మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ఏడు నెలల తర్వాత మరలా మొదలైన హునార్ హాత్.
హునార్ హాత్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రులు శ్రీ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి, శ్రీ కిరెన్ రిజిజు.
దేశీయంగా ప్రతిభావంతులైన కళాకారులు తయారు చేసిన కళాఖండాలు స్థానిక వైభవాన్ని చాటుతూ, అంతర్జాతీయంగా ప్రశంసలు పొందుతున్నాయి : ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి.
విర్చువల్ ఆన్ లైన్ వేదిక ద్వారా కూడా అందుబాటులోకి వచ్చిన హునార్ హాత్. కళాకారులు ఉత్పత్తులను http://hunarhaat.org ద్వారా కొనుగోలు చేయవచ్చు : శ్రీ నఖ్వీ
ఈ పండగ వేళ హునార్ హాత్ నుంచి ఉత్పత్తులను, బహుమతి వస్తువులను కొనుగోలు చేయడంవల్ల వోకల్ ఫర్ లోకల్ నినాదం బలోపేతమవుతుంది : శ్రీ కిరెన్ రిజుజు
ఈ నెల 11నుంచి 22 వరకు హునార్ హాత్ ప్రదర్శన.
Posted On:
11 NOV 2020 6:32PM by PIB Hyderabad
దేశీయంగా ప్రతిభావంతులైన కళాకారులు తయారు చేసిన అద్భుత దేశీయ కళాఖండాలు స్థానిక వైభవాన్ని చాటుతూ, అంతర్జాతీయంగా ప్రశంసలు పొందుతున్నాయని కేంద్ర మంత్రి శ్రీ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి అన్నారు.
కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వశాఖ సహాయ మంత్రి మరియు మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి అయిన శ్రీ కిరెన్ రిజిజుతో కలిసి కేంద్ర మంత్రి శ్రీ నఖ్వి హునార్ ఈ హాత్ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ ప్రదర్శన ఢిల్లీ హాట్, పీతాంపురలో ఈ నెల 11నుంచి 22వరకు కొనసాగుతుంది.
దేశీయంగా ప్రతిభావంతులైన కళాకారులు తయారు చేసిన కళాఖండాలకు హునార్ హాత్ ఒక గొప్ప వేదికగా వుందని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఆత్మనిర్భర్ భారత్, వోకల్ ఫర్ లోకల్ కార్యక్రమాలను ఇది బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి శ్రీ నఖ్వి అన్నారు.
కరోనా మహమ్మారి వైరస్ కారణంగా ఏడు నెలలపాటు ప్రదర్శనలు లేవని ఏడు నెలల తర్వాత తిరిగి హునార్ హాత్ ప్రారంభం కావడంపట్ల దేశవ్యాప్తంగా గల కళాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని శ్రీ నఖ్వి అన్నారు. మట్టి, చెక్క, జనపనార, వెదురు మొదలైన పదార్థాలద్వారా తయారు చేసిన అద్భుత కళాఖండాలు ఈ ప్రదర్శనలో కొలువుతీరాయని అమ్మకానికి సిద్ధంగా వున్నాయని కేంద్ర మంత్రి శ్రీ నఖ్వి అన్నారు.
విర్చువల్ ఆన్ లైన్ వేదిక ద్వారా కూడా ఈ కళాఖండాలు అందుబాటులో వున్నాయని ఆయా ఉత్పత్తులను http://hunarhaat.org ద్వారా కొనుగోలు చేయవచ్చని ఆయన వివరించారు.
దేశంలో ప్రతి ప్రాంతంలోను సంప్రదాయక, పురాతన కళా వారసత్వం వుందని, స్థానికంగా అనేక గొప్ప కళఖండాలు తయారవుతున్నాయని శ్రీ నఖ్వి అన్నారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన స్వదేశీ పిలుపు, వోకల్ ఫర్ లోకల్ పిలుపు కారణంగా దేశీయ పరిశ్రమలు మరింత బలపడుతున్నాయని ఆయన అన్నారు. ఆయ కళకారులు తయారు చేసిన కళఖండాలను ఆకర్షణీయంగా ప్యాక్ చేయడానికిగా పలు సంస్థలు సహాయం చేస్తున్నాయని అన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం నాణ్యమైన ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తూ సాంకేతికతను, వైవిధ్యాన్ని ఉపయోగించి ఈ రంగంలో ముందుకు పోతామని కేంద్ర మంత్రి శ్రీ నఖ్వి స్పష్టం చేశారు.
హునార్ హాత్ ద్వారా ఐదు లక్షల మంది భారతీయ కళకారులు, నిపుణులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయని దీనితో సంబంధమున్నవారిలో పలువురు ఇప్పటికే ప్రజాదరణ పొందారని శ్రీ నఖ్వి వివరించారు. మారుమూల ప్రాంతాల కళాకారులకు కూడా దీని ద్వారా మంచి అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు.
రానున్న రోజుల్లో జైపూర్, ఛండీగఢ్, ఇండోర్, ముంబాయి, హైదరాబాద్,లక్నో, న్యూఢిల్లీ ఇండియాగేట్, రాంఛీ, కోట, సూరత్ / అహమ్మదాబాదులలో హునార్ హాత్ నిర్వహిస్తామని మంత్రి ప్రకటించారు. కరోనా నేపథ్యంలో అన్ని నియమ నిబంధనల ప్రకారం ప్రదర్శనలుంటాయని ఆయన అన్నారు.
ఈ పండగ వేళ హునార్ హాత్ నుంచి ఉత్పత్తులను, బహుమతి వస్తువులను కొనుగోలు చేయడంవల్ల వోకల్ ఫర్ లోకల్ నినాదం బలోపేతమవుతుందని కేంద్ర మంత్రి శ్రీ కిరెన్ రిజిజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
హునార్ హత్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వందకు పైగా స్టాళ్లను ఇందులో ఏర్పాటు చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ తమ కళా ఉత్పత్తులను ఇందులో ప్రదర్శిస్తున్నారు. ప్రతి రోజూ సాయంత్రం పూట పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రసిద్ధి చెందిన కళాకారులు కూడా ప్రదర్శన తిలకించడానికి వస్తుండడంతో వారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.
****
(Release ID: 1672214)
Visitor Counter : 152