మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీ (ఐఐఏఎస్) 55వ వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకొని.. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి
Posted On:
21 NOV 2020 7:29PM by PIB Hyderabad
శనివారం (ఈ రోజు) సిమ్లాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీ (ఐఐఏఎస్) 55వ వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకొని.. కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ విద్యార్థులను ఉద్దేశించి వర్చువల్ విధానంలో ప్రసంగించారు. ప్రముఖ రచయిత డాక్టర్ యోగేంద్రనాథ్ శర్మ ‘అరుణ్’తో పాటు ఐఐఏఎస్ పాలక మండలి చైర్‌పర్సన్ ప్రొఫెసర్ కపిల్ కపూర్, ఐఐఏఎస్ పాలక మండలి చైర్మన్ ప్రొఫెసర్ చమన్లాల్ గుప్తా, సిమ్లా ఐఐఏఎస్ సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ మక్రాండ్ పరంజాపే ఇతర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి పోఖ్రియాల్ మాట్లాడుతూ 55వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా.. ఐఐఏఎస్ బృందాన్ని అభినందించారు. ఐఐఏఎస్ ఇన్‌స్టిట్యూట్ భారతదేశం గర్వించదగిన కిరీటం అని ఆయన అన్నారు. ‘కొత్త విద్యా విధానం 2020’ అమలు చేయడం ద్వారా భారత్‌ను ‘విశ్వగురు’గా మార్చాలని ఆయన కోరారు. స్వయం ప్రతిపత్తి గల భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి గాను విద్యార్థులు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. కొత్త విద్యా విధానం స్వావలంబన భారతదేశాన్ని సాధించడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు. ఐఐఏఎస్ పరిశోధనల ద్వారా కొత్త విద్యా విధానాన్ని ఉన్నత స్థాయికి తీసుకుపోతుందని మంత్రి ఉద్ఘాటించారు.
సంస్థ యొక్క అన్ని ప్రయత్నాలకు ప్రభుత్వ పూర్తి మద్దతు ఉంటుందని మంత్రి పునరుద్ఘాటించారు. డాక్టర్ యోగేంద్ర నాథ్ ‘అరుణ్’ ‘న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020’ పై ఫౌండేషన్ డే ఉపన్యాసం చేస్తూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ, విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్‌ల దూరదృష్టి నాయకత్వం వల్ల
34 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కొత్త విద్యా విధానం అందుబాటులోకి వచ్చిందని అన్నారు. జాతీయ, స్థానిక మరియు ప్రాంతీయ భాషల ద్వారా గొప్ప భారతీయ సంస్కృతి, మతం, కళను ప్రోత్సహించడమే ఎన్ఈపీలో ప్రధాన ఉద్దేశమని అని ఆయన అన్నారు. ఎన్ఈపీ 2020 అనేది నిజమైన అర్థంలో మొదటి జాతీయ విద్యా విధానం, ఇది మనం కోల్పోయిన గొప్ప భారతీయ జ్ఞాన వ్యవస్థను (వేదాలు, పురాణాలు, ఆయుర్వేదం మొదలైనవి) పునరుద్ధరించడం,
లేదా స్వీకరించేటప్పుడు భారత్‌ను గొప్పగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ సందర్భంగా ఇన్‌స్టిట్యూట్ హిందీ పత్రిక హిమంజలి యొక్క 21వ సంచికను డాక్టర్ యోగేంద్రనాథ్ శర్మ ‘అరుణ్’, ప్రొఫెసర్ పరంజాపే మరియు పత్రిక సంపాదకీయ బోర్డు సభ్యులు ఆవిష్కరించారు. ఇన్‌స్టిట్యూట్ రిటైర్డ్ ఉద్యోగి శ్రీ హరి కపూర్ మరియు ఎంటీఎస్ శ్రీ బలిరామ్‌లు ఇన్‌స్టిట్యూట్ చేసిన సేవలకు గుర్తింపుగా సాంప్రదాయ హిమాచలి శాలువా, టోపీతో సత్కరించారు. ప్రొఫెసర్ చమన్ లాల్ గుప్తా విద్యా మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇన్‌స్టిట్యూట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఐఐఏఎస్ ఆర్ఎంవో మీను అగ్రవాల్ కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి మరియు సభలో పాల్గొన్న ఇతరులకు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
*****
(Release ID: 1674825)