ప్రధాన మంత్రి కార్యాలయం
భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, డెన్ మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్ సెన్ ల మధ్య వర్చువల్ ద్వైపాక్షిక శిఖర సమ్మేళనం
Posted On:
27 SEP 2020 10:19PM by PIB Hyderabad
1. భారతదేశం ఆధ్వర్యం లో భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, డెన్ మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్ సెన్ ల మధ్య ఒక వర్చువల్ ద్వైపాక్షిక సమ్మేళనం జరగనుంది.
2. భారతదేశం-డెన్ మార్క్ ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు సూచిక గా ఈ రెండు దేశాలకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధివర్గాల సందర్శనలు క్రమం తప్పక జరుగుతూ వస్తున్నాయి. అంతేకాదు, భారతదేశం-డెన్ మార్క్ ల ద్వైపాక్షిక సంబంధాలు పరస్పర చరిత్రాత్మక బంధాలపై, ఉమ్మడి ప్రజాస్వామిక సంప్రదాయాలపై, ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, సుస్థిరత్వాలపై ఆధారపడి ఉన్నాయి.
3. భారతదేశం-డెన్ మార్క్ ల మధ్య వస్తువులు, సేవల ద్వైపాక్షిక వ్యాపారం 2016 వ సంవత్సరం లో 2.82 బిలియన్ యుఎస్ డాలర్ లుగా ఉండగా, 2019 వ సంవత్సరాని కి వచ్చే సరికి 30.49 శాతం వృద్ధి చెంది 3.68 బిలియన్ యుఎస్ డాలర్ లకు చేరుకొంది. భారతదేశం లో షిప్పింగ్, నవీకరణీయ శక్తి, పర్యావరణం, వ్యవసాయం, ఫూడ్ ప్రోసెసింగ్, పట్టణ ప్రాంతాలను ఆకర్షణీయమైన విధంగా అభివృద్ధి చేయడం వంటి రంగాలలో దాదాపు 200 డెనిశ్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. అనేక ప్రధాన డెనిశ్ కంపెనీలు ‘మేక్ ఇన్ ఇండియా’ పథకం లో భాగం గా కొత్త తయారీ కర్మాగారాలను కూడా నిర్మించాయి. డెన్ మార్క్ లో సమాచార, సాంకేతిక విజ్ఞానం (ఐటి), నవీకరణీయ శక్తి, ఇంజినీరింగ్ రంగాలలో భారతదేశాని కి చెందిన సుమారు 25 కంపెనీలు కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.
4. భారతదేశాని కి, డెన్ మార్క్ కు మధ్య మేధా సంపద (ఐపి) సంబంధి సహకారం రంగంలో ఒక అవగాహన పూర్వక ఒప్పంద పత్రం పై ఈ సందర్భం లో సంతకాలయ్యాయి. అంతర్జాతీయ సౌరకూటమి (ఐఎస్ఎ) లో డెన్ మార్క్ చేరిక కూడా ఈ సందర్భం గా చోటు చేసుకొన్న మరొక ప్రధాన పరిణామం అని చెప్పాలి.
5. ఇరు దేశాల మైత్రిపూర్వక సంబంధాలు కాల పరీక్షకు తట్టుకొని నిలచిన నేపథ్యం లో, ఉభయ దేశాల సంబంధాలను నిర్దేశిస్తున్న స్థూల ఫ్రేమ్ వర్క్ ను సంపూర్ణం గా సమీక్షించేందుకు ఇరువురు నేతల కు ఒక అవకాశాన్ని ఈ వర్చువల్ ద్వైపాక్షిక శిఖర సమ్మేళనం ప్రసాదిస్తోంది. దీంతో పాటు ద్విపక్షాల ప్రయోజనాలు ముడిపడ్డ సహకార పూర్వక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ వర్చువల్ ద్వైపాక్షిక శిఖర సమ్మేళనం స్థూల రాజకీయ మార్గ నిర్దేశం కూడా చేయనుంది.
***
(Release ID: 1660013)
Visitor Counter : 167
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam