యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
బాక్సర్ దుర్యోధన్ సింగ్ నేగీకి కొవిడ్ పాజిటివ్, లక్షణాలు లేవు, వైద్యుల పర్యవేక్షణ
प्रविष्टि तिथि:
29 NOV 2020 6:18PM by PIB Hyderabad
పటియాలా సాయ్ కేంద్రంలో శిక్షణలో ఉన్న బాక్సర్ దుర్యోధన్ సింగ్ నేగీ (69 కేజీలు) కొవిడ్ పాజిటివ్‌గా తేలారు. అయితే లక్షణాలేమీ లేవు. ఆయన్ను వెంటనే కొలంబియా ఏసియా హాస్పిటల్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు.
దీపావళి సందర్భంగా ఆయన విరామం తీసుకుని స్వస్థలం వెళ్లారు. తిరిగివచ్చాక క్వారంటైన్‌లో ఉన్నారు. సాయ్ నిబంధనల మేరకు ఆరోరోజున కొవిడ్ పరీక్షలు చేయగా పాజిటివ్ అని తెలిసింది.
దుర్యోధన్ సింగ్ నేగీ త్వరగా కోలుకునేందుకు అవసరమైన అన్ని సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు.
***
(रिलीज़ आईडी: 1677043)
आगंतुक पटल : 187