ఆర్థిక సంఘం

కోవిడ్ -19 సంక్షోభాన్ని ఎదుర్కొనే క్రమంలో విత్తసుస్థిరత సాధన

విత్తపరమైన సవాళ్ళను ఎదుర్కొనేందుకు విధానాలు

కామన్వెల్తు ఆర్థికమంత్రుల సమావేశంలో ఎన్.కె. సింగ్ కీలక ప్రసంగం

Posted On: 07 OCT 2020 5:02PM by PIB Hyderabad

 కామన్వెల్తు  ఆర్థికమంత్రుల సమావేశం 2020లో 15వ ఫైనాన్స్  కమిషన్ చైర్మన్  చేసిన కీలక ఉపన్యాస పాఠం ఇది.  కామన్వెల్తు  ఆర్ధిక మంత్రుల సమావేశంలో కీలక ఉపన్యాసం చేసేందుకు నాకు అవకాశాన్ని, గౌరవాన్ని కల్పించిన కామన్వెల్తు  సెక్రెటరీ జనరల్ పార్టీషియా స్కాట్లాండ్ కు నా కృతజ్ఞతలు చెబుతున్నాను.  కీలక సవాళ్ళను ఎదుర్కోవడంలో సరికొత్త ఆలోచనలను,  కొత్త విధానాలను పాదుకొల్పిన ఆర్ధిక,  యువజన మరియు సుస్థిర విభాగం సీనియర్ డైరెక్టర్ ప్రొఫెసర్ రథ్ కట్టమూరికి కూడా నేను కృతజ్ఞతలు చెబుతున్నాను.  

       ప్రస్తుతం మనం అసాధారణ ఆర్ధిక విపత్తులను,  పరిస్థితులను ఎదురుకొంటున్నాం.    కామన్వెల్త్  దేశాల ఆర్ధిక సంస్థలపై కోవిడ్ మహమ్మారి ఊహకందని రీతిలో విత్తపరమైన ప్రభావాన్ని కనబరుస్తోంది.   కామన్వెల్తు  దేశాల ఆర్ధిక వ్యవస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లకు సంబంధించి,  అలాగే ఇతర అంశాల విషయంలో  విస్తృతమైన ప్రణాళికను ముందుకు తెచ్చిన బోట్స్వానా విత్త, ఆర్ధిక అభివృద్ధి శాఖ మంత్రి గౌరవనీయ  తపోలో మాట్షేక చేసిన వ్యాఖ్యలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.  కామన్వెల్తు  దేశాల కుటుంబంలో ఉన్న మనం అన్ని కీలక స్థూల ఆర్ధిక ప్రమాణాల్లో ఉన్న వైవిధ్యాన్ని గుర్తుపెట్టుకోవాలి.   ఇవన్నీ కూడా ఆర్ధిక వ్యవస్థ పరిమాణం,  తలసరి ఆదాయం,  ఆర్ధిక వ్యవస్థ వైవిధ్యం,  అలాగే స్థూల జాతీయోత్పత్తిలో అంతర్ రంగాల భాగస్వామ్యం,  అదేవిధంగా ప్రత్యేకమైన వాటిలో  పాలనా నిర్మాణాలు ఉన్నాయి.   సారా నెక్ బ్రైడ్ అన్నట్టుగా "అన్ని దేశాలకు ఉపయోగపడే ఒకేరకమైన పరిష్కారం ఉండదు.  ఒక్కో దేశం విధానం ఒక్కోలా ఉంటుంది"  అన్న వ్యాఖ్యలు ఈ సందర్భంలో అన్ని దేశాలకు వర్తిస్తాయి.  

