రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

డీఆర్‌డీఓలో రాజ్యాంగ దినోత్సవం నిర్వ‌హ‌ణ‌

Posted On: 26 NOV 2020 7:03PM by PIB Hyderabad

భార‌త రాజ్యాంగానికి ఆమోదం తెలిపి 70 వ‌సంతాలు పూర్త‌యిన సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకొని
'రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ'లో (డీఆర్‌డీఓ) ఈ రోజు 'రాజ్యాంగ దినోత్సవం'ను నిర్వ‌హించారు. ఈ వేడుకల‌లో ముఖ్యంగా రాజ్యాంగంలోని పీఠిక‌ను డీఆర్‌డీఓ సంస్థ సిబ్బంది
ముక్త కంఠంతో చ‌దివారు. ఈ సందర్భంగా గుర్తుగా డీఆర్‌డీఓ ఒక వెబ్‌నార్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ శాఖ స‌హాయ‌ మంత్రి శ్రీ శ్రీపాద్ నాయక్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వెబ్‌నార్‌లో పాల్గొన్నారు. "భార‌త రాజ్యాంగ విలువలు మరియు భారత రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలు" అనే అంశంపై ప్రసంగించారు. రాజ్యాంగ వ్యవస్థాపకులుగా నిలిచిన విశేషంగా కృషి చేసిన వారిని ఆయ‌న ఈ సంద‌ర్భంగా గుర్తుచేసుకున్నారు, రాజ్యాంగం ఒక సైద్ధాంతిక ఆలోచన మాత్రమే కాదని దేశంలోని ప్రతి ప్రాంతంలోని వ్యక్తుల జీవితాలకు ఇది ముఖ్యమని అన్నారు. దేశ పౌరులతో రాజ్యాంగం అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని ఆయన వివ‌రించారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా చాలా మంది డీఆర్‌డీఓ సంస్థ డీజీలు, డైరెక్టర్లు, సీనియర్ సైంటిస్టులు మరియు ఇతర సీనియర్ అధికారులు వెబ్‌నార్‌లో పాల్గొన్నారు.

 

***

 


(Release ID: 1676410) Visitor Counter : 145