యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

క్రీడాకారులకు శిక్షణనిచ్చే ఈత కొలనులను తెరవడంపై ప్రామాణిక కార్యాచరణ విధానం

Posted On: 09 OCT 2020 7:57PM by PIB Hyderabad

కంటైన్‌మెంట్‌ జోన్ల వెలుపల ఉన్న, క్రీడాకారులకు శిక్షణనిచ్చే ఈతకొలనులను ఈనెల 15వ తేదీ నుంచి తెరవడానికి అనుమతినిస్తూ గతనెల 30వ తేదీన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.  దీనికి అనుగుణంగా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రామాణిక కార్యాచరణ విధానం (ఎస్ఓపీ) జారీ చేయాల్సి ఉంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, ఆరోగ్యం&కుటుంబ సంక్షేమ శాఖను సంప్రదించిన యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ.. ఎస్‌ఓపీని రూపొందించింది. 

    మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ (https://yas.nic.in/)లో ఎస్‌ఓపీని చూడవచ్చు.

***
 


(Release ID: 1663295) Visitor Counter : 91