        నేడు మనం చర్చించవలసిన అంశాలకు సంబంధించి సముచితమైన పత్రాలను రూపొందించిన కామన్వెల్తు సెక్రెటేరియట్ ను కూడా నేను అభినందిస్తున్నాను.   ఈ చర్చాపాఠంలో పేర్కొన్నట్టుగా అనేక అంశాల్లో ఎంతో వైవిధ్యం ఉంది.  ముఖ్యంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి సహా అనేక అంతర్జాతీయ సంస్థలకు సంబంధించిన విధానాల్లో ఈ వైవిధ్యం కనిపిస్తుంది.   కామన్వెల్తు  కూటమిలో ఉన్న దేశాలు రుణాలను చెల్లించలేని పరిస్థితులకు సంబంధించిన అంశాలు కూడా ఊరటను కలిగిస్తున్నాయి.   ఏ విధంగా చూసినా కూడా ప్రస్తుత పరిస్థితులు అనేక కోణాల్లో అసాధారణమైనవి.    ఈ నేపథ్యంలో "విత్తపరమైన ఒత్తిడిలో విత్తపరమైన సవాళ్ళను ఎదుర్కోవడం ఎలా?"  అన్న అంశంపై బాలిటెక్ ఇటీవల ఒక అధ్యయన పత్రంలో  చేసిన సూచనలు బడ్జెట్లకు సంబంధించి స్థూల,  ఆర్థికపరమైన మార్పుల ప్రతికూల పరిస్థితులను అవగతం చేసుకోవడానికి తోడ్పడ్డాయి.   కోవిడ్ -19  నేపథ్యంలో వెలుగు చూసిన ఈ ప్రత్యేక వ్యాసాల పరంపర ఇందుకు సంబంధించి లోతైన అవగాహన కలిగించింది.     అలాగే విత్తపరమైన విధానాల రూపకల్పన విషయంలో చారిత్రకమైన అంశాలను లోతుగా పరిశీలిస్తే వెలుగుచూసే పరిమాణాత్మక అంశాల ప్రభావాన్ని కూడా అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది.    

            21వ శతాబ్దంలో ప్రతి ఆర్ధిక వ్యవస్థ విత్తపరమైన నిర్మాణం ప్రధానంగా మూడు స్తంభాలపై అనివార్యంగా ఆధారపడి ఉంటుంది.   వాటిలో విత్తపరమైన నిబంధనల స్థంభం ఒకటైతే ,   రెండవది  ఆర్ధిక నిర్వహణ ప్రక్రియ.   ఇక మూడవది  విత్త విధానాల సంస్థలకు సంబంధించినది.    కచ్చితంగా త్వరలోనే మనం విత్త విధానాలు,   నిబంధనల మూడవ దశలోకి అడుగుపెట్టబోతున్నాం.   మొదటి దశలో విత్తలోటుకు సంబంధించిన నిబంధనలు స్థూల ఆర్ధిక సుస్థిరతను లక్ష్యంగా చేసుకున్నాయి.    దాదాపు అన్ని దేశాల్లోనూ  విత్తపరమైన బాధ్యత,   నిర్వహణపరమైన శాసనాలు,   విత్తలోటు నిబంధనలపైనే దృష్టి సారించాయి.   రెండవ దశలో భాగంగా విత్త నిర్వహణ అన్నది  సమానత్వం, సామర్ధ్యం,  పారదర్శకత అన్న సూత్రాల ఆధారంగానే ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం.   ఈ నిబంధనలను ఉప జాతీయ స్థాయిలు,  బడ్జెట్ సంస్థలు,   నిర్వహణ పద్ధతులు సహా ప్రభుత్వంలోని అన్ని స్థాయిల్లోనూ వర్తింపజేయాలి.  ప్రభుత్వ్  ఖర్చుకు సంబంధించిన నాణ్యత,   సామర్ధ్యానికి సంబంధించిన ప్రశ్న నిరంతరం ఒక సవాలుగానే కొనసాగుతుంది.   అలాగే అన్ని స్థాయిల్లోనూ  ప్రభుత్వం నుంచి విశ్వసనీయమైన డేటా లభ్యత అన్నది   కూడా ఎండమావిగానే మారింది.   ఈ కోణంలో చూస్తే ప్రభుత్వ ఖర్చుకు సంబంధించిన నాణ్యత,  సామర్ధ్యం అన్నది   అంతుబట్టని సవాళ్ళుగానే ఉన్నాయి.   కోవిడ్ -19 సంక్షోభం కారణంగా ప్రభుత్వ విత్తపరమైన అంశాలపై తలెత్తిన ప్రభావం ఖర్చుల ప్రాధాన్యతను సవరించుకోవలసిన పరిస్థితి కల్పించింది.   ఎంత త్వరగా ఆరోగ్య,  నైపుణ్య,  మౌలిక సదుపాయాలు తదితర అంశాలకు కేటాయింపులను పెంచుతూ ప్రాధాన్యత క్రమాన్ని మారుస్తారన్నది ప్రభుత్వ ఆర్ధిక నిర్వహణ విధానాల్లో వచ్చే మార్పుల ద్వారా ప్రస్ఫుటమవుతోంది.  ఈ  విధానాల్లో ప్రక్రియలు, వ్యవస్థలు ఉంటాయి.    

