ఆర్థిక మంత్రిత్వ శాఖ

వినూత్న ఫిన్టెక్ సొల్యూషన్స్ కోసం రెగ్యులేటరీ శాండ్బాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టిన : ఐఎఫ్ఎస్సీఏ

Posted On: 19 OCT 2020 6:08PM by PIB Hyderabad

అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రాల ప్రాధికార సంస్థ (ఐఎఫ్ఎస్‌సిఎ), గాంధీనగర్ (గుజరాత్, భారతదేశం) లోని గిఫ్ట్ సిటీలో ఉన్న ఐఎఫ్ఎస్‌సిలో ప్రపంచ స్థాయి ఫిన్‌టెక్ హబ్‌ను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తోంది.  బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, సెక్యూరిటీలు, ఫండ్ మేనేజ్‌మెంట్ వంటి ఫైనాన్షియల్ ప్రొడక్టుల్లో, ఫైనాన్షియల్ సర్వీసుల్లో ఫైనాన్షియల్ టెక్నాలజీలను ప్రోత్సహిస్తోంది. ఈ లక్ష్యాన్ని సాధించే దశగా, ఐఎఫ్ఎస్‌సీఏ “రెగ్యులేటరీ శాండ్‌బాక్స్” కోసం ఒక విధానాన్ని (ఫ్రేమ్‌వర్క్‌) ప్రవేశపెట్టింది. ఈ శాండ్‌బాక్స్ ఫ్రేమ్‌వర్క్ కింద, క్యాపిటల్ మార్కెట్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్  ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో పనిచేసే సంస్థలకు స్వల్పకాలానికి కొంతమంది నిజమైన కస్టమర్లతో ప్రత్యక్ష వాతావరణంలో వినూత్న ఫిన్‌టెక్ సొల్యూషన్స్తో ప్రయోగాలు చేయడానికి కొన్ని సౌకర్యాలు, సదుపాయాలను అందిస్తారు.  పెట్టుబడిదారుల రక్షణ కోసం, వారికి రిస్క్ తగ్గించడానికి అవసరమైన భద్రతా విధానాలు అమల్లో ఉంటాయి. రెగ్యులేటరీ శాండ్‌బాక్స్ గిఫ్ట్‌ సిటీలో ఉన్న ఐఎఫ్ఎస్‌సీ లో పనిచేస్తుంది.

 

క్యాపిటల్ మార్కెట్కు చెందిన బ్యాంకింగ్, ఇన్సూరెన్స్  పెన్షన్ సెక్టార్ల కంపెనీలు, వ్యక్తిగత ఎఫ్ఏటీఎఫ్ నిబంధనల పరిధిలోకి వచ్చే స్థానిక స్టార్టప్లు రెగ్యులేటరీ శాండ్‌బాక్స్‌లో పాల్గొనడానికి అర్హులు. శాండ్బాక్స్లో పాల్గొనాలని కోరుకునే కంపెనీల వినూత్న ఫిన్‌టెక్ పరిష్కారాలు, ప్రతిపాదనలను  వ్యాపార నమూనాలు ఐఎఫ్ఎస్‌సీఏ కి వర్తిస్తాయి.

శాండ్‌బాక్స్‌లో పరిమిత పర్పస్ టెస్టింగ్ను మొదలుపెట్టడానికి ఐఎఫ్ఎస్సీఏ దరఖాస్తులను మదింపు చేసి, నియంత్రణపరమైన మినహాయింపులను ఇస్తుంది.   అర్హత ప్రమాణాలు, దరఖాస్తు  ఆమోద ప్రక్రియ,  శాండ్‌బాక్స్  కార్యాచరణ అంశాల వంటి వివరాలను సర్క్యులర్‌ ద్వారా ప్రకటించారు.

ఐఎఫ్ఎస్సీలో ఆవిష్కరణలు (ఇనోవేటివ్) కేంద్రంగా పనిచేసే విధానాన్ని సృష్టించడానికి, ఇన్నోవేషన్ శాండ్బ్యాక్స్ను ఏర్పాటు చేయాలని ఈ సంస్థ ప్రతిపాదించింది. ఫిన్టెక్ కంపెనీలు దీనిని మార్కెట్ ఇన్ఫ్రా ఇన్స్టిట్యూషన్స్ (ఎంఐఐలు) అందించే డేటా ఆధారిత లైవ్ మార్కెట్తో సంబంధం లేకుండా వేర్వేరుగా పరీక్షలు నిర్వహించుకోవడానికి ఉపయోగించవచ్చు.   ఇన్నోవేషన్ శాండ్‌బాక్స్ను ఐఎఫ్ఎస్‌సీ లో పనిచేసే ఎంఐఐలే నిర్వహిస్తాయి.

రెగ్యులేటరీ శాండ్‌బాక్స్  ఫ్రేమ్‌వర్క్‌పై మరిన్ని వివరాల కోసం https://ifsca.gov.in/Circular వెబ్సైట్ను చూడవచ్చు.

***



(Release ID: 1665982) Visitor Counter : 176