వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ఇటీవల పెరిగిన రిటైల్ కందిపప్పు,మినపపప్పు ధరలు తగ్గించేందుకు చర్యలు
మినపపప్పును రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు (ఖరీఫ్ 2018సరకు)కె -18 కిలో 79 ఐసాచల వంతున,కందిపప్పును కిలో 85 రూపాయల వంతున రిటైల్ ధరల అదుపుకోసం అందజేయడం జరుగుతోంది.
Posted On:
10 OCT 2020 8:42PM by PIB Hyderabad
ఇటీవల రిటైల్ మార్కెట్ లో పెరిగిన కందిపప్పు,మినపపప్పు ధరలను తగ్గించి, వినియోగదారులకు మేలు చేసేందుకుప్రభుత్వం చర్యలు చేపట్టింది.ఇందుకు అనుగుణంగా ఈ పప్పుల సరఫరాను పెంచింది.
పప్పుల ధరలను ఒక మాదిరిస్థాయికి తెచ్చేందుకు , డిఒసిఎ, గతంలో ప్రభుత్వం ఉద్ద ఉన్న మిగులు నిల్వలను కనీసమద్దతుధరపై పదిశాతం కలుపుకుని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు బల్క్ గా లేదా రిటైల్‌గా సరఫరా చేసే విధానాన్ని ప్రవేశపెట్టింది. రిటైల్‌ధరలపై మరింత ప్రభావంచూపే విధంగా ఉండేందుకు పప్పుల ఆఫర్ ధర రిటైల్ మార్కెట్ కోసం నిర్దేశించినవాటి విషయంలో కనీస మద్దతుధర లేదా డైనమక్ రిజర్వు ధర ఏది తక్కువ అయితే దానినిగా సవరించారు.
ఇందుకు అనుగుణంగా మినపపప్పును రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రిటైల్‌ధర కింద కె-18(ఖరీఫ్ 2018 నిల్వను) 79 రూపాయలకు ,కె-19 ను కిలో 81 రూపాయలకు అందజేస్తున్నారు. అలాగే కందిపప్పునుకిలో 85 రూపాయలకు రిటైల్ మార్కెట్‌కోసం అందజేస్తున్నారు.భారతప్రభుత్వం అన్నిరాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు బల్క్‌గా లేదా రిటైల్ గా 500 గ్రాములు, కేజీ పాకెట్లలో వారి అవసరాలకు అనుగుణంగా అందజేయనున్నట్టు తెలిపింది. రిటైల్ పాకెట్లు ప్రజాపంపిణీవ్యవస్థ కింద రిటైల్ చౌకధరల దుకాణాలలో అమ్మేందుకు ఇతరమార్కెటింగ్ రిటైల్ ఔట్‌లెట్లలోఅంటే డైరీ, హార్టికల్చర్ ఔట్‌లెట్లు, వినియోగదారుల కార్పొరేషన్ సొసైటీల వంటి వాటిలో అమ్ముకోవచ్చు.
పప్పులు,ఉల్లిపాయల ధరలలో అస్థిరతను నిలువరించేందుకు ప్రత్యేకించి వీటి వినియోగం ఎక్కువగా ఉన్నప్రాంతాలలో ధరలను అదుపుచేసేచర్యలలో భాగంగా 2015-16 సంవత్సరంలో పిఎస్ఎఫ్ కింద బఫర్‌స్టాక్‌లనుఏర్పాటు చేయడం జరిగింది. పిఎస్ఎఫ్ కింద బఫర్ స్టాక్‌లు ఏర్పాటు చేయడంలో భాగంగా ప్రస్తుత సంవత్సరంలో 20 లక్షల మెట్రిక్ టన్నులను మార్కెట్ జోక్యం కోసం ఆమోదించారు. బఫర్ స్టాక్ నుంచి పప్పుధాన్యాలను పలు ప్రజా సంక్షేమ, పౌష్టికాహాకార కార్యక్రమాలు, పిడిఎస్, మధ్యాహ్న భోజనపథకం,ఐసిడిఎస్ పథకాలకు వినియోగిస్తారు. పిఎస్ఎఫ్ బఫర్ నిల్వలు నాణ్యమైనవే కాక తక్కువ ధరకు వీటిని సకాలంలో అందుబాటులో ఉంచుతాయి. ఓపెన్ మార్కెట్ లో పప్పుల అమ్మకాలు, స రఫరాను రెగ్యులర్‌ప్రాతిపదికన పెంచడం జరుగుతుంది.
***
(Release ID: 1663481)
Visitor Counter : 146