వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

లాక్ డౌన్ కాలంలో నిత్యావసర వస్తువుల సరఫరా పై ప్రత్యేక శ్రద్ధ

Posted On: 23 SEP 2020 1:33PM by PIB Hyderabad

కొవిడ్-19 మహమ్మారి ని దృష్టి లో పెట్టుకొని లాక్ డౌన్ ను ప్రకటించిన నేపథ్యం లో 8 నెలల పాటు అంటే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ సంవత్సరం నవంబర్ వరకు ‘ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’ (పిఎంజికెఎవై) లో భాగంగా జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఎ), 2013 లబ్ధిదారులందరికీ నెలకు తలా అయిదు కిలోల ఆహారధాన్యాలు, ఒక్కొక్క కుటుంబానికి నెలకు ఒ కిలో పప్పుధాన్యాల చొప్పున ప్రభుత్వం ఉచితం గా పంపిణీ చేసిందని కేంద్ర వినియోగదారు వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి శ్రీ దాన్వే రావు సాహెబ్ దాదారావు బుధవారం రాజ్య సభ లో ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానం లో తెలిపారు.

పిఎంజికెఎవై ఒకటో దశలో 5,48,172.44 మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాల ను ఈ ఏడాది ఏప్రిల్ మొదలుకొని జూన్ వరకు మొత్తం 18.27 కోట్ల లబ్ధిదారు కుటుంబాలకు పంపిణీ చేయడమైంది. పిఎంజికెఎవై రెండో దశను ఈ ఏడాది నవంబర్ వరకు అమలు చేయనున్నారు.

దీనికి తోడు, ఆత్మనిర్భర్ భారత్ (ఎఎన్ బి) లో భాగం గా ఎన్ఎఫ్ఎస్ఎ పరిధిలో లేని వలస శ్రామికులకు ఒక్కొక్క వ్యక్తి కి అయిదు కిలోల ఆహారధాన్యాలు, ఒక్కొక్క కుటుంబానికి ఒక కిలో చొప్పున పప్పు ధాన్యాలను ఉచితం గా రెండు నెలల పాటు, అంటే ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో పంపిణీ చేయడమైందని మంత్రి వివరించారు.

 

పిఎంజికెఎవై, ఎ.ఎన్.బి ల ద్వారా లాక్ డౌన్ కాలంలో అత్యవసర ఆహార పదార్థాలు అందుబాటులో ఉండేటట్లు శ్రద్ధ తీసుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు.

 

****


(Release ID: 1658363) Visitor Counter : 160


Read this release in: Urdu , English , Marathi , Tamil