 ప్రస్తుతం అమలవుతున్న రెండవతరం విత్త నిబంధనలు ఇటు అవకాశాలు,  అటు విశ్వసనీయతకు సంబంధించి సమతూకాన్ని సాధించేందుకు ఒకటికి మించిన విత్త నిబంధనలను అమలు చేయాల్సిన  అవసరాన్ని చాటి చెబుతున్నాయి.   ఇందుకు సంబంధించి ఒక విత్తపరమైన వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం కనిపిస్తోంది.   అలాగే వివిధ రకాల నిబంధనల వల్ల తలెత్తే సవాళ్లు,  వివిధ అంశాల విషయంలో ఎదురవవుతున్న అసంబద్ధ పరిస్థితులు సమస్యాత్మకంగా మారుతున్నాయి.   సార్వభౌమత్వ,  ఉపజాతీయ ఇతర దేశాలకు సంబంధించిన అప్పుల వివరాలు,   అలాగే బడ్జెట్ తో నిమిత్తం లేకుండా రుణాలు తీసుకోవడం అన్నది  సమస్యాత్మకమవుతోంది.  విత్తపరమైన నిర్మాణంలో అత్యంత బలహీనమైన అంశం విశ్వసనీయ సంస్థలు లేకపోవడమే.   అలాగే విధానాలను అమలు చేసే వ్యవస్థలు స్వాభావికంగా బలహీనపడిపోయాయి.    నత్తనడక చందంగానే సాగుతున్నాయి.    అనేక దేశాలు విత్తమండలులను ఏర్పాటు చేసినా వాటికి ఏ రకంగానూ స్వయంప్రతిపత్తి లేదు.   అంతేకాకుండా నైపుణ్య రాహిత్యం,  శాసనాపరమైన మద్దతు లేకపోవడం  వీటికి ప్రతిబంధకంగా మారింది.   శాసన ప్రక్రియ ద్వారా విత్తపరమైన నిర్ణయాలను అమలుచేయడం  అంత తేలికైన వ్యవహారం కాదు  21వ శతాబ్దం విత్త నిర్మాణంలో మూడో కీలక స్థంభం అన్నది  అన్ని విశ్వసనీయ సంస్థలకు కొత్త శక్తిని కల్పించాలి.   ఈ లక్ష్యంతోనే ఈ కీలక వ్యవస్థ రూపుదిద్దుకోవాలి.     

 

ఈ రకమైన పరిస్థితులు రుణ సంఖ్యలకు సంబంధించి  వాస్తవాలను కళ్ళకు కట్టకుండా చేస్తాయి.     రెండవ తరం విత్త నిబంధనలు ప్రధానంగా పలాయనవాద  క్లాజులపైననే ఆధారపడ్డాయి లేదా నిర్మాణపరంగా లోపాలను ఉపయోగించుకునే వెసులుబాటును కల్పించుకోవడంపైనే  దృష్టిపెట్టాయి.   చాలా దేశాలు సత్వర సవరణ విధానాలను అవలంభిస్తున్నాయి.   అయితే  అయితే ఈ క్రమంలో ముందుగానే సాధారణ నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలను  ఏ విధంగా ఎదుర్కొంటారో  స్పష్టం చేయాలి.   దీనివల్ల అనివార్యంగానే మధ్యశ్రేణి విత్త విధానాలను రూపొందించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.   అయితే ప్రభుత్వ రుణాలను ప్రధాన స్థూల ఆర్ధిక అంశంగా గుర్తించడం అన్నది  విస్తృతంగా ఆమోదం పొందింది.   అయితే ఇందుకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం లేదు.
అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించని రూపొందించిన విధానాలు,  అదేవిధంగా ఆయా దేశాలకు సంబంధించిన ప్రభుత్వ రుణాలు ఏ మేరకు ఆమోదయోగ్యమన్నది కూడా స్పష్టం కావడం లేదు.   విదేశీ రుణాలు స్థూల జాతీయ ఉత్పత్తిలో 60 శాతంగా మారె ప్రమాదం ఉందని,  అలాగే వృద్ధి రేటు కూడా స్థూల జాతీయ ఉత్పత్తిలో 90 శాతం ప్రతికూలంగా మారే అవకాశం ఉందంటూ రీన్ హార్ట్ రోగోవ్ చేసిన సూచనను విస్తృత అర్ధంలో అన్వయించుకోవాల్సి ఉంటుంది.   వివిధ ఆర్ధిక వ్యవస్థల స్వభావం అన్నది  ఆయా దేశాల విధానాలకు అనుగుణంగానే ఉండాలి.   ఈ రకమైన విధానాలను అనుసరిస్తేనే రుణాకూపం నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది.    ఎక్కువ తలసరి  ఆదాయం కలిగిన దేశాలు  అదే స్థాయిలో రుణాలను కూడా కలిగి ఉంటాయి.    అయితే ఈ దేశాలు తమ దీర్ఘకాల స్థూల ఆర్ధిక సుస్థిరత విషయంలో ఎలాంటి రాజీకి తావులేకుండా కొనసాగుతున్నాయి.    

