మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

"ట్రాక్‌ చైల్డ్‌" పోర్టల్‌

Posted On: 23 SEP 2020 7:32PM by PIB Hyderabad

తప్పిపోయిన, దొరికిన చిన్నారుల వివరాలను గుర్తించడానికి "ట్రాక్‌ చైల్డ్‌" వెబ్‌ పోర్టల్‌ను 'కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ' రూపొందించింది. కేంద్ర హోంశాఖ, రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు/యూటీలు, బాలల సంరక్షణ కమిటీలు, బాలల న్యాయ బోర్డులు, జాతీయ న్యాయ సేవల అథారిటీ సహా వివిధ వర్గాల సాయంతో ఈ పోర్టల్‌ నిర్వహణ కొనసాగుతోంది. రాష్ట్రాలు/యూటీల అవసరాలకు అనుగుణంగా, "ట్రాక్‌ ఛైల్డ్‌" పోర్టల్‌పై జాతీయ సమాచార కేంద్రం క్రమం తప్పకుండా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

    కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్‌ ఇరానీ, లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని లోక్‌సభకు సమర్పించారు.

***


(Release ID: 1658396) Visitor Counter : 186


Read this release in: English , Urdu , Punjabi