నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
2020-21 ఆర్థిక సంవత్సరానికి కీలక లక్ష్యాలు నిర్దేశిస్తూ ఎంఎన్ఆర్ఇతో అవగాహన పత్రంపై సంతకాలు చేసినే ఇరెడా
“ఎక్సలెంట్” రేటింగ్ కింద రూ.2406 కోట్ల ఆదాయం లక్ష్యం నిర్ణయం
2 నవంబర్, 2020
प्रविष्टि तिथि:
02 NOV 2020 7:19PM by PIB Hyderabad
2020-21 సంవత్సరానికి కీలక లక్ష్యాలు నిర్దేశిస్తూ భారత పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (ఇరెడా) కేంద్రప్రభుత్వ నవ్య, పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖతో (ఎంఎన్ఆర్ఇ) అవగాహన పత్రంపై (ఎంఓయు) సంతకాలు చేసింది. ఎంఎన్ఆర్ఇ, ఇరెడా సీనియర్ అధికారులు హాజరైన ఒక కార్యక్రమంలో ఎంఎన్ఆర్ఇ కార్యదర్శి శ్రీ ఇందుశేఖర్ చతుర్వేది, ఇరెడా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రదీప్ కుమార్ దాస్ ఈ ఎంఓయుపై సంతకాలు చేశారు.
కార్యకలాపాల ద్వారా ఆదాయంలో నిర్వహణా లాభాల శాతం, సగటు నికర విలువలో పన్ను చెల్లింపుల అనంతర లాభం (పిఎటి) శాతం, రుణ వితరణ, ఓవర్ డ్యూ రుణం వంటి భిన్న విభాగాల్లో “ఎక్సలెంట్” రేటింగ్ కింద కేంద్రప్రభుత్వం రూ.2406 కోట్ల ఆదాయ లక్ష్యం నిర్దేశించింది.
2020 నవంబర్ నాటికి 2700 పైగా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ఇరెడా రూ.57,000 కోట్లకు పైగా రుణం అందించింది. తద్వారా 17,259 మెగావాట్ల అదనపు హరిత ఇంధనం జోడించడానికి అవసరమైన మద్దతు అందించింది.
***
(रिलीज़ आईडी: 1669669)
आगंतुक पटल : 203