జల శక్తి మంత్రిత్వ శాఖ

2వ జాతీయ జల అవార్డుల బహుమతి పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కేంద్ర జల్ శక్తి మంత్రి

కోవిడ్ -19 మహమ్మారిపై పోరాడటానికి ప్రపంచం కలిసివచ్చిన విధంగానే నీటి రంగంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు కూడా ప్రపంచం కలిసి రావాలి: శ్రీ గజేంద్ర సింగ్ షేఖావత్

Posted On: 12 NOV 2020 6:09PM by PIB Hyderabad

 

 

ఈ రోజు జరిగిన 2 వ జాతీయ జల అవార్డుల బహుమతి పంపిణీ కార్యక్రమం ముగింపు కార్యక్రమానికి కేంద్ర జల్ శక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షేఖావత్ అధ్యక్షత వహించారు. ఈ అవార్డులను నవంబర్ 11 న భారత ఉపరాష్ట్రపతి  శ్రీ ఎం. వెంకయ్యనాయుడు ప్రారంభించారు. శ్రీ రత్తన్ లాల్ కటారియా, మినిస్టర్ అఫ్‌ స్టేట్ ఫర్ జల్ శక్తి, శ్రీ యు.పి. సింగ్,  జల్ శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి , శ్రీ అనిల్ జోషి, పద్మ భూషణ్ మరియు ప్రముఖ పర్యావరణవేత్త మరియు శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా, డిజి, ఎన్ఎంసిజి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సభలో ప్రసంగించిన శ్రీ షేఖావత్..ప్రపంచం మొత్తం కోవిడ్ -19 మహమ్మారి గుప్పెట్లో ఉందని..దానికి ఎవరూ అతీతులు కాదని చెప్పారు. అదేవిధంగా నీటి సమస్య ప్రపంచం మొత్తం ఎదుర్కొంటుందని ఆయన అన్నారు. భారతదేశంలో కూడా 100 కోట్లకు పైగా ప్రజలు నీటి సమస్యలతో బాధపడుతున్నారని.. అది సమస్య తీవ్రతను చూపిస్తుందన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ అవార్డుల విజేతలు తమ ప్రాంతాల్లోని నీటి సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనడంలో తమ వంతు పాత్ర పోషించినందుకు ప్రత్యేక ప్రశంసలకు అర్హులని చెప్పారు. కోవిడ్ -19 మహమ్మారిపై పోరాడటానికి ప్రపంచం ఒకచోట చేరిన విధంగానే..నీటి రంగంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రపంచం కలిసి రావాలని ఆయన అన్నారు. మనమందరం ఆత్మపరిశీలన చేసుకుని విపత్తులో అవకాశం కోసం వెతకాలని ఉద్ఘాటించారు. దేశం యొక్క ఆహార భద్రతను నిర్ధారించడానికి నీటి ప్రాముఖ్యత ఎంతో ఉందని శ్రీ షేఖావత్ స్పష్టం చేశారు.

మన ప్రధాని నేతృత్వంలో చేపట్టిన జల్ జీవన్ మిషన్ దేశంలోని అన్ని గృహాలకు తాగునీరు అందించడమే కాకుండా, నీటి సంరక్షణ, నీటి వనరుల పట్ల ప్రజల్లో అవగాహన కూడా  కల్పిస్తుందని చెప్పారు. భారతదేశాన్ని జల్ సమృద్ దేశంగా మార్చడంలో అది ఎంతగానే సహాయపడుతుందని శ్రీ షేఖావత్ అన్నారు. జల్ జీవన్ మిషన్ నీటి రంగంలో గేమ్ ఛేంజర్ లాంటిదని ఆయన అన్నారు. అటల్ భూజల్ యోజన ద్వారా  స్థిరమైన భూగర్భజల నిర్వహణ కోసం  తమ మంత్రిత్వ శాఖ చేస్తున్న ఆక్విఫర్ రీఛార్జ్  యొక్క ప్రాముఖ్యతను మంత్రి
నొక్కి చెప్పారు. జల్ శక్తిని ప్రజా ఉద్యమంగా మార్చే దిశలో నేటి పనితీరు సరైన దశ అని ఆయన అన్నారు. నీటి రంగంలో సవాలును ఎదుర్కోవటానికి మరియు నీటి సమృద్ధిగా ఉన్న దేశాన్ని రానున్న తరాలకు అందించడం ఇప్పుడు అందిరి ముందు ఉన్న ప్రధాన కర్తవ్యం అని ఆయన దిశానిర్దేశం చేశారు.

