వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020-21లో కనీస మద్దతు ధర కార్యకలాపాలు
గత ఏడాదితో పోలిస్తే 20.18% పెరిగిన వరి సేకరణ
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ సేకరణ కార్యకలాపాలలో భాగంగా కనీస మద్దతు ధరతో రూ. 42422. 40 కోట్ల మేరకు లబ్ధి పొందిన సుమారు 18.91 లక్షల వరి రైతులు
Posted On:
04 NOV 2020 5:31PM by PIB Hyderabad
ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కెఎంఎస్) 2020-21కి గాను ప్రభుత్వం ఖరీఫ్ 2020-21 పంటలను ప్రస్తుతం ఉనికిలో ఉన్న కనీస మద్దతు ధరల పథకానికి అనుగుణంగా కనీస మద్దతు ధరను చెల్లించి రైతుల నుంచి పంటను సేకరిస్తోంది. గత ఏడాది కూడా ఇదే విధంగా ప్రభుత్వం పంట సేకరణను జరిపింది.
ఖరీఫ్ 2020-21లో వరి సేకరణ పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తమిళనాడు, చండీగఢ్, జమ్ము&కాశ్మీర్, కేరళ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలలో వేగంగా సాగుతోంది. గత ఏడాది ఇదే కాలంలో సేకరించిన 186.97 లక్షల మెట్రిక్ టన్నులతో పోలిస్తే ఈ ఏడాది 20.18% ఎక్కువగా 03.11.2020వరకు 224.70 లక్షల మెట్రిక్ టన్నుల వరిని ప్రభుత్వం కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన మొత్తం 224.70 లక్షల మెట్రిక్ టన్నులలో కేవలం పంజాబ్ 158.47 మెట్రిక్ టన్నులతో దోహదం చేసింది. ఇది మొత్తం సేకరణలో 70.52%గా ఉంది.

కొనసాగుతున్న సేకరణలో భాగంగా సుమారు 18.91 లక్షల రైతులు రూ. 42422.49 కోట్లు మేరకు కనీస మద్దతు ధర రూపంలో బ్ధిపొందారు.

రాష్ట్రాల ప్రతిపాదనల ఆధారంగా, ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020లో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, ఒడిషా, రాజస్థాన్, ఆంధ్ర ప్రదేశ్‌లలో ధర మద్దతు పథకం (పిఎస్ ఎస్) కింద 45,10 లక్షల మెట్రిక్ టన్నుల పప్పు ధాన్యాలు, నూనె విత్తనాలను సేకరించేందుకు అనుమతించారు. అలాగే, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి 1.23 లక్షల మెట్రిక్ టన్నుల కొబ్బరి (నిరంతర పంట)ను సేకరించేందుకు అనుమతి జారీ చేశారు. పప్పు ధాన్యాలు, నూనెవిత్తనాలు, కొబ్బరిని పిఎస్ ఎస్ కింద సేకరించేందుకు రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ప్రతిపాదనలను అందుకున్నాక ఆమోదాన్ని తెలుపనున్నారు. తద్వారా నాణ్యత ఆధారంగా వర్గీకరించిన పంటలకు ఆయా రాష్ట్రాలలో/ కేంద్ర పాలిత ప్రాంతాలలో ధరలు 2020-21 పంటకాలంలో మార్కెట్ ధరలు కనీస మద్దతు కన్నా తగ్గితే కనీస మద్దతు ధరను నమోదు చేసుకున్న రైతులకు కేంద్ర నోడల్ ఏజెన్సీల ద్వారా రాష్ట్రం నామినేట్ చేసిన సేకరణ ఏజెన్సీల ద్వారా ప్రత్యక్షంగా నోటిఫై చేస్తారు.
నోడల్ ఏజెన్సీల ద్వారా ప్రభుత్వం 03.11.2020 వరకు రూ. 100.11 కోట్ల విలువతో 18523.69 మెట్రిక్ టన్నుల పెసరపప్పు, మినపపప్పు, వేరుశనగ కాయలు, సోయాబీన్‌ను సేకరించి తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, రాజస్థాన్‌లోని 11243మంది రైతులకు లబ్ధి చేకూర్చింది. అలాగే, కర్ణాటక, తమిళనాడులలో 3961మంది రైతులకు లబ్ధి చేకూరుస్తూ రూ. 52.40 కోట్ల కనీస మద్దతు ధర గల 5089 మెట్రిక్ టన్నుల కొబ్బరిని సేకరించింది. కొబ్బరి, మినపప్పు విషయంలో, ప్రధానంగా ఈ పంట పండించే రాష్ట్రాలలో ధరలు కనీస మద్దతు ధరకన్నా ఎక్కువగా ఉన్నాయి. ఖరీఫ్ పప్పు ధాన్యాలు, నూనెవిత్తనాల రాక ఆధారంగా నిర్ణయించిన తేదీల నుంచి సేకరణను ప్రారంభించేందుకు ఆయా రాష్ట్రాలు/ కేంద్ర ప్రభుత్వ ప్రాంత ప్రభుత్వాలు తగిన ఏర్పాట్లు చేస్తున్నాయి.

ఇక, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, తెలంగాన రాష్ట్రాలలో కనీస మద్దతు ధర కింద పత్తి విత్తనాల సేకరణ సాఫీగా సాగుతోంది. దాదాపు 147480 మంది రైతులకు లబ్ధిని చేకూరుస్తూ రూ. 224235 లక్షల విలువైన 770802 పత్తి బేళ్ళను 03.11.2020 వరకు సేకరించారు.

***
(Release ID: 1670226)