సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

జమ్ము కాశ్మీర్, కథువా జిల్లాలో సరిహద్దు రైతులతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ భేటీ

Posted On: 03 OCT 2020 7:23PM by PIB Hyderabad

   కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ 2020, అక్టోబరు 3న జమ్ము కాశ్మీర్ లోని కథువా జిల్లాలో సరిహద్దు ప్రాంతపు రైతులతో ముచ్చటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకువచ్చిన వ్యవసాయ సంస్కరణల ప్రయోజనాలపై మంత్రి వారితో చర్చించారు.

  ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ,..దళారులు పంటలను స్వాధీనం చేసుకుని పంటల విక్రయానికి ఏర్పాట్లు చేసే సంప్రదాయం రెండు దశాబ్దాల కిందటివరకూ సాగేదని, ఈ రోజు రైతు యువకుడు, విద్యావంతుడు, విషయాలు తెలిసినవాడని, పలు అవకాశాలు, మార్గాలతో అనుసంధామై ఉన్నాడని, పంటల కొనుగోలు దారుడిని తనంతటతానే ఎంపిక చేసుకునే సామర్థ్యం రైతుకు ఉందని అన్నారు.

 

   ఈ నాటి రైతు, వాస్తవానికి వ్యవసాయ సాంకేతిక నిపుణుడని, రాబోయే సీజన్ లో ఏ పంట వేస్తే తనకు ఎక్కువ లాభదాయకమనే విషయాన్ని కంప్యూటర్ ముందు కూర్చుని నిర్ణయించుకోగలుగుతున్నాడని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. అంతేకాక, దేశంలో ఎవరికి విక్రయిస్తే తన ఉత్పత్తికి లాభదాయకమైన ధర లభిస్తుందన్నది కూడా అతను ఆన్ లైన్ ద్వారా తెలుసుకోగలుగుతున్నాడన్నారు.

   ఇతర రంగాల సాంకేతిక పరిజ్ఞాన నిపుణలకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తగ్గకుండా, యువ వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞాన నిపుణులకు కూడా  సమాన అవకాశాలు కల్పించక తప్పదని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేశంలోని వ్యవసాయరంగంలో ఏర్పడిన భారీ అంతరాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పూడ్చివేశారన్నారు.

  బడా వ్యాపార సంస్థలు వ్యవసాయాన్ని స్వాధీనంచేసుకుంటారని, రైతుల భూమిని బలవంతంగా చేజిక్కించుకుంటారని వెలవడుతున్న అనుమానాలు, భయాందోళలు అర్థరహితమని ఆయన కొట్టి పారేశారు. ఇలాంటి పరిణామాల నియంత్రణకు తగిన రక్షణ చర్యలను కొత్త చట్టంలో పొందుపరిచామన్నారు. వ్యవసాయంతో ఏ మాత్రం సంబంధంలేని వృత్తిపరమైన నిరసన కారులే ఇలాంటి భయాందోళలను, రభసను సృష్టిస్తున్నారని అన్నారు.

  రైతులతో కేంద్రమంత్రి భేటీని కథువా జిల్లా బి.జె.పి. అధ్యక్షుడు రఘునందన్ సింగ్ ఏర్పాటు చేశారు. రైతులు,..సుభాష్ సింగ్, నర్ సింగ్, దిల్బాగ్ సింగ్,.. సర్పంచ్ లు, విక్రమ్ సింగ్, దివాన్ సింగ్, బంటూ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. స్థానిక కార్యకర్తలైన వికీ శర్మ, సీమా, ఝండా సింగ్ కూడా తమ అభిప్రాయాలను కేంద్రమంత్రికి తెలియజేశారు.

<><><><><>




(Release ID: 1661487) Visitor Counter : 95