ఆర్థిక మంత్రిత్వ శాఖ
రూ.13.08 కోట్ల విలువైన ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ కుంభకోణంలో ఒకరిని అరెస్టు చేసిన డీజీజీఐ, రోహ్‌తక్
Posted On:
13 NOV 2020 8:03PM by PIB Hyderabad
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) రోహ్‌తక్ ప్రాంతీయ యూనిట్, హిసార్‌కు చెందిన సతీందర్ కుమార్ సింగ్లా అనే వ్యక్తిని అరెస్టు చేసింది. దాదాపు రూ.75 కోట్ల పన్ను విలువగల సరకు అమ్మకాలు జరిగినట్లు నిందితుడు వివిధ సంస్థల నుంచి నకిలీ ఇన్వాయిస్‌లు సృష్టించాడని, రూ.13.08 కోట్ల విలువైన ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ను (ఐటీసీ) జారీ చేశాడని అధికారుల విచారణలో తేలింది.
సరకు రవాణాపై జీఎస్టీ కట్టే విషయంలో ప్రభుత్వాన్ని మోసం చేసే ఉద్దేశమున్న కొందరు కొనుగోలుదారులకు మోసపూరిత ఐటీసీని సతీందర్ అందించాడు. సరకును ఎక్కడికీ పంపకుండానే నకిలీ ఇన్వాయిస్‌లు జారీ చేయడంలో తన పాత్ర ఉందని, డబ్బు కోసం ఆ పని చేశానని, రికార్డుల్లోని కొన్ని నగదు నమోదులు మోసపూరితమైనవని విచారణలో సతీందర్ అంగీకరించాడు.
ఆ విధంగా సీజీఎస్‌టీ చట్టం-2017 నిబంధనల ప్రకారం సతీందర్ కుమార్ సింగ్లా నేరాలకు పాల్పడ్డాడు. 12.11.2020న అతనిని అధికారులు అరెస్టు చేసి, రోహ్‌తక్ చీఫ్ జుడిషియల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరపరిచారు. నిందితుడికి 14 రోజుల జుడిషియల్ కష్టడీని న్యాయమూర్తి విధించారు. ఈ కేసులో అధికారుల విచారణ కొనసాగుతోంది.
***
(Release ID: 1672813)
Visitor Counter : 104