వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

ఖ‌రీఫ్ మార్కెటింగ్ సీజ‌న్ 2020-21 లో ఎం.ఎస్‌.పి కార్య‌క‌లాపాలు

కె.ఎం.ఎస్ ప్రోక్యూర్‌మెంట్ కార్య‌క‌లాపాల ద్వారా 29.53 ల‌క్ష‌ల ధాన్యం రైతులు 59837.31 కోట్ల రూపాయ‌ల మేర‌కు ప్ర‌యోజ‌నం పొందారు.

Posted On: 30 NOV 2020 6:33PM by PIB Hyderabad

ప్ర‌స్తుత ఖ‌రీఫ్ మార్కెటింగ్ సీజ‌న్‌(కెఎంఎస్‌) 2020-21లో ప్ర‌భుత్వం ప్ర‌స్తుత ఎంఎస్ పి ప‌థ‌కాల కింద రైతుల నుంచి 2020-21 ఖ‌రీఫ్ పంట‌ల‌ను వాటి క‌నీస మ‌ద్ద‌తుధ‌ర‌కు సేక‌రించ‌డం కొన‌సాగిస్తోంది.
2020-21  ఖ‌రీఫ్ లో పంజాబ్‌, హ‌ర్యానా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ , తెలంగాణా, ఉత్త‌రాఖండ్‌, త‌మిళ‌నాడు, చండీఘ‌డ్‌, జ‌మ్ము కాశ్మీర్‌, కేర‌ళ, గుజ‌రాత్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్,ఒడిషా, మ‌హారాష్ట్ర‌ల‌లో ధాన్యం సేక‌ర‌ణ స‌జావుగా సాగిపోతున్న‌ది. 29-11-2020 నాటికి ప్ర‌భుత్వం 316.93 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యాన్ని సేక‌రించింది. ఇది గ‌త‌సంవ‌త్స‌రం ఇదే కాలం‌లో 267.22 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు. గ‌త ఏడాది కంటే ఇది 18.60 శాతం పెరిగింది. మొత్తం 316.93లక్ష‌ల మెట్రిక్ టన్నుల కొనుగోళ్ల‌లో పంజాబ్ నుంచి ఒక్క‌దానినుంచే 202.74.23 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం సేక‌రించారు. ఇది మొత్తం ధాన్యం సేక‌ర‌ణ‌లో 63.93 శాతం.ప్ర‌స్తుత కెం.ఎం.ఎస్ ప్రోక్యూర్‌మెంట్‌లో 29.53 ల‌క్ష‌ల‌మంది రైతులు ప్ర‌యోజ‌నం పొందారు. దీని ఎం.ఎస్‌.పి విలువ రూ 59837.318 కోట్లు.

 

దీనికితోడు . రాష్ట్రాల నుంచి వ‌చ్చిన ప్ర‌తిపాద‌న‌ల ప్ర‌కారం , 2020 ఖ‌రీఫ్ మార్కెటింగ్ సీజ‌న్‌లో త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌,తెలంగాణా, గుజ‌రాత్‌,హ‌ర్యానా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఒడిషా,రాజ‌స్థాన్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌లో ధ‌ర‌ల మ‌ద్ద‌తు ప‌థ‌కం(పిఎస్ఎస్ ) కింద  45.24 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ప‌ప్పుధాన్యాలు ,చ‌మురు గింజ‌ల సేక‌ర‌ణ‌కు కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తిచ్చింది. దీనికితోడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క‌,త‌మిళ‌నాడు,కేర‌ళ రాష్ట్రాల‌నుంచి 1.23 ల‌క్ష‌ల మెట్రిక్‌ట‌న్నుల ఎండుకొబ్బ‌రి సేక‌ర‌ణ‌కు కూడా అనుమ‌తి ఇచ్చారు.  ఇత‌ర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల విష‌యంలో ప‌ప్పుధాన్యాలు, చ‌మురు గింజ‌లు,ఎండుకొబ్బ‌రి ని పిఎస్ఎస్ కింద సేక‌ర‌ణ‌కు వారి నుంచి ప్ర‌తిపాద‌న‌లు వ‌చ్చిన అనంత‌రం అనుమ‌తి ఇవ్వ‌డం జ‌రుగుతుంది.Iఎఫ్‌.ఎ.క్యు గ్రేడ్ ప్రొక్యూర్‌మెంట్ విష‌యంలో ఈ పంట‌ల‌ను 2020-21 సంవ‌త్స‌రానికి మార్కెట్‌లో ధ‌ర‌లు ఎం.ఎస్‌.పి కంటే దిగువ‌కు ప‌డిపోతే  నేరుగా రిజిస్ట‌ర్డ్ రైతుల‌నుంచి సేక‌రించేందుకు అనుమ‌తించ‌నున్నారు. ఇందుకు ఆయా రాష్ట్రాలుకేంద్ర‌పాలిత ప్రాంతాల‌లో నోటిఫైడ్ పంట నూర్పిడి కాలంలో కేంద్ర నోడ‌ల్ ఏజెన్సీలు రాష్ట్రాల నామినేటెడ్ ప్రోక్యూరింగ్ ఏజెన్సీల ద్వారా దీనిని చేప‌ట్ట‌నున్నారు.


