మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
కోల్‌కతాలోని ఎన్‌ఐటిటిఆర్ నిర్వహించిన ప్రాచీన భారతీయ విద్యా విధానంపై రెండు రోజుల జాతీయ సదస్సును కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రారంభించారు
Posted On:
11 NOV 2020 6:53PM by PIB Hyderabad
కోల్‌కతాలోని ఎన్‌ఐటిటిఆర్ నిర్వహించిన ప్రాచీన భారతీయ విద్యా విధానంపై రెండు రోజుల జాతీయ సదస్సును కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిశాంక్' ప్రారంభించారు. జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకునే మౌలానా ఆజాద్ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యుజిసి వైస్ చైర్మన్, శ్రీ భూషణ్ పట్వర్ధన్, కోల్‌కతా ఎన్‌ఐటిటిఆర్ డైరెక్టర్, ప్రొఫెసర్ డెబి ప్రసాద్ మిశ్రా, కోల్‌కతా ఎన్‌ఐటిటిటిఆర్, ఛైర్మన్ ప్రొఫెసర్ డెబి ప్రసాద్ మిశ్రా, శ్రీ హర్షవర్ధన్ నియోటియా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ పోఖ్రియాల్ మాట్లాడుతూ.. భారతీయ సాంప్రదాయ విజ్ఞాన వ్యవస్థ సైన్స్, టెక్నాలజీ, ఆర్ట్, ఆర్కిటెక్చర్, కల్చర్, మ్యాథమెటిక్స్, మెడిసిన్ తదితర రంగాల మేళవింపును కలిగి ఉండడం మనకు గర్వకారణమని చెప్పారు. భారతీయ శాస్త్ర పరిజ్ఞానాన్ని ఆధునిక సాంకేతికత, నూతన ఆవిష్కరణలతో అనుసంధానం చేయడం ద్వారా ప్రస్తుత సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆ మేరక చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
కోల్‌కతాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ & రీసెర్చ్ (ఎన్‌ఐటిటిఆర్) నిర్వహించిన ప్రాచీన భారతీయ విద్యా వ్యవస్థపై జాతీయ సెమినార్ ప్రారంభోత్సవం. #Kolkata. @SanjayDhotreMP @EduMinOfIndia @PIB_India @MIB_India @DDNewslive https://t.co/ytm3u3g9to
- డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ (rDrRPNishank)నవంబర్ 11, 2020
గొప్ప పండితుడు మరియు భారత మొదటి విద్యాశాఖ మంత్రి అయిన శ్రీ మౌలానా అబుల్ కలాం ఆజాద్‌ను ఆయన జయంతి సందర్భంగా కేంద్ర మంత్రి గుర్తు చేసుకున్నారు. ఈ సెమినార్ యొక్క ప్రాధాన్యతను శ్రీప్రోఖ్రియల్ వివరించారు. మన ప్రాచీన సంస్కృతి మరియు వారసత్వాన్ని ప్రస్తుత తరానికి అందించడాని ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయి.
ఈ జాతీయ సదస్సులో పాల్గోనే వారికి ప్రాచీన భారతీయ విద్యావ్యవస్థ యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సదస్సు మన పురాతన విద్య యొక్క ప్రాథాన్యతలను గుర్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుందన్నారు. అయితే గతాన్ని ఎప్పటికీ పట్టుకుని ఉండడం కాదని..మన భారతీయుల సమగ్ర అభివృద్ధికి భిన్నమైన దృష్టితో ఆలోచించడం అవసరమని అన్నారు. ఎన్‌ఇపి 2020 యొక్క అవసరాలకు అనుగుణంగా ఈ సదస్సును నిర్వహించినందుకు కోల్‌కతాలోని ఎన్‌ఐటిటిఆర్ చేసిన కృషిని ఆయన ప్రశంసించారు.
శ్రీ పట్వర్ధన్ సెమినార్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. దేశంలో ఉన్నత విద్య నాణ్యతను మెరుగుపరచడానికి యుజిసి చేపట్టిన ప్రధాన కార్యక్రమాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు.
ప్రారంభోత్సవంలో కోల్‌కతా డైరెక్టర్ ఎన్‌ఐటిటిఆర్ ప్రసంగించారు. నలంద మరియు తక్షశిల విశ్వవిద్యాలయాల వంటి గొప్ప అభ్యాస విధానాల గురించి, ప్రాచీన భారతీయ విద్యావ్యవస్థ గురించి మాట్లాడారు. తదుపరి వక్త, కాంగ్రీ గురుకుల విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సురేంద్ర కుమార్ వేద కాలంలో విద్యా విధానం గురించి మాట్లాడారు.
***
(Release ID: 1672174)
Visitor Counter : 104