ఆర్థిక మంత్రిత్వ శాఖ

కామ‌త్ క‌మిటి గుర్తించి 26 రంగాల‌కు, ఆరోగ్య‌భద్ర‌తా రంగానికి క‌లిపి ఇసిఎల్ జిఎస్ 2.0 ద్వారా అత్య‌వ‌స‌ర రుణ ప‌ర‌పతి విధాన హామీ ప‌థ‌కం పొడిగింపు.

ఇజిఎల్ జిఎస్ 1.0 ( అత్య‌వ‌స‌ర రుణప‌ర‌ప‌తి విధాన హామీ ప‌థ‌కం) కాల‌ప‌రిమితి పొడిగింపు

Posted On: 26 NOV 2020 8:01PM by PIB Hyderabad

కామ‌త్ క‌మిటి గుర్తించిన 26 రంగాల‌కు, ఆరోగ్య‌భ‌ద్ర‌తారంగానికి క‌లిపి ఇసిఎల్ జిఎస్ 2.0 ద్వారా అత్య‌వ‌స‌ర రుణప‌ర‌ప‌తి విధాన హామీ ప‌థ‌కాన్ని కేంద్ర‌ప్ర‌భుత్వం పొడ‌గించింది. ఇసిఎల్ జిఎస్ కింద‌... ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 29 నాటికి రూ.50 కోట్ల‌కుపైగా రూ.500 కోట్ల‌కు ఎక్కువ కాకుండా రుణ ప‌ర‌ప‌తి క‌లిగిన కంపెనీలు దీనికి అర్హ‌త క‌లిగి వున్నాయి. అంతే కాదు ఇవి ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 29 నాటికి 30 రోజులు లేదా అంత‌కంటే త‌క్కువ రోజుల‌పాటు పాత బ‌కాయిలు క‌లిగి వుండాలి.  ఈ కంపెనీలు.. వాటి మొత్తం రుణ ప‌ర‌ప‌తిలో 20శాతం అద‌నంగా నిధుల‌ను కేటాయించడానికి అర్హ‌త క‌లిగి వుంటాయి. పూచీ ర‌హిత హామీ క‌లిగిన అత్య‌వ‌స‌ర రుణ ప‌ర‌ప‌తి విధానం ( జిఇసిఎల్ ) కింద ఈ ప‌ని చేస్తారు. దీనికి జాతీయ రుణ గ్యారంటీ ట్ర‌స్టీ కంపెనీ లిమిటెడ్ పూర్తిస్థాయిలో గ్యారంటీగా వుంటుంది. ఇసిఎల్ జిఎస్ 2.0 కింద ఇచ్చే రుణాలు ఐదు సంవ‌త్స‌రాల కాల‌ప‌ర‌మితి క‌లిగి వుంటాయి. అస‌లు తిరిగి చెల్లింపుకు 12 నెల‌ల మార‌టోరియం కూడా వుంటుంది. 
ఇసిఎల్ జిఎస్ 2.0 తోపాటు,  వార్షిక ట‌ర్నోవ‌ర్ సీలింగ్ లేని సంస్థ‌ల విష‌యంలో ఇసిఎల్ జిఎస్ 1.0 వ‌ర్తింప చేయాల‌ని నిర్ణ‌యించారు. అయితే వాటికి ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 29 నాటికి రుణ ప‌ర‌ప‌తి మొత్తం రూ. 50 కోట్లు వుండాలి. ఇవి గ‌తంలో వార్షిక ట‌ర్నోవ‌ర్ రూ.250 కోట్లు దాటిన కార‌ణంగా అర్హ‌త కోల్పోయి వున్నాయి. వీటికి సంబంధించి మిగ‌తా నియ‌మ నిబంధ‌న‌లు య‌ధాత‌థంగా అమ‌ల‌వుతాయి. 
ఎన్ సి జిటిసి ఈ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసిన రోజునుంచి 2021 మార్చి 31వ‌ర‌కూ ఇసిఎల్ జిఎస్ కింద విడుద‌ల చేసిన అన్ని రుణాల‌కు ఈ ప‌థ‌కం వ‌ర్తిస్తుంది. 
స‌భ్యులుగా వున్న రుణ సంస్థ‌ల‌కు మార్పులు చేర్పుల‌తో వ‌చ్చిన ఈ ప‌థ‌కం ప్రోత్సాహ‌కాల‌నిస్తుంది. త‌ద్వారా అర్హ‌త క‌లిగిన రుణ‌గ్ర‌హీత‌ల‌కు అద‌న‌పు నిధుల సౌక‌ర్యం ల‌భిస్తుంది. దీని కార‌ణంగా ఎంఎస్ ఎంఇలు, వ్యాపార సంస్థ‌లు, ఎంఎస్ ఎంఇల‌కు మ‌ద్ద‌తుగా నిలిచే సంస్థ‌ల‌కు మేలు జ‌రుగుతుంది. దాంతో ఆర్ధిక పునరుజ్జీవ‌నానికి, ఉద్యోగాల సంర‌క్ష‌ణ‌కు, నూత‌న ఉద్యోగాల క‌ల్ప‌న‌కు మార్గం సుగ‌మం అవుతుంది. దీనికి సంబంధించి ఎన్ సి జిటిసి కార్యాచ‌ర‌ణ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది. 

 

****



(Release ID: 1676708) Visitor Counter : 145


Read this release in: English , Urdu , Hindi