గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
వరుసగా గడిచిన ఐదేండ్లుగా 'స్వచ్ఛ్ సర్వేక్షన్'లో (ఎస్ఎస్ఎస్) మేటి పని తీరును ప్రదర్శిస్తున్న ఛండీగఢ్
प्रविष्टि तिथि:
22 SEP 2020 5:53PM by PIB Hyderabad
వరుసగా గడిచిన ఐదేండ్లలో ఛండీగఢ్ 'స్వచ్ఛ్ సర్వేక్షన్స్'లో (ఎస్ఎస్ఎస్)
స్థిరంగా మేటి పనితీరును ప్రదర్శిస్తోంది. ఇందులోని పారామితులలో ఒకటిగా ఘన వ్యర్థపదార్థాల నిర్వహణా(ఎస్‌డబ్ల్యూఎం) ఉంది. నగరాలకు గార్బేజ్ ఫ్రీ సిటీ (జీఎఫ్‌సీ) రేటింగ్ ప్రోటోకాల్‌లో.. ఛండీగఢ్ త్రీ స్టార్ సర్టిఫైడ్ నగరంగా ఉంది. ఎస్ఎండబ్ల్యూ పనితీరును మరింత మెరుగుపరచడానికి, ప్రభుత్వం వివిధ రకాల చర్యలు తీసుకుంది. ఇందులో ఎస్ఎండబ్ల్యూ ప్రాజెక్టులకు తగిన నిధులు సమకూర్చడం; ఎస్ఎండబ్ల్యూ పై తగిన ఆదేశాల జారీ, సలహాలు మరియు మార్గదర్శకాల జారీ (ఇంటింటికి సేకరణ, మూలంను వేరుచేయడం మరియు ప్రాసెసింగ్); సామర్థ్యం పెంపు (సీబీ) కార్యశాలల నిర్వహణ; క్రమానుగతంగా పనితీరును సమీక్షించడం మొదలైనవి ఉన్నాయి.
ఈ విషయాన్ని లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో గృహ మరియు
పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ హర్దీప్ సింగ్ పూరి తెలియజేశారు.
*****
(रिलीज़ आईडी: 1657920)
आगंतुक पटल : 136