జల శక్తి మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా ఇంటింటికీ త్రాగునీరు అందించటానికి ఉద్దేశించిన ఘర్ జల్ పూర్తి చేసిన రాష్ట్రంగా గోవా మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన గోవా

త్రాగు నీరందించటం కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యం: కేంద్రమంత్రి షెకావత్

Posted On: 09 OCT 2020 6:51PM by PIB Hyderabad

 

దేశంలో ఇంటింటికీ త్రాగునీరు అందించిన మొదటి రాష్ట్రంగా గోవా తన ప్రత్యేకత చాటుకుంది. దాదాపు 12.30 లక్షల ఇళ్ళకు పైపులు ద్వారా త్రాగు నీరందించే పథకాన్ని విజయవంతంగా అమలు చేసింది. జల్ జీవన్ మిషన్ వలన కలిగే  లాభాలను ఇంటింటికీ తీసుకువెళుతూ గ్రామీణ ప్రాంతాల్లో జీవితం సుఖమయం చేయటానికి ఇది ఉపయోగపడిందని గోవా ముఖ్యమంత్రి శ్రీ ప్రమోద్ సావంత్ అన్నారు. అంకిత భావంతో కూడిన కృషి తగిన ఫలితాల నిచ్చింది.

2020 జూన్ లో కేంద్ర జలశక్తి శాఖామంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గోవా ముఖ్యమంత్రికి లేఖ రాస్తూ, రాష్ట్ర వార్షిక కార్యాచరణ కింద గ్రామీణ ప్రాంతాల్లో 100శాతం ఇళ్ళకు నీటి కనెక్షన్లు ఇవ్వటాన్ని అభినందించారు. ఈ పథకానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు అందుకు అనుగుణంగానే గోవాకు 2020-21 సంవత్సరానికి  గాను నిధుల కేటాయింపును రూ.12.49 కోట్లకు పెంచామన్నారు. వివిధ కేంద్ర ప్రభుత్వాల పథకాలను సమీకృతం చేయటం ద్వారా లబ్ధి పొందవచ్చునని సూచించారు. గ్రామీణ ఉపాధి హామీ, 15వ ఆర్థిక సంఘం నిధులు, జిల్లా ఖనిజాభివృద్ధి సంస్థ నిధి, సి ఎస్ ఆర్ నిధులు స్థానిక ప్రాంత అభివృద్ధి నిధి తదితరాలు కలుపుకోవటం ద్వారా లబ్ధిపొందాలన్నారు. దీనివలన త్రాగునీటి వనరులను పటిష్టం చేయవచ్చునన్నారు.

గోవా, ఉత్తర గోవా జిల్లాల్లోని  1.65 లక్షల గ్రామీణ ఇళ్ళు . దక్షిణ గోవా జిల్లాలోని 98,000 గ్రామీణ ఇళ్ళు  191 గ్రామ పంచాయితీలకు చెందినవి కాగా వాటన్నిటికీ పంపుల ద్వారా నీటి సరఫరా జరుగుతుంది. నీటి పరీక్షల సౌకర్యాలను పెంచటం కోసం ఎన్ ఎ బి ఎల్ అక్రెడిటేషన్ పొందిన  ప్రభుత్వం 14 నీటి పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేసే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. జల్ జీవన్ మిషన్ కింద ప్రత్రి గ్రామానికీ ఐదుగురు వ్యక్తులు, ముఖ్యంగా మహిళలు శిక్షణ పొంది ఉండటం తప్పనిసరి అన్నారు. క్షేట్ర స్థాయి పరీక్షాకిట్ల సాయంతో వారే పరీక్షలు జరుపుతారని మంత్రి చెప్పారు.

గోవా సాధించిన విజయం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటుందని పేర్కొంటూ  ఆ విధంగా ప్రతి ఇంటికీ త్రాగు నీరందించే లక్ష్యం త్వరలోనే అమలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంటింటికీ పైపుల ద్వారా నీరు అనే  నిశ్శబ్ద విప్లవం భారత గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న మార్పుకు నిదర్శనమని ఆయన అభివర్ణించారు. ఇది నవభారత్ పురోగతిలో భాగమన్నారు.

ఈ విధంగా అందరికీ త్రాగునీటిని అందించటంలో విజయం సాధిమ్చిన మీదట గోవా రాష్టం సెన్సార్ ఆధారిత మానిటరింగ్ వ్యవస్థను రూపొందిస్తున్నదని, దీనివలన నీటి సరఫరా తీరుతెన్నులు తగినంతగా అందుతున్నదీ లేనిదీ పర్యవేక్షించటానికి, నీటి నాణ్యతను పరీక్షించటానికి ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఇంటికీ క్రనం తప్పకుండా దీర్ఘకాల ప్రాతిపదికన అందటాన్ని ధ్రువీకరించుకోవచ్చునన్నారు.

*****

 


(Release ID: 1663293) Visitor Counter : 239