కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

ఇ.పి.ఎఫ్.ఓ. యొక్క మినహాయింపు పొందిన సంస్థల కోసం భారీగా బదిలీ చేసే సదుపాయాన్ని ప్రారంభించిన - కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి శ్రీ అపుర్వ

Posted On: 09 OCT 2020 7:21PM by PIB Hyderabad

ఇ.పి.ఎఫ్.ఓ. యొక్క మినహాయింపు పొందిన సంస్థల నుండి నిధులను మరియు డేటాను ఒకే సారి భారీగా బదిలీ చేసే కొత్త సదుపాయాన్ని, (కార్మిక & ఉపాధి) కార్యదర్శి, శ్రీ అపుర్వ చంద్ర, ఐ.ఎ.ఎస్., 2020 అక్టోబర్ 7వ తేదీన ఈ.పి.ఎఫ్.ఓ. ప్రధాన కార్యాలయాలకు తన మొదటి సందర్శనలో ప్రారంభించారు. మినహాయింపు పొందిన సంస్థలకు నిధుల బదిలీ వేగాన్ని పెంచడం ద్వారా వ్యాపారం చేసే సౌలభ్యాన్ని, ఈ సౌకర్యం పెంపొందిస్తుంది. 

మినహాయింపు పొందిన సంస్థల నుండి ఒకే చెల్లింపు ద్వారా ఈ.పి.ఎఫ్.ఓ. కి నిధులను బదిలీ చేయడానికి ఈ.పి.ఎఫ్.ఓ. ఇప్పుడు కార్యాచరణను విడుదల చేసింది.  మినహాయింపు పొందిన సంస్థలు ఈ.పి.ఎఫ్. మరియు ఎం.పి. చట్టం-1952 లోని సెక్షన్ 17 కింద మినహాయింపు పొందిన సంస్థలు మరియు ఈ.పి.ఎఫ్. ఓ. యొక్క సంపూర్ణ పర్యవేక్షణలో సభ్యుల భవిష్యనిధిని నిర్వహిస్తాయి.  ఒక సభ్యుని ఉద్యోగం, ఒక మినహాయింపు సంస్థ నుండి మరొక మినహాయింపు లేని సంస్థకు మారినప్పుడు, ఆ సభ్యుని ఖాతాలో అంతవరకూ జమ అయిన పూర్తి మొత్తాన్ని ఈ.పి.ఎఫ్.ఓ. కి బదిలీ చేయడం జరుగుతుంది. 

మినహాయింపు పొందిన సంస్థలు, ఇప్పటి వరకు, ప్రతి సభ్యునికి చెందిన నిధులను ఒక్కొక్కటిగా ఆమోదించి, బదిలీ చేయవలసి ఉండేది.  ప్రతిరోజూ చాలా మంది ఉద్యోగుల నిధులను బదిలీ చేయాల్సిన పెద్ద, పెద్ద సంస్థలకు, ఈ ప్రక్రియ నిర్వహించడం, చాలా గజిబిజిగా ఉండడంతో పాటు చాలా ఎక్కువ సమయం పట్టేది.  కొత్త సదుపాయం కింద, మినహాయింపు పొందిన సంస్థలు ఒకే చెల్లింపు ద్వారా భారీ డేటాను ఒకే సారి పొందుపరచడానికీ, పెద్ద సంఖ్యలో సభ్యుల నిధులను బదిలీ చేయడానికీ అవకాశం ఉంటుంది.  ఈ చర్య వల్ల ఈ.పి.ఎఫ్.ఓ. కు చెందిన 1500 మినహాయింపు సంస్థలకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు.

