భారత పోటీ ప్రోత్సాహక సంఘం

ఫ్యూచర్ సంస్థలకు చెందిన చిల్లర, టోకు, లాజిస్టిక్స్, గిడ్డంగి వ్యాపారాలను రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌వీఎల్‌)‌, రిలయన్స్ రిటైల్ అండ్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ లిమిటెడ్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌ డబ్ల్యూవోఎస్‌) కొనుగోలు చేయడానికి సీసీఐ అనుమతి

Posted On: 20 NOV 2020 6:49PM by PIB Hyderabad

ఫ్యూచర్ సంస్థలకు చెందిన చిల్లర, టోకు, లాజిస్టిక్స్, గిడ్డంగి వ్యాపారాలను రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌వీఎల్‌)‌, రిలయన్స్ రిటైల్ అండ్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ లిమిటెడ్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌ డబ్ల్యూవోఎస్‌) కొనుగోలు చేయడానికి కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ‌‌) అనుమతించింది. పోటీ చట్టం-2002లోని సెక్షన్‌ 31(1) ప్రకారం అంగీకారం తెలిపింది.

ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌తో (ఎఫ్‌ఈఎల్‌) సమ్మేళనం ద్వారా, ఈ క్రింది ఫ్యూచర్‌ గ్రూపు సంస్థలను పునఃవ్యవస్థీకరిస్తారు:

ఫ్యూచర్‌ కన్జ్యూమర్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌సీఎల్‌)
ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ ఫ్యాషన్స్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌ఎల్‌ఎఫ్‌ఎల్‌)
ఫ్యూచర్‌ రిటైల్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌ఆర్ఎల్‌)
ఫ్యూచర్‌ మార్కెటింగ్‌ నెట్‌వర్క్స్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌ఎంఎన్‌ఎల్‌)
ఫ్యూచర్‌ సప్లై చైన్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌ఎస్‌సీఎస్‌ఎల్‌)
ఫ్యూచర్‌ బజార్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎఫ్‌ఐఎల్‌), అనుబంధ సంస్థలు
(ఇకపై వీటిన్నింటినీ కలిపి బదిలీ సంస్థలుగా వ్యవహరించవచ్చు)
 
    బదిలీ సంస్థల్లో అనేకం లిస్టెడ్‌, అన్‌లిస్టెడ్‌ కంపెనీలు. ప్రాథమికంగా చిల్లర, టోకు, లాజిస్టిక్స్‌, గోదాముల వ్యాపారాలు చేస్తున్నాయి. పాన్‌ ఇండియా ప్రాతిపదికన, ఆహారం, కిరాణా, వస్త్రాలు, పాదరక్షలు, ఉపకరణాలు వంటి చిల్లర వర్తకాల్లో ఉన్నాయి.

    బదిలీ సంస్థల పునఃవ్యవస్థీకరణ తర్వాత, చిల్లర, టోకు, లాజిస్టిక్స్‌, గోదాముల వ్యాపారాలను ఆర్‌ఆర్‌వీఎల్‌, ఆర్‌ఆర్‌వీఎల్‌ డబ్ల్యూవోఎస్‌ స్వాధీనం చేసుకుంటాయి.

    ఆర్‌ఆర్‌వీఎల్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు లిమిటెడ్‌కు చెందిన అన్‌లిస్టెడ్‌ అనుబంధ కంపెనీ. ఇది, చిల్లర వ్యాపార వస్తువుల పంపిణీ నిర్వహణ వ్యాపారంలో ఉంది. రిలయన్స్‌ రిటైల్‌ లిమిటెడ్‌, ఆర్‌ఆర్‌వీఎల్‌కు అనుబంధ సంస్థ. దేశవ్యాప్తంగా  ఆహారం, కిరాణా, ఎలక్ట్రానిక్స్‌, వస్త్రాలు, పాదరక్షలు, ఉపకరణాలు వంటి చిల్లర వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

    ఆర్‌ఆర్‌వీఎల్‌ డబ్ల్యూవోఎస్‌ కూడా ఆర్‌ఆర్‌వీఎల్‌ అనుబంధ సంస్థ. ఆర్‌ఆర్‌వీఎల్‌ డబ్ల్యూవోఎస్‌కు బదిలీ చేయడానికి ప్రతిపాదించిన వ్యాపారాలు సహా వివిధ వ్యాపారాల నిర్వహించడానికి ఇటీవలే దీనిని ఏర్పాటు చేశారు.

***


(Release ID: 1674627)
Read this release in: English , Urdu , Marathi , Hindi