ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు ప్రయోజనాలు- ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ
Posted On:
23 SEP 2020 6:35PM by PIB Hyderabad
కోవిడ్-19 మహమ్మారి సంబంధిత పనుల విషయమై ఆశా కార్యకర్తలు చేస్తున్న కృషిని దృష్టిలో ఉంచుకొని కేంద్రం వారికి నెలకు రూ.1000ల మేర అదనంగా ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. అంతే కాకుండా ఆశాలకు ముసుగులు మరియు శానిటైజర్లు వంటి భద్రతా చర్యలను అందించాలని రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలను కోరడమైంది. ఇంకా, భారత్ కోవిడ్-19 అత్యవసర ప్రతిస్పందన మరియు ఆరోగ్య వ్యవస్థ సన్నాహక ప్యాకేజీ' కింద అందించిన వనరుల నుండి రాష్ట్ర/ కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు సందర్భోచితంగా అమలులో ఉన్న నిబంధనల ప్రకారం ఆరోగ్య కార్యకర్తలకు, కోవిడ్-19 విధుల్లో నిమగ్నమై ఉన్న సిబ్బందికి ప్రోత్సాహాన్ని అందించే సౌలభ్యం కల్పించబడింది. అన్నింటికంటే ఎక్కువగా ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలందరికీ జీవిత బీమా ప్రయోజనంను విస్తరించారు. ‘కోవిడ్-19పై పోరు చేస్తున్న ఆరోగ్య కార్యకర్తల కోసం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ బీమా పథకం’ కింద దీనిని ఈ ఏడాది మార్చి 30వ తేదీన ప్రకటించారు. ఈ పథకానికి సిద్ధం చేసిన మార్గదర్శకాల ఆధారంగా బీమా మొత్తాన్ని అందించడానికి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ న్యూ ఇండియా అష్యూరెన్స్ (ఎన్‌ఐఏ) కంపెనీ లిమిటెడ్‌తో కలిసి పని చేస్తోంది.
ఆరోగ్య సంరక్షణ ప్రదాతలకు ఈ బీమా పథకం కింద రూ.50 లక్షల వరకు బీమా రక్షణను కల్పిస్తుంది. విధి నిర్వహణలో భాగంగా కోవిడ్-19 రోగులతో ప్రత్యక్షంగా పరిచయం కలిగి ఉంటూ ఆ వ్యాధి సంక్రమణ బారిన పడే ప్రమాదం ఉన్న కమ్యూనిటీ హెల్త్ వర్కర్లతో సహా ఆరోగ్య సంరక్షణ ప్రదాతల భద్రతకు గాను ప్రభుత్వం ఈ బీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. కోవిడ్-19 సంబంధిత విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు ప్రాణనష్టం జరిగితే బీమా పరిహారం అందించే అంశమూ ఇందులో భాగంగా ఉంది. ప్రయివేటు ఆసుపత్రిలో పని చేసే సిబ్బంది/ రిటైర్డ్ సి/ వాలంటీర్లు / స్థానిక పట్టణ సంస్థల్లో సిబ్బంది/ కాంట్రాక్ట్ / రోజువారీ వేతనం / తాత్కాలిక సిబ్బందితో పాటుగా.. కోవిడ్-19 వ్యాధి సంబంధిత బాధ్యతల నిర్వర్తనకు గాను ముసాయిదాలో చేర్చిన రాష్ట్రాలు/ కేంద్ర ఆస్పత్రులు/ సెంట్రల్ / స్టేట్స్ / యుటీలకు చెందిన స్వయంప్రతిపత్త కలిగిన ఆసుపత్రులు, ఎయిమ్స్ ఆస్పత్రులు మరియు ఐఎన్ఐలు/ కేంద్ర మంత్రిత్వ శాఖల ఆస్పత్రులు చేర్చుకున్న అవుట్ సోర్స్‌సిబ్బందికి కూడా ఈ బీమా రక్షణ కల్పించడమైంది.
ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ లబ్ధిదారుల వివరాలు:
20.09.2020 నాటికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కోవిడ్-19 మహమ్మారి పై పోరాడుతూ బీమా పథకం పరిధిలోకి వచ్చే ఆరోగ్య కార్యకర్తల వివరాలు:
***
(Release ID: 1658408)
Visitor Counter : 94