పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

వాతావ‌ర‌ణ మార్పులు, తీసుకున్న చ‌ర్య‌ల‌కు సంబంధించి స‌మా‌చారాన్ని అందించే ఇండియా క్లైమేట్ ఛేంజ్ నాలెడ్జ్ పోర్ట‌ల్ ప్రారంభం

2020 లోపు సాధించాల్సిన క్లైమేట్ యాక్ష‌న్ ( వాతావ‌ర‌ణ హిత చ‌ర్య‌ల ల‌క్ష్యాలు) ల‌క్ష్యాల‌ను సాధించిన ఇండియా: శ్రీ ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్‌

Posted On: 27 NOV 2020 7:10PM by PIB Hyderabad

ఇండియా క్లైమేట్ ఛేంజ్ నాలెడ్జ్ పోర్ట‌ల్ ను కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ‌, అట‌వీ, వాతావ‌ర‌ణ మార్పుల మంత్రిత్వ‌శాఖ మంత్రి శ్రీ ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్ ప్రారంభించారు. ఈ వెబ్ పోర్ట‌ల్ ప్రారంభం సంద‌ర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి శ్రీ జ‌వ‌దేక‌ర్ ఇది భార‌త‌దేశానికి సంబంధించిన ఏకైక స‌మాచార వ‌న‌రుగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని అన్నారు. వాతావ‌ర‌ణ హితంకోసం వివిధ మంత్రిత్వ‌శాఖ‌లు చేప‌ట్టిన చ‌ర్య‌లను ఈ పోర్ట‌ల్ ద్వారా తెలుసుకోవ‌చ్చ‌ని ఆయ‌న తెలిపారు. 
విర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. వాతావ‌ర‌ణానికి మేలు చేసేలా 2020లోపు భార‌త‌దేశం సాధించాల్సిన ల‌క్ష్యాల‌ను సాధించింద‌ని ఈ సంద‌ర్భంగా కేంద్ర‌మంత్రి శ్రీ జ‌వ‌దేక‌ర్ తెలిపారు. ఉద్గారాల‌కు భార‌త‌దేశం కార‌ణం కాక‌పోయిన‌ప్ప‌టికీ ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ తీసుకున్న అపూర్వ‌మైన నాయ‌క‌త్వ చొరవ కార‌ణంగా, క్లైమాట్ యాక్ష‌న్ విష‌యంలో భార‌తదేశం ప్రపంచానికి మార్గ‌ద‌ర్శ‌క‌త్వ‌వ‌హిస్తోంద‌ని శ్రీ ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్ అన్నారు. 
సంబంధిత నియ‌మ నిబంధ‌న‌ల్ని ఆయా మంత్రిత్వ‌శాఖ‌లు అమ‌లు చేస్తున్న స‌మాచారాన్ని ఈ పోర్ట‌ల్ లో చూడ‌వ‌చ్చు. వాతావ‌ర‌ణ హితం కోసం జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో భార‌త‌దేశం తీసుకుంటున్న కీల‌క చ‌ర్య‌ల‌న్నిటినీ ఈ పోర్ట‌ల్ అందిస్తుంది. ఇందులో పొందుప‌రిచిన 8 కీల‌క అంశాలు ఇలా వున్నాయి. 
1. భార‌త‌దేశ వాతావ‌ర‌ణ స్వ‌రూపం
2. జాతీయ విధి విధానాల వ్య‌వ‌స్థ‌
3. భార‌త‌దేశ ఎన్ డిసి ల‌క్ష్యాలు
4. ఆమోదించ‌బ‌డిన చ‌ర్య‌లు
5. తీవ్ర‌త‌ను త‌గ్గించే చ‌ర్య‌లు
6. ద్వైపాక్షిక‌, బ‌హుళ పాక్షిక స‌హ‌కారం
7. అంత‌ర్జాతీయ వాతావ‌ర‌ణ సంప్ర‌దింపులు
8. నివేదిక‌లు మ‌రియు ప్ర‌చుర‌ణ‌లు
....
దీనికి సంబంధించి పోర్ట‌ల్ లింకు  https://www.cckpindia.nic.in/ 
......

 


(Release ID: 1676713) Visitor Counter : 220