శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 నమూనాల ను పరీక్షించడం లో అతి తక్కువ సగటుసమయాన్ని నమోదు చేసిన లఖ్ నవూ ప్రయోగశాల
Posted On:
23 SEP 2020 2:11PM by PIB Hyderabad
కొవిడ్-19 నమూనాల ను ప్రోసెస్ చేయడం లో లఖ్ నవూ లోని ఒక పరీక్షా కేంద్రం దేశంలోని సంస్థలన్నింటిలోకి అతి తక్కువ సగటు సమయాన్ని నమోదు చేసింది.
ఒక్క రోజు లో 1,000 నుంచి 1,200 నమూనాలను పరీక్షిస్తూ, బీర్ బల్ సాహ్ నీ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ పాలియసైన్సెస్ (బిఎస్ఐపి) ఒక్క ఉత్తర్ ప్రదేశ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పేరు తెచ్చుకొంది. విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞాన విభాగం (డిఎస్ టి) ఆధ్వర్యం లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థే బిఎస్ఐపి.
8 మంది సభ్యుల చిన్న జట్టు తో ఈ ప్రయోగశాల ఉత్తర్ ప్రదేశ్ లోని వివిధ జిల్లాల నుంచి అందుకున్న నమూనాల ను పరీక్షించడం కోసం రోజులో 24 గంటలూ నిర్విరామంగా తన కార్యకలాపాల ను నిర్వహిస్తోంది. బిఎస్ఐపి ఇంతవరకు పరీక్షించిన నమూనాల సంఖ్య 50,000 ను మించింది. వీటిలో ఇంచుమించు 1,600 నమూనాలు ఎస్ఎఆర్ఎస్-సిఒవి-2 పరంగా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ మహమ్మారిని కట్టడి చేయడం లో అధికార యంత్రాంగానికి చేదోడు గా ఉండటానికి బిఎస్ఐపి తన పరీక్షా నివేదికల ను సంబంధిత జిల్లాలకు (రోజువారీ ప్రాతిపదికన) 24 గంటల రికార్డు సమయంలో అందిస్తోంది.
బిఎస్ఐపి ఈ ఏడాది మే నెల 2వ తేదీ మొదలుకొని ఆర్ - పిసిఆర్ ఆధారిత పరీక్షల ను నిర్వహించడం మొదలుపెట్టింది. లఖ్ నవూ కు చెందిన అయిదు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఈ పరీక్షలను మొదలుపెట్టగా ఆ సంస్థల లో మొట్టమొదటి సంస్థ అనే ఖ్యాతి ని బిఎస్ఐపి యే దక్కించుకొంది. బిఎస్ఐపి కొవిడ్-19 మహమ్మారికి సంబంధించిన పరిశోధన కార్యకలాపాలలో సైతం చురుకు గా పాలుపంచుకొంటోంది.
*****
(Release ID: 1658366)
Visitor Counter : 175