బొగ్గు మంత్రిత్వ శాఖ
భారత్, ఇండొనేషియా మధ్య దృశ్య మాధ్యమం ద్వారా బొగ్గుపై 5వ వర్కింగ్ గ్రూపు సమావేశం
Posted On:
05 NOV 2020 7:05PM by PIB Hyderabad
కోవిడ్-19 మహమ్మారి కారణంగా అమలవుతున్న ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో భారత్, ఇండొనేషియాలు బొగ్గుపై 5వ జాయింట్ వర్కింగ్ గ్రూప్ (జెడబ్ల్యుజి) సమావేశాన్ని గురువారం న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భారత్ విజయవంతంగా నిర్వహించింది.
ఈ సమావేశానికి భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి వినోద్ కుమార్ తివారీ, రిపబ్లిక్ ఆఫ్ ఇండొనేషియా ఇంధన, ఖనిజవనరులు శాఖకు చెందిన ఖనిజాలు, బొగ్గు, పన్నేతర ఆదాయ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జాన్సన్ పక్పహాన్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ప్రారంభోపన్యాసం చేస్తూ భారత్‌లో బొగ్గు రంగం గురించి, భవిష్యత్తు పరిస్థితి గురించి స్థూలంగా వివరించారు. ఆత్మనిర్భర్ భారత్ కింద బొగ్గులో స్వయం సమృద్ధికి సంబంధించిన విశేషాంశాలను చెబుతూ, ఇరు దేశాల మధ్య బొగ్గు రంగంలో వ్యాపారం ఆవశ్యకత గురించి వివరించారు.
బొగ్గు విధాన సంస్కరణలు, కారు బొగ్గు అన్వేషణ, వాణిజ్యపరమైన మైనింగ్ పై బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రెజెంటేషన్లు ఇవ్వగా, ఇండొనేషియా అధికారులు బొగ్గు విధానం, ప్రస్తుత బొగ్గు వాణిజ్యం, ఇండొనేషియాలో పాతుకుపోయి ఉన్న బొగ్గు సామర్ధ్యం గురించి ప్రెజెంటేషన్లను ఇచ్చారు. భారత్‌కు చెందిన సిఎంపిడిఐఎల్, ఇండినేషియాకు చెందిన ఎంసిఆర్‌డిసి సాంకేతిక అంశాలను సమర్పించగా, తమకు అందుబాటులో ఉన్న నైపుణ్యాలను ఇచ్చి పుచ్చుకున్నారు. ఒక బహిరంగ చర్చను కూడా నిర్వహించారు.
పెట్టుబడిదారుల వారసత్వ వాణిజ్య ఆస్తులను గుర్తించడం కోసం భారతీయ పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) నిర్వహించిన సమావేశం నిర్మొహమాటమైన చర్చలకు తావివ్వడమే కాక, భారత, ఇండొనేషియా ప్రభుత్వాలు వీటిని పరిష్కరించాలని కోరారు. ఈ చర్చల సందర్భంగా ఇరు దేశాలలో అభివృద్ధి చెందుతున్న వ్యాపార అవకాశాలను గురించి కూడా పట్టి చూపించారు.
ఈ ఫోరం ఆవల కూడా చర్చలను ముందుకు తీసుకువెళ్ళాలని నిర్ణయించారు.
***
(Release ID: 1670644)
Visitor Counter : 176