భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
వాయువ్య భారతంలోని కొన్ని ప్రాంతాల నుండి ఈ రోజు నైరుతి రుతుపవనాల ఉపసంహరణ
- సాధారణంగా సెప్టెంబరు 17న నైరుతి రుతుపవనాలు ఉపసంహరణ
Posted On:
28 SEP 2020 5:43PM by PIB Hyderabad
భారత వాతావరణ శాఖ యొక్క జాతీయ వాతావరణ కేంద్రం సూచన ప్రకారం:
వాయువ్య భారతదేశంలోని పశ్చిమ భాగాలలో తక్కువ ట్రోపోస్పిరిక్ స్థాయిలలో యాంటీ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పాటు, తేమ మరియు వర్షపాతం గణనీయంగా తగ్గిన దృష్ట్యా, నైరుతి రుతుపవనాలు పశ్చిమ రాజస్థాన్ మరియు పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల నుండి ఈ రోజు (28 సెప్టెంబరు, 2020) ఉపసంహరించాయి.
సెప్టెంబర్ 17, 2020 నుంచి సాధారణంగా వీటి ఉపసంహరణ మొదలవుతుంది.
గత ఐదేండ్లలో పశ్చిమ రాజస్థాన్ నుండి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ మొదలైన తేదీలు ఇలా ఉన్నాయి:
2019 లో అక్టోబర్ 09న..
2018 లో సెప్టెంబర్ 29న..
2017 లో సెప్టెంబర్ 27న..
2016 లో సెప్టెంబర్ 15న..
2015 లో సెప్టెంబర్ 04న..
ఉపసంహరణ మార్గం అమృత్సర్, భటిండా, హనుమన్‌ఘర్, బికనీర్, జైసల్మేర్ గుండా వెళుతోంది మరియు అక్షాంశం 26 ° N / రేఖాంశము 70 ° E గుండా వెళుతోంది (అనుబంధం 1).
రాబోయే 2-3 రోజుల్లో రాజస్థాన్ & పంజాబ్ లోని మరికొన్ని ప్రాంతాలు మరియు హర్యాణా, ఛండీగఢ్ , ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ జరిగేలా పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి.
మరోవైపు,
- తూర్పు బీహార్ నుంచి ఆంధ్రప్రదేశ్ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం గుండా పశ్చిమ బెంగాల్‌లోని గాంగ్‌టాక్, ఒడిశా తీర ప్రాంతం వరకు తక్కువ ట్రోపోస్పిరిక్ స్థాయిలో తుఫాను ప్రసరణ కొనసాగుతోంది. ఈ వ్యవస్థ ప్రభావంతో:
- ఈ వ్యవస్థ ప్రభావంతో రానున్న మూడు రోజుల కాలంలో భారత దక్షిణ ద్వీపకల్పంపై మితమైన ఉరుములు, మెరుపులతో కూడిన విస్తృత వర్షపాతం విస్తరించి ఉంది.
- వచ్చే 2 రోజులలో తమిళనాడులో వివిక్త భారీ వర్షపాతం కురిసే అవకాశం ఉంది. దీనికి తోడు సెప్టెంబర్ 29న మంగళవారం రాయలసీమ, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక మరియు కేరళలో కూడా భారీ వర్షపాతం కురిసే అవకాశం ఉంది.
- రానున్న 5 రోజులలో వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ఎక్కువగా
పొడి వాతావరణం ఉంటుంది.
- రాబోయే 12 గంటలలో భారతదేశ ఉత్తర ద్వీపకల్పం, మధ్య మరియు ఈశాన్య భారతదేశంలోని వివిక్త ప్రదేశాలలో మెరుపులతో పాటు మితమైన ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.
మరిన్ని వివరాలు, సూచన నవీకరణల కోసం ఐఎండీ, న్యూఢిల్లీ యొక్క వెబ్‌సైట్ http://www.mausam.imd.gov.inను సందర్శించండి:
జిల్లా స్థాయి హెచ్చరిక కోసం, వాతావరణ కేంద్రాలు / ప్రాంతీయ వెబ్‌సైట్‌ను సందర్శించండి
రాష్ట్ర స్థాయిలో ఐఎండీ యొక్క వాతావరణ కేంద్రాలు
స్థానిక నిర్దిష్ట సూచన & హెచ్చరిక కోసం 'మౌసమ్ యాప్'ను, అగ్రో సంబంధిత సలహా సమాచారానికి 'మేఘదూత్ యాప్'ను ఉరుములు మెరుపులు సంబంధిత
హెచ్చరికల గురించి 'దామిని యాప్'ను డౌన్‌లోడ్ చేసుకోగలరు.
Annexure 1

FORECAST:

*****
(Release ID: 1659964)
Visitor Counter : 614