ఆర్థిక మంత్రిత్వ శాఖ

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానివారికి కూడా ఎల్టిసి ఆదాయం పన్ను మినహాయింపు


Posted On: 29 OCT 2020 8:11PM by PIB Hyderabad

కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తి దీనివల్ల దేశవ్యాపితంగా విధించిన లాక్ డౌన్, రవాణా ఆతిధ్య రంగాలలో ఏర్పడిన అవాంతరాలు మరియు సామాజిక దూరాన్ని పాటించవలసి రావడంతో అనేక మంది ఉద్యోగులు ప్రస్తుత 2018-21 కాలంలో సెలవు కాలపు ప్రయాణ రాయితీని (ఎల్టిసి) సౌకర్యాన్ని ఉపయోగించుకోలేక పోయారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కలిగిన నష్టానికి పరిహారం చెల్లించి తద్వారా నగదు వినియోగాన్ని ఎక్కువ చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2018-21లో ఎల్టిసికి బదులు అర్హతలకు తగిన నగదు చెల్లింపు, సెలవులను నగదుగా మార్చుకునే సదుపాయాన్ని 2020 అక్టోబర్ 12న జారీ అయిన OM No F. No 12(2)/2020-EII లో పొందుపరచిన నిబంధనల ప్రకారం కల్పించాలని నిర్ణయించింది. ఎల్టిసికి ఆదాయం పన్ను మినహాయింపు ఉన్నందున ఎల్టిసికి బదులు అర్హతలకు తగినట్టు నగదు చెల్లింపు, సెలవులను నగదుగా మార్చుకునే సదుపాయానికి కూడా పన్ను మినహాయింపును కల్పించారు.

ఇప్పుడు పైన పేర్కొన్న om పరిధిలోకి రాని ఇతర ఉద్యోగులకు (అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానివారు ) కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కల్పిస్తున్న విధంగానే ఎల్టిసికి బదులు అర్హతలకు తగినట్టు నగదు చెల్లింపు, సెలవులను నగదుగా మార్చుకునే ఆదాయానికి పన్ను రాయితీ కల్పించాలని నిర్ణయించడం జరిగింది. దీనిప్రకారం ఎల్టిసికి సమానంగా చెల్లించే మొత్తంలో కింది నిబంధనలకు అనుగుణంగా అత్యధికంగా 36,000 రూపాయలను ఆదాయం పన్ను చెల్లింపు నుంచి మినహాయించడం జరుగుతుంది.

(a). సంబంథిత ఉద్యోగి 2018-21 కాలానికి ఎల్టిసికి ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవలసి ఉంటుంది.

(b). ఛార్జీల విలువకు మూడు రెట్లు, నగదుగా మార్చుకున్న సెలవు విలువకు సమాన మొత్తంలో వస్తువులు / సేవలు కొనుగోలు చేయాలి. వస్తు సేవల చట్టం కింద నమోదు అయిన వ్యాపారి నుంచి 12 శాతం కంటే ఎక్కువగా పన్ను వర్తించే వస్తువులు / సేవలను కొనుగోలు చేయాలి.

(c). నిర్ణీత సమయంలో నగదుగా మార్చుకున్న సెలవు విలువకి మూడు రెట్ల కన్నా తక్కువగా వస్తువులు / సేవలు కొనుగోలు చేసే ఉద్యోగికి పూర్తి పన్ను రాయితీ లభించదు. అతనికి అందించే రాయితీని కింద తెలియజేసిన విధంగా మదింపు వేయడం జరుగుతుంది.

పైన పేర్కొన్న నిబంధనలను పాటించిన ఉద్యోగులకు సంబంధిత కాలానికి DDOలు ఆదాయం పన్ను రాయితీని కల్పించవచ్చును. అయితే, ఎల్టిసికి ప్రత్యామ్నాయంగా ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నందున ఆదాయం పన్ను చట్టం 1961 సెక్షన్ 115 BAC కింద పన్ను చెల్లించే సదుపాయాన్ని ఎంచుకున్న ఉద్యోగులకు ఈ సౌకర్యం వర్తించదు .

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఖర్చుల శాఖ 2020 అక్టోబర్ వ తేదీన జారీ చేసిన OM F. No 12(2)/2020-EII (A) లోనూ ఆ తరువాత జారీ చేసిన వివరణలు నిబంధనలు పాటించే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కాని ఇతర ఉద్యోగులకు కూడా పూర్తిగా వర్తిస్తాయి.

నూతన మార్గదర్శకాలకు సంబంధించి ఆదాయం పన్ను చట్టం 1961లో కాలానుగుణంగా శాసనపరమైన మార్పులు చేయబడతాయి.

ఉదాహరణ -A

గుర్తించిన ఎల్టిసి మొత్తం       : రూ. 20,000 x 4 = రూ. 80,000

ఖర్చు చేయవలసిన మొత్తం : రూ. 80,000 x 3 = రూ. 2,40,000

అంటే ఒక ఉద్యోగి రూ. 2,40,000 లేదా అంతకు మించిన మొత్తాన్ని ఖర్చు చేస్తే అతడు ఎల్టిసి మొత్తానికి ఆదాయం పన్ను మినహాయింపు పొందుతాడు. అయితే, ఉద్యోగి 1,80,000 రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తే అతను 75% ( 60,000 రూపాయలు) ఎల్టిసి రాయితీకి అర్హత సాధిస్తాడు.

ఇప్పటికే యాజమాన్యం నుంచి 80,000 రూపాయలను అడ్వాన్సుగా పొంది ఖర్చు చేయవలసి ఉన్న మొత్తంలో 75% మాత్రమే ఖర్చు చేసిన ఉద్యోగి 20,000 రూపాయలను తిరిగి చెల్లించవలసి ఉంటుంది.

 

*****



(Release ID: 1668757) Visitor Counter : 246