ఈ అవార్డుల విభాగంలో ఉత్తమ గ్రామ పంచాయతీ, ఉత్తమ పట్టణ స్థానిక సంస్థ, ఉత్తమ పరిశోధన / ఆవిష్కరణ / కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఉత్తమ విద్య / ప్రజల్లో అవగాహన ప్రయత్నం, ఉత్తమ టీవీ షో, ఉత్తమ వార్తాపత్రిక, ఉత్తమ పాఠశాల, ఉత్తమ సంస్థ / ఆర్‌డబ్ల్యుఎ / మత సంస్థ, ఉత్తమ పరిశ్రమ , ఉత్తమ ఎన్జీఓ, ఉత్తమ నీటి వినియోగదారుల సంఘం మరియు సిఎస్ఆర్ కార్యాచరణకు ఉత్తమ పరిశ్రమ వంటివి ఉన్నాయి.

 జల్ సమృద్ భారత సాధనకు జల్ శక్తి మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది: శ్రీ రత్తన్ లాల్ కటారియా


జల్ శక్తి మంత్రిత్వ శాఖను స్థాపించడం ద్వారా నీటి సంబంధిత సమస్యలను సమగ్రంగా మరియు క్షుణంగా చేపట్టేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ డైనమిక్ నాయకత్వాన్ని శ్రీ కటారియా ప్రశంసించారు.



జల్ శక్తి శాఖ సహాయమంత్రి శ్రీ రత్తన్ లాల్ కటారియా విజేతలందరినీ అభినందిస్తూ జల్ సమృద్ భారత్ సాధనకు తమ మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని చెప్పారు. జల్ శక్తి మంత్రిత్వ శాఖను స్థాపించడం ద్వారా నీటి సంబంధిత సమస్యలను సమగ్రంగా మరియు క్షుణంగా చేపట్టినందుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ డైనమిక్ నాయకత్వాన్ని ఆయన ప్రశంసించారు. తన నిబద్ధతతో మంత్రిత్వ శాఖను కొత్త శిఖరాలకు తీసుకెళ్లినందుకు కేంద్ర జల్ శక్తి మంత్రిని ఆయన అభినందించారు. జాతీయ జల పురస్కారాలు నీటి సంరక్షణ సందేశాన్ని వ్యాప్తి చేసే దిశలో సరైన దశ అని ఆ మేరకు ప్రతినిధులందరూ కలిసి రాగల వేదిక అని శ్రీ కటారియా అన్నారు. ప్రతి ఒక్కరూ నీటిని న్యాయబద్దంగా ఉపయోగించాలని ఆయన కోరారు. అలాగే నీటి రంగంలో ప్రవర్తనా మార్పు తీసుకురావడానికి ఈ అవార్డులు సహాయపడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

భారతదేశానికి గణనీయమైన వారసత్వం ఉందని నీటికి “భగవంతుడి” స్థానం అందించిన గొప్ప వారసత్వం మనకు లభించడం ఆనందంగా ఉందని శ్రీ కటారియా అన్నారు. నీటిని శుద్ధీకరణగా మాత్రమే కాకుండా ఈ గ్రహం మీద జీవనాధారంగా నిర్వచించే రుగ్వేదం మరియు అధర్వ వేదాన్ని ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు. పెరుగుతున్న జనాభా ఒత్తిడితో పాటు అభివృద్ధి అవసరాల కారణంగా నీటి కాలుష్యం, భూగర్భ జల వనరులు / జలాశయాలు క్షీణించడం వంటి సమకాలీన సమస్యలను ఆయన ఉదహరించారు. శ్రీ కటారియా తన మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలను వివరించారు. మొదటి సంవత్సరంలోనే ముఖ్యంగా గ్రామీణ గృహాలకు 87 లక్షల పైపుల తాగునీటి కనెక్షన్‌లను ఇచ్చే దిశలో అడుగులు వేశామని, ఆ పనిని గత ప్రభుత్వాలు విస్మరించాయని గుర్తు చేశారు.

