పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

అంతర్జాతీయ పంటల పరిశోధన సంస్థ డ్రోన్‌లను ఉపయోగించడానికి అనుమతి ఇచ్చింది.

వ్యవసాయ పరిశోధన కార్యకలాపాలకు డ్రోన్‌లను ఉపయోగించడానికి అనుమతి.

Posted On: 16 NOV 2020 12:39PM by PIB Hyderabad

వ్యవసాయ పరిశోధన కార్యకలాపాల కోసం డ్రోన్ల మోహరింపు కోసం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (మోకా) , డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ‘అంతర్జాతీయ పంటల పరిశోధనా సంస్థ, హైదరాబాద్, తెలంగాణ’కు షరతులతో కూడిన మినహాయింపు మంజూరు ఇచ్చింది.

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అంబర్ దుబే మాట్లాడుతూ “భారతదేశ వ్యవసాయ రంగంలో డ్రోన్లు పెద్ద పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా  వ్యవసాయం, మిడుతల నియంత్రణ , పంట దిగుబడులను పెంచడంలో ఇవి కీలకం. భారతదేశంలోని 6.6 లక్షలకు పైగా గ్రామాల కోసం బలమైన, తక్కువ ఖర్చుతో కూడిన డ్రోన్ పరిష్కారాలను తయారు చేయడానికి ప్రభుత్వం యువ పారిశ్రామికవేత్తలను , పరిశోధకులను ప్రోత్సహిస్తోంది. ” అని అన్నారు.

షరతులతో కూడిన మినహాయింపు లేఖ జారీ చేసిన తేదీ నుండి 6 నెలలు లేదా డిజిటల్ స్కై ప్లాట్‌ఫాం (ఫేజ్ -1)  పూర్తి అయ్యే వరకు వరకు.. వీటిలో ఏదై ముందేతే ఆ కాలం వరకు ఉంటుంది.  దిగువన పేర్కొన్న అన్ని షరతులకు, పరిమితులకు ఖచ్చితంగా కట్టుబడి ఉంటేనే ఈ మినహాయింపు చెల్లుతుంది. ఏదైనా షరతును ఉల్లంఘించినట్లయితే మినహాయింపు రద్దవుతుంది.

రిమోట్లీ పైలట్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్స్ ఉపయోగించి ఇక్రిశాట్ పరిశోధనా రంగంలో వ్యవసాయ పరిశోధన కార్యకలాపాల కోసం డేటా సేకరణ కోసం ఇక్రిశాట్ కు షరతులు , పరిమితులు క్రింద పేర్కొనడమైనది.

సీఏఆర్ సెక్షన్ 3, సిరీస్ ఎక్స్ పార్ట్ I (అనగా 5.2 (బి), 5.3, 6.1, 6.2, 6.3, 7.1. 7.3, 9.2, 9.3, 11.1 (డి), 11.2 (ఎ) 12.4  సంబంధిత నిబంధనల నుండి ఇక్రిశాట్ కి ఈ మినహాయింపు ఇస్తారు.  పౌర విమానయాన మంత్రిత్వ శాఖ 1937 లో విమాన నిబంధనల రూల్ 15 ఎ నుండి నిబంధనలకు లోబడి మినహాయింపులు వర్తిస్తాయి.

(ఎ) స్థానిక పరిపాలన (బి) రక్షణ మంత్రిత్వ శాఖ (సి) హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (డి)  భారత వైమానిక దళం , (ఇ) విమానాశ్రయ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నుండి ఇక్రిశాట్ పైలట్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ (ఆర్పీఏఎస్) కోసం అవసరమైన అనుమతులను పొందాలి.   భారత ప్రభుత్వానికి స్వచ్ఛందంగా వెల్లడించిన , చెల్లుబాటు అయ్యే డ్రోన్ రసీదు సంఖ్య (డీఏఎన్) (అనగా క్వాడ్ ఇక్రిశాట్2019 కోసం D1DAOOT2C) తో జారీ అయిన ఆర్పీఏఎస్ ను మాత్రమే ఇక్రిశాట్ నిర్వహిస్తుంది.

ఇక్రిశాట్ కార్యకలాపాల పరిధిపై సమగ్ర సంక్షిప్త సమాచారం , ఎస్ఓపీ కాపీని ఫ్లైట్ స్టాండర్డ్స్ డైరెక్టరేట్ (ఎఫ్ఎస్డీ), డీజీసీఏ కి సమర్పించాలి. రిమోట్లీ పైలట్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ (ఆర్పీఏఎస్)  ఆపరేషన్ ఎస్ఓపీ  వెట్టింగ్ / ఆమోదం తరువాత మాత్రమే జరుగుతుంది.

