ఆర్థిక మంత్రిత్వ శాఖ

న‌కిలీ ప‌త్రాల‌తో క‌ల్పిత సంస్థ‌ల‌ను సృష్టించి 190 కోట్ల రూపాయ‌ల మేర న‌కిలీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ను పాస్ చేస్తున్న ఒక వ్య‌క్తిని డిజిజిఐ గురుగామ్ జోన‌ల్ విభాగం అరెస్టుచేసింది.

Posted On: 09 OCT 2020 5:32PM by PIB Hyderabad

హ‌ర్యానాలోని గురుగ్రామ్ జోన‌ల్‌యూనిట్ (జిజెడ్ యు) జిఎస్‌టి ఇంటెలిజెన్స్ డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ ,న్యూఢిల్లీకి చెందిన షంషాద్‌ష‌ఫి అనే వ్య‌క్తిని అరెస్టు చేశారు. ఫోర్జ‌రీ ప‌త్రాల ఆధారంగా కృత్రిమ సంస్థ‌ల‌ను స్థాపించి ఎలాంటి వాస్త‌వ ర‌సీదులు, లేదా స‌ర‌కు స‌ర‌ఫ‌రా, సేవ‌లు అందించ‌డం వంటివి ఏవీ లేకుండా , న‌కిలీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌కు సంబంధించి ఇన్‌వాయిస్‌లు జారీచేస్తుండ‌గా అత‌నిని అరెస్టు చేశారు.

ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిపిన ద‌ర్యాప్తు ప్ర‌కారం,ఎం.డి .ష‌ఫి, మెస్స‌ర్స్ టెక్నో ఎల‌క్ట్రిక‌ల్ , మెస్స‌ర్స్ ల‌త సేల్స్ పేరుతో రెండు సంస్థ‌ల‌ను బోగ‌స్‌, ఫోర్జ‌రీ ప‌త్రాల ఆధారంగా న్యూఢిల్లీలో ఏర్పాటు చేశాడు. ఇందులో పేర్కోన్న పేర్లుగ‌ల వారు ఆయా చిరునామాల‌లో ఎవ‌రూ లేరు. సంస్థ‌ల విష‌యంలోనూ అదే ప‌రిస్థితి. ఇక మెస్స‌ర్స్ టెక్నో సంస్థ మోసపూరితంగా ఐటిసిని 98.09 కోట్ల రూపాయ‌ల‌మేర మెస్స‌ర్స్ ల‌త సేల్స్  సంస్థ‌కు జారీ చేసింది. ఆ సంస్థ మ‌రి కొన్ని ఎక్క‌డా లేని సంస్థ‌ల‌కు 69.59 కోట్ల రూపాట న‌కిలీ ఐటిసిని సృష్టించింది.

ఎం. షంషాద్ ష‌ఫి మ‌రో నాలుగు ఎక్క‌డా లేని  సంస్థ‌ల‌నుకాగితాల‌పై సృష్టించాడు. అవి ఢిల్లీ చిరునామాతో  మెస్స‌ర్స్ గెలాక్సీ ఎంట‌ర్ ప్రైజెస్,మెస్స‌ర్స్ మూన్ ,మెస్స‌ర్స్ సిద్దార్థ ఎంట‌ర్‌ప్రైజెస్‌, మెస్స‌ర్స్ స‌న్ ఎంట‌ర్ ప్రైజెస్ . పైన పేర్కొన్న సంస్థ‌ల‌న్నీ   ఎలాంటి స‌ర‌కుల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌కుండానే కేవ‌లం ఇన్‌వాయిస్‌ల‌ను స‌ర‌ఫ‌రా చేసిన‌ట్టు గుర్తించారు.
ఇందుకు సంబంధించి ద‌ర్యాప్తును ఢిల్లీలోని ప‌లు ప్రాంతాల‌లో జ‌రిపారు. ఇందుకు సంబంధించి డాక్యుమెంట‌రీ సాక్ష్యాల ఆధారాంగా  స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. దాని ప్ర‌కారం ఎం.డి ష‌ఫి  న‌కిలీ సంస్థ‌ల‌ను ఫోర్జరీ ప‌త్రాల‌తో సృష్టించి ఈ రాకెట్ న‌డిపిన‌ట్టు తేలింది. ఫ‌లితంగా ఎం.డి.ష‌విని ఈరోజు అరెస్టుచేసి గురుగ్రామ్ అడిష‌న‌ల్ సి.జె.ఎం  ఎదుట హాజ‌రుప‌రిచారు. కోర్టు అత‌నిని జుడిషియ‌ల్ క స్ట‌డీకి ఆదేశించింది.నిందితుడు సుమార్‌190 కోట్ల రూపాయ‌లపైబ‌డిన న‌కిలీ ఐటిసిని పాస్ చేసిన‌ట్టు తేలింది.
ఈ విష‌యంలో త‌దుప‌రి ద‌ర్యాప్తు పురోగ‌తిలోఉంది.

***


(Release ID: 1663283) Visitor Counter : 128


Read this release in: English , Urdu , Hindi , Tamil