శ్రీ యు.పి. సింగ్ మాట్లాడుతూ ఏటా 1000 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతున్నందున భారతదేశాన్ని నీటి పీడన దేశంగా పిలవబోనని అన్నారు. నీటిని సమర్థవంతంగా నిర్వహించడం మనకు అవసరమైన చెప్పారు. మనం ప్రధానంగా రీయూజ్, రిడ్యూస్, రీసైకిల్, రీచార్జ్ మరియు రెస్పెక్ట్ అనే ఐదు 'ఆర్‌' దృష్టి పెట్టాలని కోరారు. భారత దేశాన్ని జల సంమృద్ధి దేశంగా మలచడంతో పాటు నీటి సంరక్షణకు జిల్లా అధికార యంత్రాంగాల పాత్ర ఎంతో ఉందని స్పష్టం చేశారు.

అవార్డుల విజేతలను అభినందిస్తూ సమాజంలో పరివర్తన తీసుకురావడానికి జల్ శక్తి మరియు జనశక్తి కలయిక యొక్క ప్రాముఖ్యతను శ్రీ అనిల్ జోషి వివరించారు. భారతదేశంలో గతంలో చేసినట్లుగా నీటిని గౌరవించాలని అలాంటి విలువలు ప్రస్తుత యువతరంలో పెరగాలని చెప్పారు. దేశంలోని ప్రతి పౌరుడి “పర్యావరణ బాధ్యత” గురించి మాట్లాడిన ఆయన.. నీటి రంగంలో అవసరమైన మార్పులను తీసుకురావడానికి ఆ అవగాహన కల్పించడానికి జల్ సమృధి సరైన మార్గమని చెప్పారు. ఇది మంచి ఫలితాలను కూడా ఇస్తుందని అన్నారు. శ్రీ జోషి స్థూల పర్యావరణ ఉత్పత్తి  గురించి కూడా మాట్లాడారు. దేశంలోని సామూహిక చైతన్యంలో ఇది ఒక భాగం కావాలని తాను నమ్ముతున్నానని చెప్పారు.

అతిథులను స్వాగతిస్తూ నమామీ గంగే పథకం కింద తీసుకుంటున్న చర్యల గురించి  శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా డిజీ, ఎన్‌ఎంసిజీ, ప్రేక్షకులకు వివరించారు. దాంతో పాటు క్లీన్ గంగా మిషన్ విజయానికి ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని చెప్పారు.

