ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ముఖ మాస్క్‌ల వినియోగం, పారవేసే విషయమై మార్గదర్శకాలు
Posted On:
23 SEP 2020 6:52PM by PIB Hyderabad
వ్యక్తిగత రక్షణ పరికరాల (పీపీఈ) హేతుబద్ధమైన ఉపయోగం విషయమై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజాగా తగు మార్గదర్శకాలను జారీ చేసింది. ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు మరియు కోవిడ్-19పై పోరులో ముందు నిలిచి పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తలకు ఉపయుక్తంగా ఉండేలా మెడికల్ మాస్క్‌లతో సహా వ్యక్తిగత రక్షణ పరికరాల విషయమై అనుసరించాల్సిన తగు విధివిధానాలు మరియు ప్రమాణాలను ఇందులో జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెబ్‌సైట్‌లోని పబ్లిక్ డొమైన్‌లో వీటిని అందుబాటులో ఉంచారు. ఇంట్లో తయారు చేసిన రక్షణ కవచాన్ని(ముఖ మాస్క్‌తో) ముఖం మరియు నోటిని తగిన విధంగా కప్పుకొనేలా ఎలా ఉపయోగించాలనే విషయమై సాధారణ ప్రజల ఉపయోగార్థం భారత ప్రభుత్వం సలహా మరియు మాన్యువల్‌ను జారీ చేసింది. తొలత దేశంలో ఒక్క తయారీదారుడు కూడా లేని స్థితి నుంచి నేడు దేశంలో 1100 మంది పీపీఈ కిట్ల తయారీదారులు అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వం తగు అభివృద్ధి చర్యలు చేపట్టింది. వీరిలో ఎక్కువ మంది ఎంఎస్‌ఎంఈ రంగానికి చెందినవారే కావడం గమనార్హం. ప్రస్తుత అంచనా మేరకు దేశంలో పీపీఈ కవరాల్స్ యొక్క ఉత్పత్తి సామర్థ్యం రోజుకు దాదాపు 5 లక్షలకు చేరింది. అవసరం మేరకు డిమాండ్‌ను తీర్చడానికి అదనపు సామర్థ్యాన్ని సృష్టించే అవకాశాన్ని కూడా ఈ సంస్థలు కలిగి ఉన్నాయి. ఆరోగ్యం అనేది రాష్ట్ర పరిధిలోని విషయం. ఇప్పటికే జారీ చేసిన విధివిధానాల మేరకు.. రాష్ట్రాలు బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన వివరణాత్మక మార్గదర్శకాలను పాటించాలి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కోవిడ్-19 రోగుల చికిత్స/ రోగ నిర్ధారణ / క‌్వారంటైన్ యొక్క సమయంలో ఉత్పత్తి చేయబడే ఆయా వ్యర్థాలను నిర్వహించడం శుద్ధి చేయడం మరియు పారవేసే విషయంలో తగు మార్గదర్శకాలను జారీ చేసింది. వివిధ ఫెసిలిటీల ఆధారిత మరియు ఇంటి వద్ద రోగుల వ్యర్థాల శుద్ధి విషయమై మంత్రిత్వ శాఖ ఆయా మార్గదర్శకాలను జారీ చేసింది.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే ఈ రోజు లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
****
(Release ID: 1658384)
Visitor Counter : 184