మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఆన్‌లైన్ తరగతుల కోసం ఉపాధ్యాయుల శిక్షణకు పలు చర్యలు
Posted On:
22 SEP 2020 7:09PM by PIB Hyderabad
బహుళ సామర్థ్యాలపై ఉపాధ్యాయులకు ఆన్‌లైన్ కోర్సులను అందించడానికి దీక్ష
వేదిక తగిన అనుకూలతలను తీసుకువచ్చింది. ఇప్పటి వరకు ఆరు రాష్ట్రాలు,
ఎన్‌సీఆర్‌టీ మరియు సీబీఎస్ఈ ఇప్పటికే తమ కార్యక్రమాలను ప్రారంభించి 200కి పైగా కోర్సులను అప్‌లోడ్ చేశాయి. సమిష్టిగా ఇప్పటి వరకు 12 లక్షల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చాయి. దీంతో ఈ ఉపాధ్యాయులకు 8 కోట్ల లెర్నింగ్ సెషన్‌లు అందుబాటులోకి వచ్చాయి. అనుభవపూరితమైన అభ్యాసం, పెద్దల బోధనా సామర్థ్యాలు, ఐసీటీ మొదలైన వాటిపై సీబీఎస్ఈ 20 కోర్సులను అప్‌లోడ్ చేసింది. ఇప్పటికే లక్ష మందికి పైగా ఉపాధ్యాయులకు తగు శిక్షణ ఇచ్చింది. ఎన్‌సీఈఆర్‌టీ కూడా దీక్షను వినియోగించుకోవడం ప్రారంభించింది. ఇప్పటి వరకు రెండు కోర్సులను అప్‌లోడ్ చేసింది. దేశ వ్యాప్తంగా 40 లక్షల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే లక్ష్యంతో 'నిష్టా' శిక్షణా మాడ్యూళ్ళను అప్‌లోడ్ చేసింది. ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఇప్పటి వరకు 88 కోర్సులను మొదలు పెట్టాయి. గుజరాత్ 30, మధ్యప్రదేశ్ 11, హర్యాణా మరియు రాజస్థాన్ రెండూ ఐదు కోర్సుల్ని ప్రారంభించాయి. ఉపాధ్యాయుల అవసరాలకు తగినట్లు
ఇవి రూపొందించడమైంది. ఇది అధిక నమోదు మరియు అధిక శిక్షణ పూర్తి రేటుకు దారి తీస్తోంది. కోర్సులు https://diksha.gov.in/explore-course లో అందుబాటులో ఉన్నాయి.
కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఈ రోజు రాజ్యసభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని తెలియజేశారు.
***
(Release ID: 1657954)
Visitor Counter : 139