      ఈ నేపథ్యంలో నేను ప్రధానంగా ఐదు అంశాలను ప్రస్తావించబోతున్నాను.   

 

అన్నిటికన్నా ముఖ్యంగా కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో కేవలం విత్తపరమైన నైతిక వర్తననే కాకుండా విత్తపరమైన సహనశీలతను,  దానిని ఎదుర్కొనే ఆలోచనలు కలిగి ఉండాలి.   ప్రస్తుత సంక్లిష్ట సమయాల్లో మామూలు విత్తపరమైన విధానాలు ఏమాత్రం సరిపోవు.  స్పానిషుఫ్లూ ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకుంటే ప్రపంచవ్యాప్తంగా 102 సంవత్సరాల తరువాత మరో భయానక మహమ్మారి తలెత్తింది.   ఇదంతా కూడా ఐక్యరాజ్యసమితి,  ప్రపంచ బ్యాంకు,  ఐ ఎం ఎఫ్ ఏర్పాటుకు ముందు సంబంధించింది.   అంటే కోవిడ్ -19  తరహా మహమ్మారిని ఎదుర్కోవలసి రావడం అన్నది  ఈ అంతర్జాతీయ సంస్థలకు ఇదే మొదటిసారి.   ఈ విషయంలో గతానుభావాలు ఏమీ లేవు.    కాబట్టి ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితులను ఐవిధ కోణాల్లో ముఖాముఖీ ఎదుర్కోవలసిన అవసరం ఉంది.   ఈ నేపథ్యంలో విత్తపరమైన విధానాలకు సంబంధించిన నిబంధనలను రూపొందించడం ఈ అంతర్జాతీయ సంస్థల ముందున్న ప్రధాన సవాలు.     ఈ నిబంధనలు నిష్పాక్షికంగా,  సముచితంగా,  నిరంతరంగా ఉండాలి.   అలాగే ఈ నిబంధనలు ఆరోగ్యపరమైన శవాలను ఎదుర్కొనేవిగా,  వివిధ దేశాలు ఆర్హిక సంక్షోభం నుంచి  కోలుకునేవిగా ఉండాలి.     ఇదే విధంగా అంతర్జాతీయ రుణ వ్యవస్థను కూడా సంస్కరించేవిగా ఉండాలి.      

        రెండవ అంశం ఈ మహమ్మారి అనిశ్చిత స్వభావం.   ఏ రకంగా చూసినా కూడా ఆర్ధిక మంత్రులకు ఇది నిరంతర సవాలు.   ముఖ్యంగా ఆర్ధిక ఉద్దీపన ఏ మేరకు ఉండాలన్నది నిరంతరం తలెత్తే ప్రశ్న.   ఈ నేపథ్యంలో ఆర్ధిక ఉద్దీపన పరిమాణాన్ని నిర్ధారించుకోవడం అన్నది అంత తేలిక కాదు.   ఈ  మహమ్మారి స్వభావాన్ని అంచనావేయలేము కాబట్టి మొత్తం ఆర్హిక వ్యవస్థనంతా ఆక్రమించుకోవాలా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది లేక తదుపరి అవకాశాల కోసం ఈ మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చే అవకాశాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో విత్తపరమైన అవకాశాలను సమకూర్చుకోవాలా?  ఇదంతా కూడా ఈ మహమ్మారి తీవ్రతను బట్టి ఆధారపడి ఉంటుంది.  