 డైరెక్టరేట్ ఆఫ్ రెగ్యులేషన్స్ & ఇన్ఫర్మేషన్, డీజీసీఏ నుండి ఏరియల్ ఫోటోగ్రఫీ కోసం ఇక్రిశాట్ అవసరమైన అనుమతి తీసుకోవాలి.

ఛాయాచిత్రాలు / వీడియో-గ్రాఫ్‌లు, ఆర్పీఏఎస్ ద్వారా తీస్తే ఇక్రిశాట్ మాత్రమే ఉపయోగించుకోవాలి. ఆర్పీఏఎస్ , ఆర్పీఏఎస్ ద్వారా సేకరించిన డేటా  భద్రతకు ఇక్రిశాట్ బాధ్యత వహించాలి.

ఆర్పీఏఎస్  ఆపరేషన్ విజువల్ లైన్ ఆఫ్ సైట్ (వీఎల్ఓఎస్) లో రోజు కార్యకలాపాలకు (సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు) పరిమితం చేయబడుతుంది.

ఈ కార్యకలాపాల వల్ల తలెత్తే ఏవైనా చట్టపరమైన కేసులు లేదా ఇతర సమస్యల నుండి  నష్టం జరిగితే ఇక్రిశాట్ డీజీసీఏ కి పరిహారం ఇస్తుంది.

ఆర్పీఏఎస్ పనిచేసే స్థితిలో ఉందని ఇక్రిశాట్ నిర్ధారిస్తుంది. పరికరాలు సరిగ్గా పనిచేయకున్నా బాధ్యత వహిస్తుంది.

పరికరాల వల్ల ఎవరికైనా ఏదైనా గాయం జరిగితే, ఇక్రిశాట్ మెడికో-లీగల్ సమస్యలకు బాధ్యత వహించాలి.

ఆర్పీఏఎస్ ఆపరేషన్ సమయంలో సంభవించిన ప్రమాదం, ఘటన ఫలితంగా మూడవ పక్షానికి ఏదైనా నష్టం జరిగితే సాయం కోసం ఇక్రిశాట్ తగిన స్థాయిలో బీమా కలిగి ఉండాలి.

ఏ పరిస్థితులలోనైనా ఆర్పీఏ ని ఉపయోగించడంలో ప్రమాదకర పదార్థం లేదా వేరియబుల్ పేలోడ్ జరగకుండా ఇక్రిశాట్ చూసుకోవాలి.

జనం, ప్రజాఆస్తి, ఆపరేటర్ మొదలైన వాటి భద్రత, భద్రత , గోప్యతను తగిన చర్యలు తీసుకుంటుంది. ఏదైనా జరిగితే, డీజీసీఏ బాధ్యత వహించదు.

సంబంధిత మంత్రిత్వ శాఖలు / అధికారుల అనుమతి లేకుండా సీఏఆర్ సెక్షన్ 3, సిరీస్ X, పార్ట్ I లోని పారా 13.1 లో పేర్కొన్న 10-ఫ్లై జోన్లలో ఇక్రిశాట్ ఆర్పీఏఎస్ ను ఆపరేట్ చేయకూడదు.

సీఏఆర్  నిబంధనల ప్రకారం విమానాశ్రయం సమీపంలో ఆర్పీఏఎస్ నిర్వహించకూడదు. విమానాశ్రయం సమీపంలో పనిచేస్తే, ఆర్పీఏఎస్  కార్యకలాపాల సమయం , విస్తీర్ణానికి సంబంధించి ఎఫ్ఆర్ఓఆర్ 1 కోసం విమానాశ్రయ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ముందుగానే అనుమతి తీసుకోవాలి.

  శిక్షణ పొందినవారు మాత్రమే ఆర్పీఏఎస్ ను నిర్వహిస్తారని ఇక్రిశాట్ నిర్ధారించాలి.

ఈ లేఖ ఇతర ప్రభుత్వ సంస్థలచే రూపొందించిన రిమోట్లీ పైలట్డ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్‌పై  ఎస్ఓపీ ఇతర పరిమితులను ఉల్లంఘించకూడదు.

కార్యకలాపాలు నిర్వహించే ఏ దశలోనైనా సంఘటన / ప్రమాదం జరిగితే, నివేదికలను డీజీసీఏ  ఎయిర్ సేఫ్టీ డైరెక్టరేట్కు అందించాలి

***(Release ID: 1673476) Visitor Counter : 117