రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

భూ నిర్వహణ వ్యవస్థ (ఎల్‌ఎంఎస్‌)

Posted On: 19 NOV 2020 6:43PM by PIB Hyderabad

రక్షణ శాఖ భూముల మొత్తం నిర్వహణను మెరుగుపరిచే ప్రయత్నాల్లో భాగంగా, మొదటిసారి, డీజీడీఈ, సాయుధ బలగాల భాగస్వామ్యంతో, భూ నిర్వహణ వ్యవస్థను (ఎల్‌ఎంఎస్‌) రక్షణ విభాగం రూపొందించింది. సైన్యం, డీజీడీఈ, రక్షణ విభాగం అధికారుల సమక్షంలో, ఈ పోర్టల్‌ను రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రారంభించారు. రక్షణ శాఖ భూములకు సంబంధించి భవిష్యత్తులో రక్షణ విభాగానికి అందే అన్ని విజ్ఞప్తులను ఈ ఇంట్రానెట్‌ పోర్టల్‌ డిజిటలీకరిస్తుంది. ఇప్పటివరకు దాచిన సమాచారాన్ని డిజిటలీకరించే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. 2016 నుంచి ఉన్న అన్ని కేసుల సమాచారాన్ని ఇప్పటికే పోర్టల్‌లో పొందుపరిచారు. భవిష్యత్‌ సమాచారాన్ని కూడా పోర్టల్‌లోకి అప్‌లోడ్‌ చేస్తారు. ఈ పోర్టల్‌ను కేవలం రక్షణ శాఖ కోసం మాత్రమే రూపొందించారు. ప్రజలకు అనుమతి లేదు.

    ఎల్‌ఎంఎస్‌లో గొప్ప వేగం, పారదర్శకత, సమర్థతను ఈ పోర్టల్‌ తీసుకువస్తుందని భావిస్తున్నారు. జీఐఎస్‌ ఆధారిత టూల్‌ ఏర్పాటుతో; నిర్ణయ ప్రక్రియలో భాగమైన సంబంధిత వర్గాల మధ్య అనవసర సంప్రదింపులను అరికట్టి, నిర్ణయ ప్రక్రియను ఈ పోర్టల్‌ మెరుగుపరుస్తుంది.

    జీఐఎస్‌ ఆధారిత సాంకేతికతలో మన దేశంలో ముఖ్య సంస్థ అయిన 'బీఐఎస్‌ఏజీ' ఈ జీఐఎస్‌ ఆధారిత వ్యవస్థకు సాంకేతిక మద్దతు అందిస్తోంది. రక్షణ నిర్వహణకు సంబంధించి అక్షరరూపంలో ఉన్న అన్ని వివరాలను ఈ సాఫ్ట్‌వేర్‌ తీసుకుంటుంది. 'రక్ష భూమి' సాఫ్ట్‌వేర్‌తోపాటు, ఉపగ్రహ ఛాయాచిత్ర ప్రాంతం, ఇతర సౌకర్యాలతో కూడిన మిగిలిన జీఐఎస్‌ సంబంధిత వ్యవస్థలకు ఆ సమాచారాన్ని అనుసంధానిస్తుంది.

***
 



(Release ID: 1674133) Visitor Counter : 178


Read this release in: English , Urdu , Hindi , Tamil