ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
కేంద్ర మంత్రి డా.జితేంద్ర సింగ్‌తో భారత్‌లో ఫ్రాన్స్ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనైన్ భేటీ; ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధాన ప్రాజెక్టులపై చర్చ
Posted On:
20 NOV 2020 1:30PM by PIB Hyderabad
కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డా.జితేంద్ర సింగ్‌తో భారత్‌లో ఫ్రాన్స్ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనైన్ సమావేశమై,ఈశాన్య రాష్ట్రాల్లో కీలక ప్రాజెక్టులపై చర్చించారు. రాయబారుల బృందంలో సభ్యుడిగా ఈ ఏడాది మొదటిలో కశ్మీర్ లోయలో పర్యటించిన అనుభవాలను ఈ సందర్భంగా ఇమ్మాన్యుయేల్ లెనైన్ గుర్తు చేసుకున్నారు.
ఈశాన్య రాష్ట్రాల్లోని వివిధ రంగాలతోపాటు జమ్ము&కశ్మీర్‌లో పర్యాటకం, ఇతర ముఖ్య అంశాల్లో సహకార అవకాశాలపై ఫ్రాన్స్ అభీష్టాన్ని కేంద్ర మంత్రికి వివరించారు.
ఈశాన్య ప్రాంతంలో వివిధ దేశాల భాగస్వామ్యంతో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల గురించి కేంద్ర మంత్రి డా.జితేంద్ర సింగ్ వివరించారు. ఇజ్రాయెల్ సహకారంతో మిజోరంలో ఏర్పాటు చేసిన 'సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ సిట్రస్ ఫ్రూట్ పార్క్' గురించి, జపాన్ భాగస్వామ్యంతో చేపట్టిన కొన్ని మౌలిక వసతుల కార్యక్రమాల గురించి ఫ్రాన్స్ రాయబారికి చెప్పారు.
ఈశాన్య ప్రాంతంలో ఇప్పటికీ ఎన్నో గొప్ప అవకాశాలు ఎదురు చూస్తున్నాయన్న మంత్రి; పర్యాటకం, హస్తకళలు, చేనేత, ఆహారం, ఫల రంగాల గురించి చెప్పారు.
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈశాన్య ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యమివ్వడంతోనే సరిపెట్టలేదని; "లుక్ ఈస్ట్ పాలసీ"ని "యాక్ట్ ఈస్ట్ పాలసీ"గా మార్చి, తూర్పు సరిహద్దు దేశాలతో సంబంధాలను పెంపొందించే చర్యలు చేపట్టారని ఫ్రాన్స్ రాయబారికి కేంద్ర మంత్రి డా.జితేంద్ర సింగ్ వివరించారు. ప్రధాని మోదీ వ్యక్తిగత చొరవతో భారత్-బంగ్లాదేశ్ మధ్య కుదిరిన ప్రాంతాల మార్పిడి ఒప్పందం, వెరురు ఉత్పత్తులు, అమ్మకాలను పెంచేందుకు వందేళ్ల నాటి భారత అటవీ చట్టానికి సవరణ చేసేందుకు ప్రధాని తీసుకున్న చొరవ గురించి కూడా డా.జితేంద్ర సింగ్ వెల్లడించారు.
****
(Release ID: 1674399)
Visitor Counter : 211