ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఈ-ఇన్వాయిస్ అమలులో జీఎస్టీ పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం

Posted On: 30 SEP 2020 10:45PM by PIB Hyderabad

ఏదైనా ఆర్థిక సంవత్సరంలో మొత్తం వార్షిక టర్నోవర్ రూ. 100 కోట్లకు పైగా ఉన్న జిఎస్‌టి పన్ను చెల్లింపుదారులు అన్ని బిజినెస్ టు బిజినెస్ (బి 2 బి) సరఫరా కోసం ఈ-ఇన్వాయిస్ జారీ చేయవలసి ఉంటుందని ప్రభుత్వం 2019 డిసెంబర్‌లో సూచించింది. సిజిఎస్టి నిబంధన 48 (4), 2017లో పేర్కొన్న మాదిరీ 2020 ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలులోకి వచ్చేలా ఈ-ఇన్వాయిస్ జారీ చేయాల్సి ఉంటుంది. ఇంకా, సిజిఎస్టి నిబంధనలు, 2017 లోని 48 (5) నిబంధన ప్రకారం, అటువంటి పన్ను చెల్లింపుదారుడు జారీ చేసిన బి 2 బి ఇన్వాయిస్ లేదా ఎగుమతి ఇన్వాయిస్, మరేదైనా పద్ధతిలో ఇన్వాయిస్ గా పరిగణించరాదు.

మార్చి 2020 లో, ఈ-ఇన్వాయిస్ అమలు తేదీని 2020 అక్టోబర్ 1 వరకు పొడిగించారు. కోవిడ్-19 లాక్డౌన్ కారణంగా పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న కష్టాలను దృష్టిలో ఉంచుకుని, జూలై 2020 లో, పన్ను చెల్లింపుదారులు మొత్తం రూ .500 కోట్లు మరియు అంతకంటే ఎక్కువ టర్నోవర్ కలిగి ఉన్నవారు 2020 అక్టోబర్ 1 నుండి అమల్లోకి వచ్చేలా ఈ-ఇన్వాయిస్ ఇవ్వాలి. 

ఈ విషయంలో మొదటి నోటిఫికేషన్ వచ్చిన 9 నెలలకు పైగా అయినప్పటికీ, ఈ పన్ను చెల్లింపుదారులలో మొత్తం టర్నోవర్ రూ. 500 కోట్లు మరియు అంతకంటే ఎక్కువ ఉన్న కొంత మంది ఇంకా సిద్ధంగా లేరు. దీని ప్రకారం, చివరి అవకాశంగా, ఈ-ఇన్వాయిస్ అమలు యొక్క ప్రారంభ దశలో, నియమం 48 (4) ప్రకారం సూచించిన పద్ధతిని పాటించకుండా 2020 అక్టోబర్లో అటువంటి పన్ను చెల్లింపుదారులు జారీ చేసిన ఇన్వాయిస్లు చెల్లుబాటు అయ్యేవిగా పరిగణించబడాలని నిర్ణయించారు. మరియు సిజిఎస్టి చట్టం, 2017 లోని సెక్షన్ 122 కింద విధించే జరిమానా, అటువంటి నిబంధనలను పాటించనందుకు, అటువంటి ఇన్వాయిస్‌ల కోసం ఇన్వాయిస్ రిఫరెన్స్ నంబర్ (ఐఆర్ఎన్) ను ఇన్వాయిస్ రిఫరెన్స్ పోర్టల్ (ఐఆర్పి) ఇన్వాయిస్ తేదీ నుండి 30 రోజుల్లోపు పొందినట్లయితే మాఫీ అవుతుంది. 

ఒక ఉదాహరణతో ఇది వివరించబడింది: ఒకవేళ ఒక రిజిస్టర్డ్ వ్యక్తి ఐఆర్ఎన్ పొందకుండానే 2020 అక్టోబర్ 3 తేదీన ఇన్వాయిస్ జారీ చేసాడు కాని ఐఆర్పికి అటువంటి ఇన్వాయిస్ వివరాలను రిపోర్ట్ చేసి, ఇన్వాయిస్ యొక్క ఐఆర్ఎన్ ను నవంబర్ 2, 2020 న లేదా అంతకు ముందు పొందినట్లయితే, సిజిఎస్టి నిబంధనలు, 2017 లోని నియమం 48 (5) యొక్క నిబంధనలు పాటించబడిందని మరియు సిజిఎస్టి  చట్టం, 2017 లోని సెక్షన్ 122 ప్రకారం విధించే జరిమానా కూడా మాఫీ అవుతుందని భావించబడుతుంది.

1 నవంబర్ 2020 నుండి జారీ చేసిన ఇన్వాయిస్‌లకు అటువంటి సడలింపు లభించదని మరియు సిజిఎస్‌టి రూల్స్ 2017 లోని 48 (4) నిబంధనలను ఉల్లంఘిస్తూ జారీ చేసిన ఇన్వాయిస్‌లు చెల్లుబాటు కావు, సిజిఎస్‌టి చట్టం మరియు నిబంధనల యొక్క అన్ని వర్తించే నిబంధనలు ఈ ఉల్లంఘనకు వర్తిస్తాయి. .

****



(Release ID: 1660825) Visitor Counter : 186


Read this release in: English , Hindi