యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

వయసుకు తగ్గ ఫిట్ నెస్ ప్రొటోకాల్స్ ఆవిష్కరించిన ప్రధాని

ఫిట్ ఇండియా తొలి వార్షికోత్సవం సందర్భంగా ఫిట్ నెస్ ఔత్సాహికులతో సంభాషణ

ప్రతి వయోవర్గపు ఫిట్ నెస్ ప్రయోజనాలకూ భిన్న కోణాలున్నాయి: ప్రధాని

Posted On: 24 SEP 2020 6:13PM by PIB Hyderabad

ఫిట్ ఇండియా ఉద్యమం తొలి వార్షికోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వయసుకు తగిన ఫిట్ నెస్ ప్రొటోకాల్స్ ను ఆవిష్కరించారు. ఈ రోజు ఢిల్లీనుంచి వర్చువల్ పద్ధతిలో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్రీడాకారులు, ఫిట్ నెస్ నిపుణులు తదితరులతో ఆయన సంభాషించారు. ఈ సంభాషణ చాలా సరదాగా సాగింది. ఇందులో పాల్గొన్నవారు ప్రధానితో తమ జీవిత అనుభవాలను, ఫిట్ నెస్ మంత్రా ను పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖామంత్రి శ్రీ కిరెన్ రిజుజు కూడా పాల్గొన్నారు.

 

 ఫిట్ నెస్, ఆరోగ్యం తదితర అంశాలమీద తమ ఆలొచనలను పంచుకున్న ప్రభావశీలురలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, ఫైట్ నెస్ ఐకాన్  మిలింద్ సోమన్, పారాలింపిక్స్ స్వర్ణపతక విజేత దేవేంద్ర జఝారియా, పోషకాహార నిపుణులు రుజుతా ద్వివేకర్ ఉన్నారు. ఆమె స్థానిక దినుసులతో పోషకాహారం తీసుకోవాలన్న వాదనను బలంగా గొంతెత్తి వినిపిస్తున్న సంగతి తెలిసిందే. చాలా చిన్న చిన్న ఫిట్ నెస్ సూత్రాలు పాటించాలనే బోధించటంతోబాటు ఆమె డైట్, న్యూట్రిషన్ మీద అనేక సుప్రసిద్ధ గ్రంథాలు రచించారు. జమ్మూ కశ్మీర్ కు చెందిన మహిళా పుట్ బాలర్ అఫ్షాన్ ఆషిక్ (ప్రస్తుతం బాలికలకు ఫుట్ బాల్ లో శిక్షణ ఇస్తున్నారు). బీహార్ యోగా పాఠసాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐఐటి, ఎం ఐటి మాజీ విద్యార్థి స్వామి శివధ్యానం సరస్వతి, భారతీయ మండల్ కు చెందిన ముకుల్ కనిత్కర్ కూడా వీరిలో ఉన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, ఫిట్ ఇండియా చర్చ ప్రధానంగా ప్రతి వయోవర్గపు ప్రయోజనాలమీద దృష్టి సారిస్తుందని, ఆది ఫిట్ నెస్ లో విభిన్నమైన కోణాలను ప్రదర్శిస్తుందని అన్నారు. ఏడాది లోపే ఫిట్ నెస్ ఉద్యమం సానుకూల దృక్పథంతో ఒక ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకున్నదన్నారు. ఆరోగ్యం గురించి, ఫిట్ నెస్ గురించి దేశంలో ఎప్పటికప్పుడు అవగాహన కూడా పెరుగుతోందన్నారు. దీనివలన చురుకుదనం పెరుగుతోందని ప్రధాని వ్యాఖ్యానించారు. మన సహజసిద్ధమైన స్పృహలో యోగాసనాలు, వ్యాయామం, నడక, పరుగు, ఈత, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవనశైలి ఇప్పుడు భాగాలయ్యాయన్నారు. ఎన్ని నిబంధనలు ఉన్నప్పటికీ కరోనా సమయంలో ఫిట్ ఇండియా ఉద్యమం దాని ప్రభావాన్ని, అవసరాన్ని  చాటిచెప్పిందని ప్రధాని గుర్తు చేశారు.

