రైల్వే మంత్రిత్వ శాఖ

రైల్వే బోర్డు అన్ని డైరెక్టరేట్ల పనితీరును రైల్వే, వాణిజ్య, పరిశ్రమల, ఆహార, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రి పియూష్ గోయల్ సమీక్షించారు.

మంచి పనులను కొనసాగించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.

మెరుగైన పర్యవేక్షణ, ప్రాజెక్టులను పూర్తిచేయడం, కార్యాచరణ సామర్థ్యాలు పెరగడం వల్ల అన్ని అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు వెళ్తాయని మంత్రి పేర్కొన్నారు.

Posted On: 19 NOV 2020 9:16PM by PIB Hyderabad

రైల్వే, వాణిజ్య, పరిశ్రమ, ఆహార, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రి  పియూష్ గోయల్ ఈ రోజు రైల్వే బోర్డు అన్ని డైరెక్టరేట్ల పనితీరును సమీక్షించారు. ఈ సమావేశంలో రైల్వే బోర్డు ఛైర్మన్ & సిఇఒ ,ఈడీ ర్యాంక్ , అంతకంటే ఎక్కువ స్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

స్లీపర్ లేదా 3 ఏసీ క్లాసులలో మరిన్ని సౌకర్యాల అభివృద్ధి, సరుకును మరింత సులభంగా పంపగలగడం , అన్ని వ్యాపారాలకు సరళంగా మార్చడం వంటి వాటిపై దృష్టి పెట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. సాధారణ ప్రయాణికులు , వ్యాపారాల అవసరాలపైనా శ్రద్ధ చూపాలని స్పష్టం చేశారు.

గత 8 నెలల్లో, కరోనాకు వ్యతిరేకంగా జాతీయ పోరాటాన్ని నడిపించడానికి భారత రైల్వే ముందుకు వచ్చింది.  సరుకు రవాణా పరిమాణం భారీగా పెరిగింది. లాక్ డౌన్ సమయంలో కీలకమైన నిర్వహణ ప్రాజెక్టులను పూర్తి చేయడం లేదా మద్దతు ఇవ్వడం వంటివి చేసింది.  జాతీయ ఆరోగ్య సంరక్షణ ప్రయత్నాలకు సాయం చేసింది. ఇలాంటి మంచి పనులు కొనసాగిస్తామని మంత్రి మరోసారి స్పష్టం చేశారు.

 

మెరుగైన పర్యవేక్షణ, ప్రాజెక్టుల సమయానుసారంగా పూర్తి చేయడం , కార్యాచరణ సామర్థ్యాలు పెరగడం వల్ల రైల్వేకు మౌలిక సదుపాయాల రంగంలో సామర్థ్యం పెరుగుతుందని అన్నారు.  వ్యాపార కార్యకలాపాలు , మౌలిక సదుపాయాలు వంటి  ప్రధాన రంగాలలో పనితీరును మరింత మెరుగుపరచడానికి మంత్రి అధికారుల నుండి సలహాలు , సూచనలను కోరారు. ప్రాజెక్టుల ప్రారంభానికి ముందే సరైన ప్రణాళిక, పరిశీలన ఉంటే వాటి ఖర్చు పెరదని చెప్పారు.  వాటిని త్వరగా పూర్తి చేయడానికి తగిన శ్రద్ధ అవసరం అని  పియూష్ గోయల్ అన్నారు.

***



(Release ID: 1674387) Visitor Counter : 133


Read this release in: English , Urdu , Hindi