రక్షణ మంత్రిత్వ శాఖ
మాజీసైనికులకు నాణ్యమైన వైద్యం అందించేందుకు భారత సైన్యం కట్టుబడి ఉంది.
Posted On:
01 OCT 2020 6:46PM by PIB Hyderabad
ప్రస్తుత కోవిడ్ మహమ్మారి సమయంలో వైద్య వనరులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అయితే మాజీ సైనికులకు నాణ్యమైన వైద్యచికిత్సను అందించేందుకు భారత సైన్యం కట్టుబడి ఉంది. దేశవ్యాప్తంగా ఎంతో మంది మాజీ సైనికులు , వారి కుటుంబాల వారు సర్వీస్ ఆస్పత్రులలో చికిత్పపొందుతున్నారు.
సర్వీస్ ఆస్పత్రిలో చికిత్సకు అర్హత గల ఏ ఇసిహెచ్ఎస్ సభ్యుడినీ, ఇసిహెచ్ఎస్ పాలీ క్లినిక్ రెఫర్ చేసిన తర్వాత ఆస్పత్రిలో చేర్చుకోకుండా ఉండకూడదు. నమోదిత ఆస్పత్రులు ఇసిహెచ్ఎస్ సభ్యులను చేర్చుకోవడానికి నిరాకరించిన సందర్భంలో అలాంటి వారిని సర్వీస్ ఆస్పత్రిలో చేర్చుకుంటారు.
కోవిడ్ -19 పరీక్ష ఫలితం వచ్చే వరకు అత్యవసర పరీక్షలు నిర్వహించడంలో, ప్రాణరక్షణ చికిత్స అందించడంలో ఎలాంటి జాప్యం ఉండడానికి వీలులేకుండా చూస్తారు. దీనికి తోడు కార్డియాలజీ,ఆర్థోపెడిక్ కేసులను సర్వీస్ ఆస్పత్రులతోపాటు నమోదిత ఆస్పత్రులకు రెఫర్‌చేస్తారు (కోవిడ్ కాలంలో)
నమోదిత ఆస్పత్రి ఏదైనా పేషెంట్‌ను చేర్చుకోనట్టయితే దానిని ఒఐసి పాలిక్లినిక్‌లకు , ప్రాంతీయ కేంద్రాలకు తెలియజేయాలి. ఢిల్లీలోని ఇసిహెచ్ఎస్ సభ్యులు జాయింట్ డైరక్టర్ (హెచ్.ఎస్) రీజనల్ సెంటర్ -2 (8342092824) ను సంప్రదించవచ్చు..
***
(Release ID: 1660854)
Visitor Counter : 136