 

ఫిట్ గా ఉండటమన్నది కొంతమంది భావిస్తున్నట్టుగా కష్టమైన పనేమీ కాదన్నారు. కొద్దిపాటి క్రమశిక్షణ, కొద్దిపాటి శ్రమతోనే  ఆరోగ్యం సాధించవచ్చునన్నారు. రోజుకు అరగంట ఫిట్ నెస్ డోస్ చాలునని ప్రధాని హితవు పలికారు. యోగ, బాడ్మింటన్, టెన్నిస్ , ఫుట్ బాల్, కరాటే, కబడ్దీ లాంటివి రోజుకు కనీసం అరగంట సేపు ప్రాక్టీస్ చెస్తే చాలునని సూచించారు. ఈ రోజు ఆరోగ్య మంత్రిత్వసాక, యువజన మంత్రిత్వశాఖ కలసి ఫిట్ నెస్ ప్రొటోకాల్స్ విడుదల చేశాయన్నారు.

ఫిట్ నెస్ మీద అవగాహన్ ఇప్పుడు విశ్వ వ్యాప్తం అయిందని గుర్తు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైట్, శారీరక శ్రమ, ఆరోగ్యం మీద ఒక విశ్వవ్యాప్త వ్యూహాన్ని రూపొందించిందన్నారు. వ్యాయామం మీద ఒక అంతర్జాతీయ సిఫార్సు జారీ చేయటాన్ని ప్రధాని ప్రస్తావించారు. ఈ రోజు ఆస్ట్రియా, జర్మనీ, బ్రిటన్, అమెరికా లాంటి దేశాలు ఫిట్ నెస్ కోసం కొత్త లక్ష్యాలు నిర్ణయించుకొని ఆ దిశగా పనిచేస్తున్నయన్నారు. అనేక దేశాలలో పెద్ద ఎత్తున ఈ విషయంలో ప్రచారం సాగుతోందన్నారు. అనేకమంది పౌరులు ఈ రోజువారీ వ్యాయామంలో భాగస్వాములవుతున్నారని చెప్పారు.

ఫిట్ నెస్ ప్రభావ శీలురతో ప్రధాని సంభాషణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1658729

కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖామంత్రి శ్రీ కిరెన్ రిజిజు మాట్లాడుతూ, ఈ విశిష్ట కార్యక్రమం కోసం మైగవ్ పోర్టల్ లో కోటిమందికి పైగా నమోదు చేసుకున్నారన్నారు. ప్రధాని ఆలోచనలకు అనుగుణంగా ఈ ఫిట్ ఇండియా సంభాషణ కార్యక్రమం రూపుదిద్దుకోవటాన్ని గుర్తు చేశారు. నిరుడు ప్రధాని దీనిని ప్రజలు నడిపే  ప్రజా ఉద్యమంగా మార్చాలని పిలుపునిచ్చారని ఈ ఏడాది కాలంలో మంచి పురోగతి కనబడటం ఆనందంగా ఉందని అన్నారు. 5-18, 18-65, 65 ఏళ్లకు పైబడ్దవారు అనే మూడు రకాల వయోవర్గాలకోసం ఫిట్ నెస్ ప్రొటోకాల్స్ తయారు చేశామని మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు.

 

ప్రధాని ఆలోచనలనుంచి పుట్టుకొచ్చిన ఫిట్ ఇండియ ఉద్యమాన్ని ఆయన నిరుడు ఆగస్టు 29న ఆవిష్కరించారు. ఇందులో 3.5 కోట్లమంది భారతీయులు దీనికి సంబంధించిన వివిధ ఈవెంట్లలో పాల్గొనగా2019 ఆగస్టు 15న జరిగిన ఒక్క ఫిట్ ఇండియా పరుగు లోనే 2 కోట్లమంది పాల్గొనటాన్ని మంత్రి గుర్తు చేశారు. డిజిటల్ రూపంలో దాదాపు 30 కోట్ల మంది పాల్గొనటాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.   

***



(Release ID: 1658804) Visitor Counter : 96