర్యటిస్తోంది. పథకం సజావుగా అమలు జరిగేలా తగిన సాంకేతిక సహాయం అందించేందుకు, పథకం పెట్టుబడుల తీరుపై దృష్టిని కేంద్రీకరించేందుకు ఈ బృందం పర్యటిస్తోంది. నాలుగు రోజుల ఈ పర్యటనలో ఇద్దరేసి సభ్యులతో కూడిన బృందాలు తమ అవకాశాలను బట్టి జిల్లాలో రోజూ నాలుగైదు గ్రామాలను సందర్శిస్తారు.
ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కమిటీలతో, గ్రామ నీటి సరఫరా, పారిశుద్ధ్య కమిటీలతో, స్థానిక పౌర సంఘాలతో, ప్రజారోగ్య, ఇంజినీరింగ్ శాఖ అధికారులతో వారు సంప్రదింపులు జరుపుతారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు నీటి సరఫరా లక్ష్యంగా జలజీవన్ మిషన్ అమలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. పథకం అమలులో ఆయా వర్గాలు పాలుపంచుకునేలా చర్యలు తీసుకుంటారు. సంబంధిత జిల్లాల కలెక్డర్లు, జిల్లాల నీటిసరఫరా, పారిశుద్ధ్య కమిటీల అధ్యక్షులు, రాష్ట్రస్థాయి ప్రధాన కార్యాలయంలోని ప్రభుత్వ శాఖ అధికారులతో కూడా సంప్రదింపులు జరుపుతారు. జార్ఖండ్ లోని రాంచి, హజరీబాగ్, గుమ్లా జిల్లాల్లో ఈ బృందాలు పర్యటిస్తున్నాయి.
ఈ పథకానికి సంబంధించి,. 2020-21సంవత్సరానికి గాను,.. కేంద్రం రూ. 572.23కోట్లను జార్ఖండ్.కు కేటాయించింది. 15వ ఆర్థిక సంఘం కూడా రూ.1,689కోట్లను కేటాయించింది. ఇందులో 50శాతం నిధులను సురక్షిత నీరు, పారిశుద్ధ్యం మెరుగుదల పనులకోసం పంచాయతీ రాజ్ సంస్థలు తప్పనిసరిగా ఖర్చు చేస్తాయి. అదనంగా,..అందుబాటులోని మిగతా ఆర్థిక వనరులను సమర్థంగా వినయోగించుకోవాలని జార్ఖండ్ ప్రభుత్వం సంకల్పించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్.), స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్ (ఎస్.బి.ఎం-జి)నిధులను, జిల్లా ఖనిజాభివృద్ధి నిధిని, ఎంపీ, ఎమ్మెల్యేల స్థానిక ప్రాంత అభివృద్ధి (ఎల్.ఎ.డి.) నిధులను నీటి సంరక్షణ కార్యకలాపాలకోసం సమర్థంగా వినియోగించుకోవాలని జార్ఖండ్ ప్రభుత్వం ప్రణాళిక వేసుకుంది. ఇందులో భాగంగా, నీటి వనరులను బలోపేతం చేయడం, నీటి సరఫరా పనులు చేపట్టడం, మురుగునీటి నిర్వహణ వ్యవస్థ, తాగునీరు సురక్షితంగా ఉండేలా చూడటం వంటి కార్యకలాపాలను చేపడతారు.
2024వ సంవత్సరానికల్లా దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ కుళాయిల ద్వారా మంచి నీటి సరఫరాకు కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ అనేక ప్రధాన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతంరాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి వ్యక్తికీ రోజుకు 55లీటర్ల చొప్పున పరిశుద్ధమైన తాగునీటిని క్రమం తప్పకుండా దీర్ఘకాల ప్రాతిపదికపై సరఫరా చేయాలన్న లక్ష్యాన్ని ఈ పథకంలో నిర్దేశించుకున్నారు. 2023-24లో వందశాతం ఇళ్లకు నీటి కుళాయిలను అమర్చి, తగినంతగా నీటిని అందించాలని జార్ఖండ్ ప్రభుత్వం సంకల్పించింది. నీటి సరఫరా పథకాల్లో వివిధ సంఘాల భాగస్వామ్యం, ప్రమేయంతో దీర్ఘకాల ప్రాతపదికపై ఈ లక్ష్యం సాధించాలని నిర్దేశించుకున్నారు. గ్రామాల్లో నీటి సరఫరా పథకాల ప్రణాళిక, అమలు, నిర్వహణ వంటి అంశాల్లో గ్రామాల కమిటీలకు, గ్రామ పంచాయతీలకు, నీటి వినియోగదారుల గ్రూపులకు ప్రమేయం కల్పించనున్నారు. జలజీవన్ మిషన్ పథకాన్ని సిసలైన ప్రజా ఉద్యమ కార్యక్రమంగా తీర్చిదిద్దే కృషిలో భాగంగా ప్రజల్లో అవగాహనకోసం అన్ని గ్రామాల్లో వివిధ పౌర సంఘాల సమీకరణతో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. సామాజిక రంగం, ప్రకృతి వనరుల నిర్వహణ రంగంలో ఇప్పటికే పనిచేస్తున్న వివిధ స్వచ్ఛంద సంస్థలను ఈ పనుల్లో సమర్థంగా వినియోగించుకోవాలని కూడా రాష్ట్రాలు ప్రణాళిక వేసుకున్నాయి. గ్రామాల్లో నీటి సరఫరా మౌలిక సదుపాయాల కల్పన, వాటి నిర్వహణ ప్రక్రియల్లో గ్రామీణ సమాజానికి ప్రమేయం కల్పించేందుకు ఈ స్వచ్ఛంద సంస్థల సేవలను వినియోగించుకోవాలని రాష్ట్రాలు సంకల్పించాయి.
***************
(Release ID: 1678129)
Visitor Counter : 225