చెల్లుబాటు అయ్యే 1112 దరఖాస్తులలో 16 విభాగాలలో మొత్తం 98 మంది విజేతలను ఎంపిక చేశారు. ఉత్తమ రాష్ట్రం, ఉత్తమ జిల్లా, ఉత్తమ గ్రామ పంచాయతీ, ఉత్తమ పట్టణ స్థానిక సంస్థ, ఉత్తమ పరిశోధన / ఆవిష్కరణ / కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఉత్తమ విద్య / ప్రజల్లో అవగాహన ప్రయత్నం, ఉత్తమ టీవీ షో, ఉత్తమ వార్తాపత్రిక, ఉత్తమ పాఠశాల, ఉత్తమ సంస్థ / ఆర్‌డబ్ల్యుఎ / రిలిజియస్ ఆర్గనైజేషన్, బెస్ట్ ఇండస్ట్రీ, బెస్ట్ వాటర్ రెగ్యులేటరీ అథారిటీ, బెస్ట్ వాటర్ వారియర్, బెస్ట్ ఎన్జీఓ, బెస్ట్ వాటర్ యూజర్ అసోసియేషన్ మరియు సిఎస్ఆర్ కార్యాచరణకు ఉత్తమ పరిశ్రమ వంటి అవార్డులు ఉన్నాయి. వాటర్ యూజర్స్ అసోసియేషన్ మరియు సిఎస్ఆర్ కార్యాచరణ విభాగం కింద ఉత్తమ పరిశ్రమలు వంటి రెండు విభాగాలు నేషనల్ వాటర్ అవార్డ్స్ 2019 లో చేర్చబడ్డాయి. ఈ వర్గాలలో కొన్ని దేశంలోని వివిధ మండలాల్లో ఉప వర్గాలను కలిగి ఉన్నాయి. విజేతలను ట్రోఫీలతో సత్కరించారు. ‘బెస్ట్ స్టేట్’, ‘బెస్ట్ స్టేట్’, ‘బెస్ట్ వాటర్ రెగ్యులేటరీ అథారిటీ’ అనే మూడు విభాగాలు మినహా మిగతా పదమూడు విభాగాల విజేతలకు నగదు బహుమతులు అందజేశారు.

నీటి సంరక్షణ మరియు నిర్వహణ రంగంలో ప్రశంసనీయమైన పని చేస్తున్న వ్యక్తులు / సంస్థలను గుర్తించడం జాతీయ నీటి అవార్డుల లక్ష్యం. అలాగే, నీటి ప్రాముఖ్యత గురించి ప్రజలలో అవగాహన కల్పించడానికి మరియు ఉత్తమమైన నీటి వినియోగ పద్ధతులను అనుసరించడానికి వారిలో స్పూర్తిని  ప్రేరేపించడానికి కూడా ఇవి దోహద పడతాయి.

జాతీయ నీటి పురస్కారాలు దేశవ్యాప్తంగా వ్యక్తులు మరియు సంస్థలు చేసిన కృషిని మరియు ప్రయత్నాలను గుర్తించడమే కాకుండా ‘జల్ సమృద్ భారత్’ సాధించడానికి ప్రభుత్వం చేపట్టిన సరైన ప్రయత్నం. ఈ కార్యక్రమం అంకుర సంస్థలతో పాటు ప్రముఖ సంస్థలు లక్ష్య సాధనలో నిమగ్నమవ్వడానికి అందులో ముందుకు సాగడాని మంచి అవకాశాన్ని ఈ కార్యక్రమం అందించింది. నీటి వనరుల పరిరక్షణ మరియు నిర్వహణలో ప్రతినిధుల నిమగ్నతను పెంచడానికి అలాగే వారి మధ్య బలమైన భాగస్వామ్యాన్ని సుస్థిరం చేయడానికి ఈ వేడుక సరైన సందర్భం.

నేషనల్ వాటర్ అవార్డ్స్ 2019 ను సెప్టెంబర్ 2019 లో mygov పోర్టల్‌లో ప్రారంభించారు. ఆ మేరకు ఎంట్రీలను కేంద్ర భూగర్భజల బోర్డు ఆహ్వానించింది. జ్యూరీ కమిటీకి జల వనరులు, నదీ అభివృద్ధి, గంగా పునర్జీవ శాఖ మాజీ కార్యదర్శి శ్రీ శశి శేఖర్ నాయకత్వం వహించారు. సిజిడబ్ల్యుబి మరియు సిడబ్ల్యుసి సభ్యులతో కూడిన రెండు స్క్రీనింగ్ కమిటీలు దరఖాస్తులను అధ్యయనం చేయడంలో మరియు విజేతలను ఎన్నుకోవడంలో జ్యూరీ కమిటీకి సహాయపడ్డాయి. నేషనల్ వాటర్ అవార్డు గ్రహీతలు, ప్రతినిధులు మరియు ప్రేక్షకులు వర్చువల్ ప్లాట్‌ఫామ్ ద్వారా లైవ్‌లో కలిశారు.

***



(Release ID: 1672435) Visitor Counter : 186


Read this release in: Tamil , English , Urdu , Hindi