        ఇక మూడవ అంశం ఇటు సర్వసత్తాక ప్రభుత్వాలు,   అలాగే ఆయా దేశాల ప్రధాన బ్యాంకులు తీసుకునే చర్యల మధ్య సమతూకానికి సంబంధించినది.   కోవిడ్ మహమ్మారి తీవ్రతను ఎదుర్కోవాలంటే ఇటు ప్రభుత్వ విధానాల్లోనూ,  ప్రధాన బ్యాంకుల నిర్ణయాల్లోనూ సారూప్యత ఎంతో అవసరం.  ఇవి సహకార రంగం వంటి బ్యాంకింగేతర ఆర్ధిక రంగానికి ఎంత అవసరమో ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అంతే అవసరం.    తమ రుణ ప్రక్రియను పునర్ నిర్మించుకోవాలనుకుంటున్న ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు కేంద్ర బ్యాంకర్ల సలహాలు, మార్గనిర్దేశన ఎంతో అవసరం.   ఈ సవాళ్ళను ఎదుర్కోవడానికి అందుబాటులో ఎలాంటి విధానాలు ఉండవు.   పరిస్థితులనుబట్టి నిరంతర ప్రాతిపదికగా విధానాలను రూపొందించుకుంటూ ఉండాలి.   

  నాల్గవ అంశం విత్తపరమైన సవాళ్లకు సంబంధించినది. ఈ సవాళ్ళను ఎదుర్కోవడం లేదా తట్టుకునేలా విధానాలు వుండాలని చెప్పడం చాలా తేలిక.   అలాగే కొన్ని రకాల అంశాల నుంచి తప్పుకోవాలన్న వాదన వినిపిస్తోంది.    అయితే కోవిడ్ మహమ్మారి  తీవ్రత తగ్గిన క్షణం నుంచి మళ్ళీ ఆర్ధిక వ్యవస్థలు పుంజుకోవడం అన్నది అత్యంత కీలక అంశం.     విత్తపరమైన సవాళ్ళను ఎదుర్కొన్న తరువాత  విత్తపరమైన నిజాయితీని,  నైతికతను ప్రదర్శించడం అన్నది  ఈ  విధానాలకు ఎంతో కీలకం. మళ్ళీ ప్రవేశించడం కంటే బయటికి వెళ్ళటం చాలా తేలిక.    విత్తపరమైన సవాళ్ళను తట్టుకునే విధానాల తర్వాత విత్త నైతికత అనివార్యంగా ఉండాలి.   అయితే కోవిడ్ మహమ్మారి తీవ్రత తగ్గుతూ ఉందని,  ఆయా దేశాలు ఏ అంశాల ప్రాతిపదికగా నిర్ధారణకు వస్తాయి అన్నది చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో స్థూల ఆర్ధిక సుస్థిరత స్వరూప స్వభావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.   విత్త మండలి,  అమలు యంత్రాంగాల నిర్మాణం  విశ్వసనీయంగా,  స్వతంత్ర రీతిలో పనిచేసేవిగా ఉండాలి.   ఈ రకమైన అంశాలు ఈ వ్యవస్థలో అంతర్భాగం కావాలి.  
  విత్త నిబంధనలు,  సవాళ్లకు సంబంధించిన నీవందనాలను ఏ విధంగా రూపొందించుకోవాలన్న దానిపై అంతర్జాతీయంగా ఏకాభిప్రాయ సాధన అన్నది చాలా కీలకమైన అంశం.   ఈ రకమైన ఏకాభిప్రాయాన్ని సాధించడానికి  తగిన సంస్థ లేదన్నది  మరో కీలక అంశం.  ఈ విషయంలో  కామన్వెల్త్  సెక్రెటేరియట్ నేపధ్య పత్రాలు ఎంతో విలువైన సమాచారాన్ని అందించాయి.  "కామన్వెల్త్ వ్వవస్థ ఐక్యరాజ్య సమితి కాకపోయినా అనేక కోణాల్లో సంక్షిప్త స్వరూపంలో ప్రపంచ వ్యవస్థను ఇది ప్రతిబింబిస్తోంది.   ఇందులోను సభ్య దేశాల మధ్య బలమైన చారిత్రక నేపధ్యం ఉంది.   విభిన్న భాషలు,  విలువలను ప్రతిబింబిస్తున్నాయి.   ఈ నేపథ్యంలో ఈ అంతర్జాతీయ ఒప్పంద సాధనకు ఈ దేశాలు సరైన అవకాశాలను కల్పిస్తాయి"  అంటూ కామన్వెల్త్ సెక్రెటేరియేట్ నేపధ్య పత్రం సరైన వ్యాఖ్యలే చేసింది.     ఈ ఆర్హిక మంత్రుల ఫోరమ్ సమావేశంలో జరిగే చర్చలతో పాటు   ఇంతకుముందు కూడా చర్చలు జరిగాయి.   ఈ అంశాలను రానున్న జి-20  సమావేశాల్లో తెలియజేయాల్సి ఉంటుంది.     అలాగే ప్రస్తుతం  జరుగుతున్న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ,  అలాగే ఐక్యరాజ్య సమితి ఆర్ధిక సామాజిక మండలి  (ఈసిఓఎన్ ఓసి)  సదస్సులు కూడా ఈ ప్రాధాన్యతను ఇవ్వాలి.  అలాగే ఈ నెల 12న జరుగనున్న అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాల్లో ఈ అంశం కీలకం కావాలి.  

