విద్యుత్తు మంత్రిత్వ శాఖ
థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే బూడిద నుండి జియో పాలిమర్ ముతక కంకరను అభివృద్ధి చేసిన ఎన్‌టిపిసి
Posted On:
13 NOV 2020 2:01PM by PIB Hyderabad
ఈ రీసెర్చ్ ప్రాజెక్టు జాతీయ ప్రమాణాల చట్టబద్ధ పారామితులకు అనుగుణంగా ఉందని ఎన్‌సిసిబిఎం ధృవీకరించింది
న్యూఢిల్లీ, నవంబర్ 13, (పిఐబి): థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే బూడిద నుండి జియో పాలిమర్ ముతక కంకరను భారతదేశంలోనే అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తిదారు, విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్‌టిపిసి లిమిటెడ్ విజయవంతంగా అభివృద్ధి చేసింది. ఈ ఆవిష్కరణతో సహజ కంకర స్థానంలో ప్రత్యామ్నయం పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించేందుకు తోడ్పడుతుంది.
థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే బూడిద నుండి జియో పాలిమర్ ముతక కంకర ఉత్పత్తిపై ఎన్‌టిపిసి రీసెర్చ్ ప్రాజెక్టు జాతీయ ప్రమాణాల చట్టబద్ధ పారామితులకు అనుగుణంగా ఉంది, దీనిని జాతీయ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ (ఎన్‌సిసిబిఎం) ధృవీకరించింది.
సహజ కంకర స్థానంలో జియో పాలిమర్ ముతక కంకరను ఎన్‌టిపిసి విజయవంతంగా అభివృద్ధి చేసింది. దానిని కాంక్రీటు పనులలో ఉపయోగించడానికి ఎంత అనువుగా ఉంది అనే విషయాన్ని భారతీయ ప్రమాణాలకు అనుగుణమైన సాంకేతిక పారామితులను ఎన్‌సిసిబిఎం, హైదరాబాద్ పరీక్షించింది. ఫలితాలు ఆమోదించదగిన స్థాయిలో ఉన్నాయి.
బూడిద వినియోగంపై ఎన్‌టిపిసి పరిశోధన, అభివృద్ధి విజయం దాని అవధులను విస్తరింపచేసింది.
ప్రతి ఏడాది భారత్‌లో 2000 మిలియన్ మెట్రిక్ టన్నుల కంకరకు డిమాండ్ ఉంటుంది. థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడిన బూడిద ఈ డిమాండ్‌ను చాలావరకు తీర్చేందుకు సాయపడడమే కాకుండా, సహజ రాతిని తొలిచడం వల్ల ఏర్పడే సహజ కంకర పర్యావరణం పై చూపే ప్రభావాన్ని తగ్గిస్తుంది.
భారత దేశంలో బొగ్గుతో నడిచే థర్మల్ విద్యుత్ కేంద్రాలలో ప్రతి ఏటా సుమారు 258 మిలియన్ మెట్రిక్ టన్నుల బూడిద ఉత్పత్తి అవుతుంది. ఇందులో 78% బూడిదను ఉపయోగిస్తారు, మిగిలిన సగం వాడకపోవడంతో బూడిద కందకాల్లో మిగిలిపోతుంది. ఈ మిగిలిన బూడిదను వినియోగించేందుకు ఎన్‌టిపిసి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో 90%పైగా బూడిదను ఉపయోగించి కంకరను తయారు చేసే ప్రస్తుత రీసెర్చ్ ఒకటి.
జియో పాలిమర్ కంకరను నిర్మాణ రంగంలో విస్త్రతంగా ఉపయోగించవచ్చు, ఈ బూడిద పర్యావరణ అనుకూలం కూడా. ఇది ఎంత పర్యావరణానికి సానుకూలమంటే, ఈ కంకరను ఉపయోగించేటప్పుడు దానిని పట్టి ఉంచేందుకు సిమెంట్‌ను ఉపయోగించనవసరం లేదు. ఎందుకంటే, థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే బూడిద ఆధారిత జియోపాలిమర్ కంకరే బైండింగ్ ఏజెంటుగా పని చేస్తుంది. జియో పాలిమర్ కంకర కర్బన ఉద్గారాలను తగ్గించడంలో తోడ్పడటమే కాదు, నీటి వినియోగాన్ని తగ్గించే గొప్ప సంభావ్యతను కలిగి ఉంది.
***
(Release ID: 1672631)
Visitor Counter : 190