హోం మంత్రిత్వ శాఖ
పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా పుష్ప నివాళి సమర్పించిన కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా
పశ్చిమ దేశాలను గుడ్డిగా అనుకరించకుండా, భారతీయ నీతిలోకి లోతుగా చొచ్చుకుపోయేలా ఒక భావజాలాన్ని పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ నిర్మించారు: అమిత్ షా
పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ దృక్పథాన్ని ఆధారంగా చేసుకుని, పేదల సంక్షేమం కోసం రూపొందించిన అంత్యోదయ పథకాన్ని గత ఆరేళ్లుగా ప్రధాని మోదీ కొనసాగిస్తున్నారు: అమిత్ షా
పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలు, సమాజ శ్రేయస్సు పట్ల ఆయన అంకితభావం దేశ సేవ పట్ల ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి: అమిత్ షా
నాడు పోస్టు చేయడమైనది:
25 SEP 2020 9:04PM by PIB Hyderabad
పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా, ఆయన చిత్రపటానికి, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా పుష్పాంజలి ఘటించారు. "భరతమాత ధీరోదాత్త కుమారుడికి నా వినయపూర్వక నివాళులు. ఎంత ఎదిగినా ఒదిగివుండే తత్వానికి ఆయన నిదర్శనం. దేశంలో ప్రగతిశీల రాజకీయాలకు మార్గదర్శకుడు" అని అమిత్ షా చెప్పారు.
"పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ దృక్పథాన్ని ఆధారంగా చేసుకుని, పేదల సంక్షేమం కోసం రూపొందించిన అంత్యోదయ పథకాన్ని గత ఆరేళ్లుగా ప్రధాని మోదీ కొనసాగిస్తున్నారు. ఈ పథకం కింద, వంటగ్యాస్, విద్యుత్, మరుగుదొడ్లు, ఇళ్లు, ఆరోగ్య సదుపాయాలను దాదాపు 60 కోట్ల పేద కుటుంబాలకు మోదీ ప్రభుత్వం అందిస్తోంది"
స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలోనే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఒక భావజాలాన్ని నిర్మించారు. మన దేశం అప్పుడే కొత్తగా ప్రయాణం మొదలుపెట్టి, పథకాలను రూపొందిస్తోంది. పశ్చిమ దేశాలను గుడ్డిగా అనుకరించకుండా, భారతీయ నీతిలోకి లోతుగా చొచ్చుకుపోయే భావజాలాన్ని పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ రూపొందించారు"
"దేశాభివృద్ధిలో ఆయన సహకారం, ముఖ్యంగా పేదల ప్రజల సంక్షేమం, మన విధానాల్లో ఆయన పాత్ర ఎప్పటికీ మరువలేనిది. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలు, సమాజ శ్రేయస్సు పట్ల ఆయన అంకితభావం దేశ సేవ పట్ల ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి" అని అమిత్ షా చెప్పారు.
*****
(రిలీజ్ ఐడి: 1659243)
సందర్శకుల సూచీ సంఖ్య : : 151