రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

నైట్రోజన్‌ ఫాస్ఫరస్‌ ఎరువుల ధరలను దేశవ్యాప్తంగా తగ్గించిన 'ఇఫ్కో'

Posted On: 11 NOV 2020 5:18PM by PIB Hyderabad

నైట్రోజన్‌ ఫాస్ఫరస్‌ 20:20:0:13 అమ్మోనియం ఫాస్పేట్‌ సల్ఫేట్‌ ఎరువుల ధరలను బస్తాకు రూ.50 తగ్గించినట్లు 'ఇఫ్కో' ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నిల్వలపై తక్షణం ఈ తగ్గింపు అమల్లోకి వస్తుందని వెల్లడించింది.

 

    ఇఫ్కో ప్రకటన ప్రకారం, భూమికి కీలక పోషకమైన సల్ఫేట్‌పై టన్నుకు వెయ్యి రూపాయల ధర తగ్గింది. ఈ పోషకం అన్ని రకాల నూనెగింజల పంటలకు అత్యంత ప్రధానం. పంట నాణ్యత, మంచి ఎదుగుదలకు ఇది తోడ్పడుతుంది. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న శ్రీ ప్రధాని మోదీ దూరదృష్టిలో భాగంగా, ఎన్‌పీ 20:20:0:13 ఎరువుల ధరలను ఇఫ్కో తగ్గించింది.

    రైతుల కోసం, సాధ్యమైన అన్నిచోట్లా ఎరువుల ధరలను వరకు ఇఫ్కో తగ్గిస్తోంది. ఈ రబీ సీజన్‌లో డీఏపీ, ఎన్‌పీకే ఎరువుల ధరలను పెంచబోమని గత సెప్టెంబర్‌లో ఆ సంస్థ ప్రకటించింది.

***


(Release ID: 1672081) Visitor Counter : 122