29-11-2020 నాటికి ప్ర‌భుత్వం నోడ‌ల్ ఏజెన్సీల ద్వారా  100429.81 మెట్రిక్ ట‌న్నుల  మిన‌ప‌పప్పు,పెస‌ర‌ప‌ప్పు,వేరుశ‌న‌గ‌, సోయాబీన్‌ల‌ను 540.92 కోట్ల రూపాయ‌ల విలువ మేర‌కు మ‌ద్ద‌తుధ‌ర‌కు సేక‌రించింది. దీనివ‌ల్ల త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్‌, హ‌ర్యానా, రాజ‌స్థాన్ రాష్ట్రాల‌కుచెందిన సుమారు 57,956మంది రైతులు ప్ర‌యోజ‌నం పొందారు.

అలాగే 5089 మెట్రిక్ ట‌న్నుల ఎండు కొబ్బ‌రిని 52.40 కోట్ల రూపాయ‌ల మ‌ద్ద‌తు ధ‌ర విలువ‌కు సేక‌రించ‌డం జ‌రిగింది. దీనివ‌ల్ల 20-11-2020 నాటికి  క‌ర్ణాట‌క‌,త‌మిళ‌నాడు రాష్ట్రాల‌కు చెందిన3,961 మంది రైతులు ప్ర‌యోజ‌నం పొందారు. అంత‌కు  ముందు సంవ‌త్స‌రం ఎండు కొబ్బ‌రి కొనుగోళ్లు 293.34 మెట్రిక్‌ట‌న్నులు మాత్ర‌మే.ఎండు కొబ్బ‌రి, మినుముల విష‌యంలో చాలా రాష్ట్రాల‌లో వాటి ధ‌ర క‌నీస మ‌ద్ద‌తుధ‌ర‌కంటే ఎక్కువ ప‌లుకుతున్నాయి.ఖ‌రీఫ్‌సీజ‌న్‌కు సంబంధించి ప‌ప్పుధాన్యాలు, చ‌మురుగింజ‌లు రాక‌కుఅనుగుణంగా ఆయా రాష్ట్రాలు నిర్ణ‌యించిన విధంగా ప్రొక్యూర్‌మెంట్‌కు రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలు త‌గిన ఏర్పాట్లు చేస్తున్నాయి.

 



 మ‌ద్ద‌తు ధ‌ర కింద క‌ప‌స్ ( విత్త‌న ప‌త్తి) సేక‌ర‌ణ కార్య‌క‌లాపాలు పంజాబ్‌, హ‌ర్యానా, రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్‌, తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఒడిషా, క‌ర్ణాట‌క‌ల‌లో స‌జావుగా సాగుతున్నాయి. 29-11-2020 లో 2,816255 కాట‌న్ బేళ్లు 8286.91 కోట్ల రూపాయ‌ల విలువ మేర‌కు సేక‌రించింది. దీనివ‌ల్ల 565591 మంది రైతులు ప్ర‌యోజ‌నం పొందారు.

***


(Release ID: 1677249) Visitor Counter : 132