భారత పోటీ ప్రోత్సాహక సంఘం

సినోకెమ్‌ గ్రూప్‌ కంపెనీ లిమిటెడ్‌ (సినోకెమ్‌), చైనా నేషనల్‌ కెమికల్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌ (కెమ్‌చైనా) మొత్తం వాటాలను చైనాకు చెందిన ఆస్తుల పర్యవేక్షణ, పరిపాలన (సెంట్రల్‌ ఎస్‌ఏఎస్‌ఏసీ) యాజమాన్యంలోని కొత్త సంస్థకు బదిలీ చేయడానికి సీసీఐ ఆమోదం

Posted On: 12 NOV 2020 6:54PM by PIB Hyderabad

సినోకెమ్‌ గ్రూప్‌ కంపెనీ లిమిటెడ్‌ (సినోకెమ్‌), చైనా నేషనల్‌ కెమికల్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌ (కెమ్‌చైనా) మొత్తం వాటాలను చైనాకు చెందిన ఆస్తుల పర్యవేక్షణ, పరిపాలన (సెంట్రల్‌ ఎస్‌ఏఎస్‌ఏసీ) యాజమాన్యంలోని కొత్త సంస్థకు బదిలీ చేయడానికి కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ‌) ఆమోదం తెలిపింది. పోటీ చట్టం-2002లోని సెక్షన్‌ 31(1) ప్రకారం వాటాల బదిలీకి అంగీకరించింది.

    సినోకెమ్‌ ప్రధాన కార్యాలయం చైనాలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల వ్యాపారాలను ఇది నిర్వహిస్తోంది. మన దేశంలో (i) ముడి చమురు అమ్మకాలు, (ii)  సహజ రబ్బరు, రబ్బరు యాంటీఆక్సిడెంట్ల విక్రయాలు, (iii) వ్యవసాయ రసాయనాలు (పురుగుమందులు, కలుపు నివారిణులు వంటివి) సహా వివిధ రకాల రసాయనాల అమ్మకం (iv) ఔషధ, ఆరోగ్య ఉత్పత్తుల విక్రయాల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

    కెమ్‌చైనా కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల వ్యాపారాలను నిర్వహిస్తోంది. ప్రధాన కార్యాలయం చైనాలో ఉంది. మన దేశంలో, (i) రసాయన ఉత్పత్తులు (మిథియోనైన్‌, కార్బన్‌, సిలికాన్ ఉత్పత్తులు సహా‌) అమ్మకాలు (ii) కార్లు, బస్సులు, ట్రక్కుల టైర్ల అమ్మకాలు (iii) రసాయన పరికరాల విక్రయాలు (iv) సౌర పీవీ మాడ్యూళ్ల అమ్మకాలను నిర్వహిస్తోంది.

    వాటాలను పొందిన కొత్త సంస్థ ఇంకా ఏర్పాటు కాలేదు కాబట్టి ఇంకా ఏ వ్యాపారాలు లేవు. 

***



(Release ID: 1672432) Visitor Counter : 136


Read this release in: English , Urdu , Hindi