ఈ.పి.ఎఫ్.ఓ. మరియు మినహాయింపు పొందిన సంస్థల మధ్య అన్ని లావాదేవీలు ఇప్పటికే ఎలక్ట్రానిక్ పద్దతికి మార్చడం జరిగింది. తద్వారా నిధుల బదిలీల్లో ఆలస్యంతో పాటు ఇతర సమస్యలను అధిగమించడానికి అవకాశం ఉంటుంది.   ఒకవేళ ఒక సభ్యుడు తన ఉద్యోగాన్ని మినహాయింపు సంస్థ నుండి మినహాయింపు పొందిన సంస్థకు మార్చినట్లయితే, మినహాయింపు పొందిన సంస్థ యొక్క బ్యాంకు ఖాతాలోని నిధులను ఈ.పి.ఎఫ్.ఓ. ఎలక్ట్రానిక్ పద్దతిలో బదిలీ చేస్తుంది.  లావాదేవీల వివరాలు సంస్థ యొక్క లాగిన్ ‌లో అందుబాటులో ఉంచబడతాయి. మినహాయింపు సంస్థ ద్వారా నిర్వహించబడే సభ్యుని ఖాతాలో నిధులను వేగంగా జమచేయడానికి ఈ విధానం సహకరిస్తుంది. 

మినహాయింపు పొందిన సంస్థలకు, పింఛను నిధి చందాలను ఎలక్ట్రానిక్ పద్దతిలో పంపించటానికి వారి నెలవారీ రిటర్న్స్ మరియు ఎలక్ట్రానిక్ చలాన్-కమ్-రిటర్న్ (ఈ.సి.ఆర్. ‌లు) ను దాఖలు చేసే సదుపాయం ఇప్పటికే కల్పించబడింది.  తద్వారా ఇబ్బంది లేని పద్ధతిలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. 

కార్యదర్శి (కార్మిక & ఉపాధి) తన ఈ.పి.ఎఫ్.‌ఓ. కేంద్ర కార్యాలయ సందర్శనలో భాగంగా, ఉమాంగ్ యాప్ ద్వారా 1995 ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ కింద స్కీమ్ సర్టిఫికేట్ పొందటానికి దరఖాస్తు చేసుకునే సౌకార్యాన్ని కూడా ప్రారంభించారు.  ఈ.పి.ఎఫ్. చందాలను ఉపసంహరించుకుని, ఈ.పి.ఎఫ్.ఓ. సభ్యత్వాన్ని నిలుపుకోవాలనుకునే సభ్యులకు, పదవీ విరమణ వయస్సు సాధించిన తరువాత పెన్షన్ ప్రయోజనాలను పొందటానికి వీలుగా వారికి స్కీమ్ సర్టిఫికేట్ జారీ చేయబడుతుంది.

ఉమాంగ్ యాప్ ద్వారా స్కీమ్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఇప్పుడు సభ్యులు వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోవడంలో అనవసరమైన కష్టాలను, ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి కాలంలో నివారించడానికి సహాయపడుతుంది.  ఈ సౌకర్యం ద్వారా 5.89 కోట్లకు పైగా వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుంది. 

శ్రీ అపుర్వ చంద్ర 2020 అక్టోబర్, 1వ తేదీన కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఈ.పి.ఎఫ్.ఓ. సందర్శనకు వచ్చిన సందర్భంగా, ఆయనకు,  కేంద్ర భవిష్యనిధి కమీషనర్ శ్రీ సునీల్ బార్త్వాల్, ఐ.ఏ.ఎస్. తో పాటు ఈ.పి.ఎఫ్.ఓ. కు చెందిన ఇతర సీనియర్ అధికారులు స్వాగతం పలికారు. "నిర్బాద్" అంటే మహమ్మారి కాలంలో చందాదారులకు ఎటువంటి ఇబ్బందులు మరియు అంతరాయం లేని సేవలను అందించడాన్ని నిర్ధారించడానికి, ఈ.పి.ఎఫ్.‌ఓ. చేపట్టిన ప్రధాన కార్యక్రమాల గురించి కార్యదర్శి (కార్మిక & ఉపాధి) అడిగి తెలుసుకున్నారు. 

*****


(Release ID: 1663329) Visitor Counter : 162


Read this release in: English , Urdu , Hindi , Tamil