రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
కోవిడ్ నేపథ్యంలోనూ ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో 60 శాతం ఎక్కువ ప్రాజెక్టులను ప్రదానం చేసిన ఎన్‌హెచ్ఏఐ
- ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో రూ.47,289 కోట్ల విలువైన దాదాపు 1330 కిలోమీటర్ల నిడివి గల ప్రాజెక్టుల అవార్డు
- గత మూడేండ్లలో తొలి ఆరు నెలల కాలంతో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో ప్రదానం చేసిన ప్రాజెక్టుల పొడవు అత్యధికం
Posted On:
07 OCT 2020 7:24PM by PIB Hyderabad
రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ).. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1,330 కిలోమీటర్ల నిడివి కలిగిన ప్రాజెక్టులను ప్రదానం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో ఇప్పటి వరకు ఇచ్చిన ప్రాజెక్టులు 2019- 20 ఆర్థిక సంవత్సరంలో ప్రదానం చేసిన 828 కి.మీ. కంటే 1.6 రెట్లు అధికం. ఇదే సమయంలో 2018-19 ఆర్థిక సంవత్సరంలో ప్రదానం చేసిన 373 కి.మీ. కంటే 3.5 రెట్లు అధికమని అథారిటీ నివేదించింది. ప్రదానం చేసిన ప్రాజెక్టుల కోసం, ఎన్‌హెచ్‌ఏఐ ఇప్పటికే కనీసం 80 నుంచి 90 శాతం భూసేకరణను పూర్తి చేసింది. యుటిలిటీస్ షిఫ్టింగ్‌ను మరియు వివిధ అటవీ పర్యావరణ అధికారుల నుండి అవసరమైన అనుమతులను పొందింది. ఎన్‌హెచ్ఏఐ ప్రకటన ప్రకారం, 2020 ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు, 1330 కిలోమీటర్ల పొడవుతో మొత్తం 40 ప్రాజెక్టులను ప్రాధికారిక సంస్థ అవార్డ్ చేసింది. ఈ 40 ప్రాజెక్టుల మూలధనపు వ్యయం రూ.47,289 కోట్లు. ఇందులో నిర్మాణపు పనుల ఖర్చు, భూసేకరణ మరియు ఇతర నిర్మాణానికి గాను పూర్వకార్యకలాపాలు కూడా కలిసి ఉన్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4500 కిలోమీటర్ల ప్రాజెక్టులను ప్రదానం చేయాలనే లక్ష్యాన్ని ఎన్‌హెచ్‌ఏఐ నిర్దేశించింది. ప్రాధికారిక సంస్థ ఈ లక్ష్యాన్ని అధిగమించే అవకాశం ఉంది. వ్యాపారం యొక్క సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి మరియు దాని వాటాదారులందరితో మెరుగైన పని సంబంధాన్ని సులభతరం చేయడానికి ఎన్‌హెచ్ఏఐ కట్టుబడి ఉంది. జాతీయ రహదారులను మెరుగుపరిచేందుకు గాను వివిధ పరిశ్రమల సంస్థలు చేసిన వివిధ సూచనలను అమలు చేయడానికి గాను ఇటీవల ఎన్‌హెచ్ఏఐ అంగీకరించింది. రహదారి రంగంలో బిడ్డర్లలో విశ్వాసం కలిగించడానికి గాను ఎన్‌హెచ్‌ఏఐ సంస్థ ఎప్పటికప్పుడు వివిధ కార్యక్రమాల్ని చేపట్టింది. ఈ ఏడాది మార్చిలో ఎన్‌హెచ్ఏఐ సంస్థ రూ.10,000 కోట్ల మేర ఆన్‌లైన్ చెల్లింపులు జరిపింది. లాక్‌డౌన్ వేళ కార్యాలయం మూసివేయడం వలన ఎటువంటి చెల్లింపులు పెండింగ్‌లో లేవని నిర్ధారించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఎన్‌హెచ్‌ఏఐ సంస్థ రూ.15 వేల కోట్ల మేర
సొమ్ము చెల్లింపుల్ని జరిపింది. అదనంగా కాంట్రాక్టర్లకు తగిన నగదు ప్రవాహాన్ని నిర్ధారించడానికి కాంట్రాక్టర్లకు నెలవారీ చెల్లింపులు జరపడం లాంటి చర్యలు తీసుకున్నారు. ఇలాంటి వివిధ సరళీకరణలు రహదారి రంగం వృద్ధిపై మాత్రమే కాకుండా, దేశ నిర్మాణంలో మరియు భారతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి.
***
(Release ID: 1662621)
Visitor Counter : 185