ఈ నేపథ్యంలో కామన్వెల్త్  దేశాల ఆర్ధిక మంత్రులు తమ వంతు చేయూతను అందించాలి.   ముఖ్యంగా ప్రపంచ వ్యవస్థలు తీసుకునే నిర్ణయాల విషయంలో తమ వంతు సూచనలు అందించాలి.   ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి తరహా విపత్తుకు ముందు   పరిస్థితుల్లో రూపొందించిన విధానాలను తదనుగుణంగా సవరించుకోవాల్సి ఉండుండి.   ముఖ్యంగా రుణ పరిమితులు,  విత్తపరమైన విధానాలు,  సవాళ్లపై దృష్టిపెట్టాలి.   ఈ అంశాలపై ఏకాభిప్రాయం   అన్నది సర్వసత్తాక దేశాలకే కాకుండా మార్కెట్లు,  ప్రైవేటు సంస్థలు,  ఆయా దేశాల ఆర్ధిక కార్యకలాపాలను తమ సర్వేల ద్వారా ప్రభావితం చేసే రేటింగ్ ఏజెన్సీలకు చాలా కీలకం.  ముఖ్యంగా విత్తపరమైన అంశాలను ఏవిధంగా రూపొందించుకోవాలి,  ఇటు జీవనోపాధిని పెంపొందించుకుంటూ ఆర్ధిక వ్యవస్థలను ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి?  
అన్నది అత్యంత సంక్లిష్టమైన సవాలు.   లాక్ డౌన్ అనంతర కాలంలో మొదలైన ఆన్ లాక్ డౌన్ పరిస్థితుల్లో అనుసరించాల్సిన విత్తపరమైన విధానం,  అలాగే సవాళ్ళను ఎదుర్కోగల శక్తి కూడా కీలకమైనదే.  

       విత్త నిర్వహణ,   సవాళ్ళను ఎదుర్కోవడం అనే అంశంపై ప్రాధాన్యతా పూర్వకంగా మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు.   కోవిడ్ -19 మహమ్మారి మామూలు విపత్తు కాదు.   దీని ప్రభావం వల్ల ఆర్ధిక,  సామాజిక తీరుతెన్నుల్లోనే ఎన్నో మార్పులు వచ్చేశాయి.    కొత్తగా తలెత్తే పరిస్థితులు గతానికి పూర్తి భిన్నంగా ఉంటాయి.    అందుకే  ఆర్. బక్ మినిస్టర్ క్యూలెర్ ఇలా అన్నారు.  " ఉన్న వాస్తవాలను ప్రతిఘటించడం ద్వారా మీరు మార్పు తీసుకురాలేరు. నిజమైన మార్పు రావాలంటే ప్రస్తుత నమూనా ఎందుకూ పనికి రాదన్నట్టుగా కొత్త నమూనా నిర్మించుకోవాలి".  

****



(Release ID: 1663371) Visitor Counter : 206


Read this release in: English , Urdu , Hindi , Tamil