ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
డాక్టర్ హర్షవర్ధన్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సిఐఐ) కార్యక్రమంలో మాట్లాడుతూ "పోలియో నిర్మూలనలో ప్రైవేట్ సంస్థలు కీలక పాత్ర పోషించాయి , ప్రజారోగ్య సంరక్షణకు వారి సాయం చాలా అవసరం" అని అన్నారు
కోవిన్ పోర్టల్ , నెట్‌వర్క్ ద్వారా చిట్టచివరి వ్యక్తికీ వ్యాక్సిన్ డెలివరీని చేయవచ్చని అన్నారు.
Posted On:
20 NOV 2020 5:20PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈ రోజు ఢిల్లీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సిఐఐ) సభ్యులతో మాట్లాడారు.
ప్రపంచంలోని అతిపెద్ద జనాభాలో ఒకటైన భారతదేశం కోవిడ్ మహమ్మారిపై నిరంతరం సంభాషణలు , చర్చలు జరపడానికి విభిన్న వేదికలను అందుబాటులోకి తీసుకువచ్చిన సీఐఐని ఆయన అభినందించారు. “ఆదాయం , ఉపాధి కల్పన పరంగా భారతదేశపు అతిపెద్ద రంగాలలో వైద్యరంగం ఒకటి. దాని మార్కెట్ మూడు రెట్లు పెరిగి రూ. 2022 నాటికి 8.6 ట్రిలియన్లకు చేరుకుంటుంది. ఈ పరిశ్రమలో భాగస్వాములకు తగిన సమాన అవకాశాలు దక్కేలా చర్యలు తీసుకోవాలి. కరోనా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సంరక్షణను అందుబాటు, సరసమైన ధరల్లో అందించాలి "
సరసమైన ధరల్లో ఆరోగ్య సంరక్షణ ప్రజలకు దక్కేలా చూడడానికి ఆయుష్మాన్ భారత్ ఆధ్వర్యంలో ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (పిఎమ్‌జెఎవై) ను ప్రారంభించామని డాక్టర్ హర్షవర్ధన్ ఈ సందర్భంగా అన్నారు. “భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ విషయంలో కొన్ని తేడాలు ఉన్నాయి. పట్టణాలు, గ్రామాల మధ్య తేడాలు ఉన్నాయి. ఈ అంతరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ ఈ అంతరాన్ని పూడ్చాలని నిశ్చయించుకున్నారు. పిఎమ్‌జెఎవైతో ఆయుష్మాన్ భారత్ , ఎన్‌సిడిలు , క్యాన్సర్ల స్క్రీనింగ్ కోసం హెచ్‌డబ్ల్యుసి నెట్‌వర్క్ ఏర్పాటు చేయడం ఇందులో ముఖ్యమైనది. ”ఈ విషయంలో పబ్లిక్-ప్రైవేట్-పార్ట్‌నర్‌షిప్స్ (పిపిపి) కీలకం. ఇవి సమర్థతను పెంచుతాయి. ఆవిష్కరణలను మెరుగుపరుస్తాయి. పట్టణ-గ్రామీణ అసమానతలను తగ్గించగలుగుతాయి. ప్రజల జేబు నుంచి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు”అని ఆయన వివరించారు.
కోవిడ్ తో పోరాడటంలోనే కాకుండా దేశంలో కోవిడ్ రహిత వ్యాధులపై పోరాటం కోసం సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అద్భుత విజయాలు సాధించిందని మంత్రి పేర్కొన్నారు. “సాంకేతిక పరిజ్ఞానం మనకు అందించిన సామర్థ్యాన్ని మనం మరింత పెంచాలి. అందరికీ ఆరోగ్య సంరక్షణ కోసం మేం టెక్నాలజీని ఉపయోగించుకుంటాం. ఇందులో భాగంగానే టెలిమెడిసిన్ తెరపైకి వచ్చింది. ప్రతి ఒక్కరికీ వైద్యం అందిస్తుంది. ఈ–సంజీవని టెలి కన్సల్టేషన్ సేవ ఇప్పటికే 8 లక్షల టెలికాన్సల్టేషన్లను పూర్తి చేసింది”అని ఆయన వివరించారు.
పోలియోకు వ్యతిరేకంగా చేసిన ప్రచారంలో తన సొంత అనుభవాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. సిఐఐ, ఢిల్లీఛాంబర్ ఆఫ్ కామర్స్, రోటరీ క్లబ్ వంటి ప్రైవేట్ సంస్థలు ఖర్చులను భరించడానికి ముందుకు వచ్చాయని , ఇవి భారీ విజయాన్ని సాధించాయని గుర్తు చేశారు. “బలమైన ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థ ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటున్నాం. ప్రజారోగ్యం కోసం మేం సంబంధిత సంస్థలు , పరిశ్రమలకు సాయపడతాం. ఇందుకోసం అన్ని రకాల ఆరోగ్య సంరక్షణ విధానాలను అమలు చేయాలి” అని మంత్రి విశదీకరించారు. ప్రభుత్వ , ప్రైవేట్ రంగాల మధ్య సహకారానికి సాక్ష్యంగా డాక్టర్ హర్షవర్ధన్ కోవిడ్ తో భారతదేశం చేసిన పోరాటాన్ని ఉదహరించారు. "మన దేశం ఇప్పుడు వ్యక్తిగత రక్షణ సామగ్రి వస్తు సామగ్రి అతిపెద్ద తయారీదారులలో ఒకటిగా మారింది. కొన్ని సంవత్సరాల క్రితం పరీక్ష కోసం మేము సిడిసి అట్లాంటాకు నమూనాలను పంపించాము, అయితే ఇప్పుడు దేశంలోని మొత్తం పరీక్షలను ప్రైవేట్ టెస్టింగ్ ల్యాబ్‌లే నిర్వహిస్తున్నాయి ” అని వివరిస్తూ కోవిడ్ వారియర్స్ పట్ల, ముఖ్యంగా వారి తల్లులు తమ పిల్లలను తమ కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా అడ్డుకోకపోవడాన్ని ఆయన ప్రశంసించారు.
కోవిడ్ వ్యాక్సిన్ సకాలంలో లభిస్తుందని డాక్టర్ హర్షవర్ధన్ హామీ ఇచ్చారు. ఈ విషయంలో, మిషన్ ఇంద్రధనుష్ ఆధ్వర్యంలో 12 వ్యాధుల నుండి రక్షించడానికి పిల్లలకు రోగనిరోధక శక్తి గల వ్యాక్సిన్లను ఇచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే కోల్డ్ స్టోరేజ్ను సిద్దంగా ఉంచుకుందని చెప్పారు. “మొత్తం ఇ–విన్ ప్లాట్‌ఫాం కోవిన్ నెట్‌వర్క్‌గా పునర్నిర్మించబడింది. సరుకు కదలికలను డిజిటల్‌గా ట్రాక్ చేయవచ్చు. ఇది వరకే వ్యాక్సిన్ తీసుకున్న వారికి మరో రెండు వ్యాక్సిన్లు అవసరమైతే ఆ విషయాన్ని రెండు మూడు వారాల తర్వాత గుర్తించవచ్చు. దేశంలో చిట్టచివరి వ్యక్తికీ టీకాలు ఇవ్వొచ్చు ”అని ఆయన వివరించారు.
***
(Release ID: 1674779)
Visitor Counter : 164