నీతి ఆయోగ్

కోవిడ్-19 నుంచి ఉప‌శ‌మ‌నం, వ్యాధినివార‌ణ నిర్వ‌హ‌ణ చ‌ర్య‌లు: భార‌త‌దేశ రాష్ట్రాలు ,కేంద్ర‌పాలిత ప్రాంతాల అను

భ‌వాలు పేరుతో నివేదిక‌ను విడుద‌ల చేసిన నీతి ఆయోగ్‌

ఇది రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలు స్థానిక ప‌రిస్థితుల‌కు అనుగుణంగా కోవిడ్‌ను స‌మ‌ర్ధంగా ఎదుర్కొనేందుకు

తీసుకున్న చ‌ర్య‌ల‌ను , అనుస‌రించిన విధానాల‌ను డాక్యుమెంట్ రూపంలో రికార్డు చేసేందుకు ఉద్దేశించిన‌ది

Posted On: 25 NOV 2020 5:48PM by PIB Hyderabad

కోవిడ్ -19 మ‌హ‌మ్మారి నియంత్ర‌ణ‌, అదుపు న‌కు సంబంధించి భార‌త‌దేశంలోని  వివిధ రాష్ట్రాలు, జిల్లాలు, న‌గ‌రాలు చేప‌ట్టిన చ‌ర్య‌లు, చూపిన చొర‌వ‌కు సంబంధించిన స‌వివ‌ర‌మైన స‌మాచారంతో నీతి ఆయోగ్ ఒక కాంపెండియంను విడుద‌ల చేసింది.

ఈ కాంపెండియంనుం నీతి ఆయోగ్ స‌భ్యుడు డాక్ట‌ర్ విపె పాల్‌, సిఇఒ అమితాబ్ కాంత్‌, అద‌న‌పు  కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ రాకేష్ శ‌ర్వాల్ లు విడుద‌ల చేశారు.

గ‌త కొన్ని నెల‌లుగా ప్ర‌పంచం మున్నెన్న‌డూ లేని రీతిలో కోవిడ్ -19 రూపంలో ప్ర‌జారోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న‌ది. దేశంలో కోవిడ్ మ‌హ‌మ్మారిని అదుపు చేయ‌డంలో కేంద్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల విష‌యంలో రాష్ట్రాలు స‌మాన భాగ‌స్తులుగా ఉన్నాయి.

 కోవిడ్‌ను అదుపుచేసేందుకు అంత‌ర్జాతీయంగా చేప‌డుతున్న వివిధ చ‌ర్య‌ల‌నుంచి నేర్చుకోవ‌ల‌సింది ఉన్న‌ప్ప‌టికీ, మ‌నం చేప‌ట్టిన చ‌ర్య‌లు, ప‌ద్ధ‌తులు కూడా కీల‌క‌మైన‌వే.ప్ర‌తి రాష్ట్రం ఒకే విష‌యాన్ని ప‌దే ప‌దే క‌నిపెట్టే అవ‌స‌రం లేకుండా ఒక‌రు క‌నిపెట్టిన కొత్త ప‌ద్ధ‌తిని,విష‌యాన్ని ఇత‌రులు తెలుసుకోవ‌డం ద్వారా ఒక‌రినుంచి మ‌రొక‌రు నేర్చుకోవ‌డానికి, ఉమ్మ‌డి సమ‌స్య‌ల‌కు ప‌రిష్కారాలు సాధించ‌డానికి వీలు క‌లుగుతుంది.  అని నీతి ఆయోగ్ సిఇఒ అమితాబ్ కాంత్ త‌న ముందుమాట‌లో రాశారు.

