ఉక్కు మంత్రిత్వ శాఖ
ఎగుమతుల్లో పోటీతత్వాన్ని పెంచడానికి వివిధ చర్యలు
నాడు పోస్టు చేయడమైనది:
19 SEP 2020 6:09PM by PIB Hyderabad
ఉక్కు రంగం ఎగుమతుల్లో పోటీతత్వాన్ని పెంచడానికి ప్రభుత్వం వివిధ చర్యలను చేపట్టింది. ఆ చర్యలు ఇవి:
(i) ఇండియా నుంచి వార్ధక్యపు సరుకుల ఎగుమతి స్కీము (ఎం ఈ ఐ ఎస్), మార్కెట్ ప్రవేశ సౌలభ్యం, ఎగుమతి ప్రోత్సాహక మండలి, ముందుగా అనుమతించడం, పెట్టుబడి వస్తువుల ఎగుమతి ప్రోత్సాహం (ఈ ఫై సి జి) మొదలగునవి
(ii) కీలకమైన కారుబొగ్గు, ఇనుప ఖనిజం, ఉక్కు రద్దు ముక్కలు, నికెలు వంటి ముడి పదార్ధాలపై దిగుమతి సుంకం తక్కువగా ఉంచడం
(iii) బహుళ నమూనా వసతి, రవాణాను ప్రోత్సహించడం మరియు సరుకుల తరలింపు మరియు రవాణా ఖర్చులను తగ్గించడానికి దేశాంతర్గతంగా ఉన్న జలమార్గాలను వినియోగాన్ని పెంచడం
(iv) ఉక్కు రంగం మరింత పోటీతత్వాన్ని పెంచుకొని ఎగుమతుల్లో అభివృద్ధిని సాధించడానికి వీలుగా కంపెనీల అధీనంలో ఉన్న / వశమైన ఇనుప ఖనిజం గనుల కేటాయింపు మరియు ఉక్కు సముదాయాల ఏర్పాటుపై దృష్టి కేంద్రీకరణ
ఇండియాలో ప్రస్తుత సంవత్సరంలో అంటే 2020 ఏప్రిల్ - ఆగస్టు మధ్య కాలంలో మొత్తం తయారైన ఉక్కు (మిశ్రమం కానిది మరియు మిశ్రమలోహాలు / ఉక్కు) వినియోగం క్రితం సంవత్సరం ఇదే కాలంతో పోల్చినప్పుడు ఈ కింది విధంగా ఉంది -
వస్తువు:
మొత్తం తయారైన ఉక్కు (మిశ్రమలోహం + మిశ్రమం కానిది)
ఏప్రిల్ - ఆగస్టు 2020 (ఎం టి) ఏప్రిల్ - ఆగస్టు 2019 (ఎం టి) % మార్పు*
వినియోగం 26.41 42.54 -37.9
ఆధారం: ఉమ్మడి ప్లాంటు కమిటీ నివేదిక, ఎం టి= మిలియన్ టన్నులు *తాత్కాలిక
ఏప్రిల్ - ఆగస్టు 2020 మధ్య కాలంలో మొత్తం తయారైన ఉక్కు లభ్యత కూడా దిగువ సూచించిన విధంగా తగ్గింది. డిమాండులో తగ్గుదల వల్ల మిగులుకు దారితీయలేదు.
వస్తువు:
మొత్తం తయారైన ఉక్కు లభ్యత (మిశ్రమలోహాలు / ఉక్కు మరియు మిశ్రమం కానిది) ఏప్రిల్ నుంచి ఆగస్టు 2020 మధ్యలో (మిలియన్ టన్నులు)*
a) మొత్తం ఉత్పత్తి 29.05
b) దిగుమతులు 1.67
c) ఎగుమతులు 5.68
లభ్యత (a+b-c) 25.04
ఆధారం: ఉమ్మడి ప్లాంటు కమిటీ నివేదిక, ఎం టి= మిలియన్ టన్నులు *తాత్కాలిక
ఉక్కు అనియంత్రిత రంగంలో ఉన్నందువల్ల వాణిజ్య పరిస్థితుల పరిశీలన మరియు మార్కెట్ గమనం ఆధారంగా దేశీయ మరియు విదేశీ వర్తకం కోసం ఉక్కు కంపెనీలు తమ సొంత నిర్ణయాలు తీసుకుంటాయి
కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ లోక్ సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సంగతి తెలిపారు.
*****
(రిలీజ్ ఐడి: 1658039)
సందర్శకుల సూచీ సంఖ్య : : 128