వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
2020-21 ఖరీఫ్ మార్కెటింగ్ సీజనుకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అమలు తీరు
గత పంట సీజన్ల మాదిరిగానే ప్రభుత్వం 2020-21 ఖరీఫ్ పంటలను కూడా జరుగుతున్న 2020-21 ఖరీఫ్ మార్కెటింగ్ సీజనుకు రైతుల నుంచి ప్రస్తుతము అమలులో ఉన్న కనీస మద్దతు ధర స్కీము ప్రకారం సేకరణ సాగిస్తున్నది.
Posted On:
05 NOV 2020 8:00PM by PIB Hyderabad
ఖరీఫ్ 2020-21 పంటకాలానికి పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, తమిళనాడు, చండీగఢ్, జమ్మూ & కాశ్మీర్ , కేరళ , గుజరాత్ మరియు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో ధాన్యం సేకరణ చురుకుగా సాగుతున్నది. 2020 నవంబర్ 4వ తేదీ బుధవారం వరకు 231.04 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ ఎం టి) వరిధాన్యం కొనుగోలు చేశారు. గత సంవత్సరం ఇదే సమయంలో చేసిన 192.41 ఎల్ ఎం టిల ధాన్యంతో పోల్చితే ఇది 20.07 % ఎక్కువ. ఈ ఏడాది కొనుగోలు చేసిన 231.04 ఎల్ ఎం టిలలో ఒక్క పంజాబ్ రాష్ట్రం నుంచి మాత్రమే 163.11 ఎల్ ఎం టిలు సేకరించారు. ఇది మొత్తం సేకరణలో 70.60 %.
ప్రస్తుతం కొనసాగుతున్న ఖరీఫ్ మార్కెటింగ్ సీజను సేకరణలో ఇప్పటివరకు 19.48 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. సేకరించిన ధాన్యం ఎంఎస్పీ విలువ రూ. 43620.10 కోట్లు.
అంతేకాకుండా ధరల మద్దతు స్కీము (పిఎస్ఎస్) కింద ఖరీఫ్ మార్కెటింగ్ సీజను 2020లో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి అందిన ప్రతిపాదనల మేరకు 45.10 ఎల్ ఎం టిల పప్పు ధాన్యాలు మరియు నూనె గింజల సేకరణకు అనుమతి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాల నుంచి 1.23 ;లక్షల మెట్రిక్ టన్నుల కొబ్బరి (ఏడాది పొడవునా ఉండే) సేకరణకు అనుమతి మంజూరు చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల నుంచి పప్పు ధాన్యాలు, నూనె గింజలు మరియు కొబ్బరి సేకరణకు ప్రతిపాదనలు అందినట్లయితే ధరల మద్దతు స్కీము (పిఎస్ఎస్) ప్రకారం 2020-21 సంవత్సరానికి ప్రకటించిన ఎమ్మెస్పీ ప్రకారం నేరుగా నమోదు చేసుకున్న రైతుల నుంచి సేకరణకు ఆమోదం తెలుపడం జరుగుతుంది. ఒకవేళ ఆయా రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రకటిత సీజన్లో మార్కెట్ ధర తగ్గినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ సేకరణ సంస్థల ద్వారా కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీలు కనీస మద్దతు ధరకు సేకరణ జరుపుతాయి.
తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ , హర్యానా మరియు రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన 13509 మంది రైతుల నుంచి రూ. 120.99 కోట్ల విలువైన కనీస మద్దతు ధర చెల్లించి కేంద్రప్రభుత్వం తమ నోడల్ ఏజెన్సీల ద్వారా 04.11.2020 వరకు 22,481.13 మెట్రిక్ టన్నుల పెసర్లు, మినుములు, వేరుశనగ కాయలు మరియు సోయాబీన్ సేకరించడం జరిగింది. ఇది గత సంవత్సరం సేకరించిన 14,904.61 మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాలు మరియు నూనెగింజలతో పోల్చితే 50.83 శాతం ఎక్కువ. అదేవిధంగా కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 3961 మంది రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా 5089 మెట్రిక్ టన్నుల కొబ్బరిని (ఏడాది పొడవునా ఉండే) రూ. 52.40 కోట్ల కనీస మద్దతు ధర చెల్లించి సేకరించడం జరిగింది. గత సంవత్సరం ఇదే సమయంలో సేకరించిన కొబ్బరి మొత్తం 293.34 మెట్రిక్ టన్నులు. అనేక ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాలలో కొబ్బరి, మినుముల మార్కెట్ ధరలు ఎమ్మెస్పీకి పైన పలుకుతున్నాయి. పప్పుధాన్యాలు మరియు నూనె గింజల ఖరీఫ్ పంట రాకకు అనుగుణంగా ఆయా తేదీల నుంచి సేకరణ ప్రారంభించడానికి ఆయా రాష్ట్ర / కేంద్రపాలిత ప్రభుత్వాలు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాయి.
పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఎంఎస్పీ ప్రకారం పత్తిగింజల (పత్తి) సేకరణ పనులు సాఫీగా సాగుతున్నాయి. 04.11.2020 వరకు 844316 బేళ్ల పత్తిని సేకరించడం జరిగింది సేకరించిన పత్తి విలువ రూ. 244937 లక్షలు ఈ సేకరణ వల్ల 162091 మంది రైతులకు ప్రయోజనం చేకూరింది.
***
(Release ID: 1670593)
Visitor Counter : 141