కోవిడ్ నియంత్ర‌ణ‌కు సంబంధించి అనుస‌రించిన వివిధ విధానాల‌పై కాంపెండియంను రూపొందించే క్ర‌మంలో నీతిఆయొగ్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌ను ఈ మెయిల్ ద్వారా, టెలిఫోన్ ద్వారా సంప్ర‌దించి వారి అనుభ‌వాల‌ను , కోవిడ్ 19నియంత్ర‌ణ‌, అదుపుచేయ‌డానికి ప‌నికివ‌చ్చిన‌వ‌ని వారు భావించిన అంశాల‌ను తెలియ‌జేయ‌వ‌ల‌సిందిగా కోరింది.స‌మీక్షా స‌మావేశాల సంద‌ర్భంగా కొన్ని రాష్ట్రాలు అద‌న‌పు  స‌మాచారాన్నినీతిఆయోగ్‌ మెంబ‌ర్ (హెల్త్‌)కు అందించాయి. రాష్ట్రాలు కేంద్ర‌పాలిత ప్రాంతాల‌నుంచి నేరుగా స‌మాచారం అందుకుని, అద‌నంగా స‌మ‌గ్ర స‌మీక్షా స‌మాచారాన్ని జోడించారు.

కాంపెండియంలోని అనుభ‌వాల‌ను ఆరు విభాగాలుగా క్రోడీక‌రించారు 1) ప్ర‌జారోగ్యం, చికిత్స స్పంద‌న‌ 2) నిర్వ‌హ‌ణ యంత్రాంగం 3)డిజిట‌ల్ హెల్త్ 4) స‌మీకృత‌న‌మూనా,5) వ‌ల‌స ప్ర‌జ‌ల సంక్షేమం ఇత‌ర ఇబ్బందులు  ఎదుర్కొనేందుకు వీలున్న ప్ర‌జ‌లు,6) ఇత‌ర అంశాలుగా దీనిని క్రోడీకరించారు. ఈ విభాగాల‌కు సంబంధించి అవ‌స‌ర‌మున్న చోట భార‌త‌ప్ర‌భుత్వ సంబంధిత నిబంధ‌న‌లు,మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పొందుప‌ర‌చారు.

కోవిడ్ -19ను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలు ఎన్నొ చ‌ర్య‌లు తీసుకున్నాయి. కాంటాక్టుల‌ను తెలుసుకునేందుకు మొబైల్ వ్యాన్‌ల నిర్వ‌హ‌ణ‌కు స‌మ‌గ్ర రూట్ మ్యాప్‌లు రూపొందించ‌డం, ప్ర‌జ‌ల ముంగిటికి అత్య‌వ‌స‌ర వైద్య సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకురావ‌డం వంటివాటిని అనుస‌రించాయి. ప‌లు రాష్ట్రాలు ,కేంద్ర‌పాలిత ప్రాంతాలు టెక్నాల‌జీని విస్తృతంగా వినియోగించాయి. ఆహారాన్ని,నీటిని, ఆస్ప‌త్రుల‌లో పేషెంట్ల‌కు మందుల‌ను  స‌ర‌ఫ‌రా చేసేందుకు రోబోట్లు వినియోగించ‌డం, ఆరోగ్య‌సిబ్బందికి శిక్ష‌ణ నిచ్చేందుకు వ‌ర్చువ‌ల్ ప్లాట్‌ఫారంల‌ను వినియొగించ‌డం జ‌రిగింది.

ప‌లు సాంకేతిక ప‌రిజ్ఞాన  అన్వేష‌ణ‌లో స్టార్ట‌ప్‌లు ముందున్నాయి. యాప్‌ల అభివృద్ది, టెలిమెడిసిన్ సేవ‌లలో ఇవి ముందున్నాయి. పౌర‌స‌మాజం కూడా రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు, జిల్లా పాల‌నాయంత్రాంగాల‌తో క‌లిసి కోవిడ్ నియంత్ర‌ణ‌కు కంట్రోల్‌రూములు ఏర్పాటులో తోడ్పాటునిచ్చాయి. అలాగే అవ‌స‌ర‌మైన వారికి ఆహారాన్ని ఇంటింటికి అందించ‌డానికి, మాస్కులు, శానిటైజ‌ర్ల‌ను త‌యారు చేయ‌డానికి స్వ‌యంస‌హాయ బృందాల‌ను స‌మీకృతం చేయ‌డానికి పౌర‌స‌మాజం తోడ్ప‌డింది.

ఇందుకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్ కోసం క్లిక్‌చేయండి.

https://niti.gov.in/sites/default/files/2020-11/Report-on-Mitigation-and-Management-of-COVID19.pdf.

***



(Release ID: 1675837) Visitor Counter : 106